Chiranjeevi: చిరంజీవి మాజీ అల్లుడు, శ్రీజ మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ మృతి- మోసం చేశారంటూ శ్రీ రెడ్డి పోస్ట్
Chiranjeevi Ex Son In Law Sirish Bharadwaj Died: మెగాస్టార్ చిరంజీవి మాజీ అల్లుడు, ఆయన చిన్న కూతురు శ్రీజ మొదటి భర్త అయినటువంటి శిరీష్ భరద్వాజ్ మరణించారు. ఈ నేపథ్యంలో కాంట్రవర్సీ నటీ శ్రీ రెడ్డి పోస్ట్ వైరల్ అవుతోంది. అనారోగ్య కారణాలతో శ్రీజ మాజీ భర్త చనిపోయినట్లు సమాచారం.
Sreeja First Husband Sirish Bharadwaj Died: టాలీవుడ్ మెగాస్టార్, పద్మ విభూషణ్ చిరంజీవి మాజీ అల్లుడు, ఆయన చిన్న కుమార్తె శ్రీజ మొదటి భర్త అయినటువంటి శిరీష్ భరద్వాజ్ మరణించారు. లంగ్స్ డ్యామేజ్ కావడంతో శిరీష్ భరద్వాజ్ కన్నుమూసినట్లు సమాచారం. దీంతో సినీ ఇండస్ట్రీలో కాస్తా విషాద ఛాయలు అలుముకున్నాయి.
అయితే, శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ మరణం పట్ల కాంట్రవర్సీ నటి శ్రీ రెడ్డి సోషల్ మీడియా వేదికా పోస్ట్ చేసింది. దాంతో ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ఆ పోస్ట్‌లో "(చిరంజీవి ఎక్స్ అల్లుడు) శిరీష్ భరద్వాజ్ ఇక లేడు. కనీసం రెస్ట్ ఇన్ పీస్ రా. శిరీష్ భరద్వాజ్ నిన్ను ప్రతి ఒక్కరూ మోసం చేశారు రా" అని రాసుకొచ్చిన శ్రీరెడ్డి ఏడుస్తున్న ఎమోజీలను యాడ్ చేసింది.
అలాగే శిరీష్ భరద్వాజ్ తన మాజీ భార్య శ్రీజ, పాపతో ఉన్న ఫొటోను షేర్ చేసింది శ్రీ రెడ్డి. సోషల్ మీడియాలో శ్రీ రెడ్డి పోస్ట్ పెట్టగానే క్షణాల్లో వైరల్ అయింది. దాంతో కామెంట్ సెక్షన్‌లో ఏమైంది, కనీసం న్యూస్ కూడా రావడం లేదు అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. వాటిలో ఒకరికి హార్ట్ ఎటాక్‌తో శిరీష్ భరద్వాజ్ చనిపోయినట్లు అంటున్నారు అని శ్రీ రెడ్డి సమాధానం ఇచ్చింది.
ఇదిలా ఉంటే, 2007లో శ్రీజ అండ్ శిరీష్ భరద్వాజ్ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అందుకు పెద్దలను సైతం ఎదిరించి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అప్పట్లో ఈ విషయం టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలన టాపిక్ అయిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ విషయం పెద్ద వివాదానికి దారి తీసింది.
అయితే, 2014 సంవత్సరంలో శ్రీజ, శిరీష్ భరద్వాజ్ దంపతులకు ఒక బిడ్డ పుట్టింది. అనంతరం శ్రీజ, శిరీష్ భరద్వాజ్ ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2016లో వ్యాపారవేత్త అయిన కల్యాణ్ దేవ్‌ను శ్రీజ రెండో వివాహం చేసుకుంది. 2016లో బెంగళూరులో వైభవంగా వీరిద్దరి వివాహం జరిగింది. అనంతరం ఈ జంటకు ఒక కుమార్తె జన్మించింది.
అనంతరం గతేడాది అంటే 2023లో కల్యాణ్ దేవ్, శ్రీజ కూడా విడిపోయారు. కాగా శ్రీజ మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ 2019లో మరో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత బీజేపీలో చేరి రాజీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అయితే, ఆరోగ్య సమస్యలతో హాస్పిటల్‌లో చేరిన శిరీష్ భరద్వాజ్ చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, కల్యాణ్ దేవ్ కూడా సినిమాలతో (Kalayn Dev Movies)బిజీగా ఉన్నాడు. 2018లో చిరంజీవి మూవీ టైటిల్ విజేతతో తెలుగులోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన కల్యాణ్ దేవ్ పర్వాలేదనిపించుకున్నాడు. తర్వాత నాలుగేళ్లకు అంటే 2022లో సూపర్ మచి అనే మరో మూవీతో అలరించాడు. అనంతరం కిన్నెరసాని మూవీతో ఓటీటీ ఎంట్రీ ఇచ్చాడు కల్యాణ్ దేవ్.
2022లోనే ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో కల్యాణ్ దేవ్ కిన్నెరసాని సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. కాగా కల్యాణ్ దేవ్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో శ్రీజకు, తన పిల్లలకు సంబంధించి ఎమోషనల్‌గా పోస్టులు పెడుతుంటాడు. అవి కూడా క్షణాల్లో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంటాయి.