Varun Tej: నా ఫేవరేట్ హీరోయిన్‌నే పెళ్లి చేసుకున్నాను.. వరుణ్ తేజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్-varun tej says he married his favourite heroine lavanya tripathi at operation valentine gagana song launch event ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Varun Tej: నా ఫేవరేట్ హీరోయిన్‌నే పెళ్లి చేసుకున్నాను.. వరుణ్ తేజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Varun Tej: నా ఫేవరేట్ హీరోయిన్‌నే పెళ్లి చేసుకున్నాను.. వరుణ్ తేజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Feb 07, 2024 07:01 AM IST

Varun Tej About Marrying Lavanya Tripathi: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్. తాజాగా ఈ సినిమా నుంచి రెండో సింగిల్ సాంగ్ గగనాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా లావణ్య త్రిపాఠి గురించి ఆసక్తికరమైన విషయం చెప్పాడు వరుణ్ తేజ్.

నా ఫేవరేట్ హీరోయిన్‌నే పెళ్లి చేసుకున్నాను.. వరుణ్ తేజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
నా ఫేవరేట్ హీరోయిన్‌నే పెళ్లి చేసుకున్నాను.. వరుణ్ తేజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Operation Valentine Gaganala Song Released: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ 'ఆపరేషన్ వాలెంటైన్'. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అద్భుతమైన పోస్టర్‌లు, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రామిస్ చేసిన గ్రిప్పింగ్ టీజర్, రిపబ్లిక్ డేకి ముందు దేశభక్తి జ్వాలని రగిలించిన ఫస్ట్ సింగిల్ సాంగ్ వందేమాతరంతో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ తెలుగు-హిందీ ద్విభాషా చిత్రం కొత్త విడుదల తేదీని ఇటీవలే అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

ఆపరేషన్ వాలెంటైన్ మార్చి 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. మరో నెలలో సినిమా థియేటర్లలోకి రానుంది కాబట్టి, ప్రమోషన్స్‌ ను మరింత దూకుడుగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్ స్కోర్ చేసిన మొదటి సింగిల్ వాఘా బోర్డర్‌లో ఇదివరకు లాంచ్ చేశారు. ఇప్పుడు తాజాగా ఆపరేషన్ వాలెంటైన్ మూవీ నుంచి రెండో పాటను విడుదల చేశారు.

మంగళవారం (ఫిబ్రవరి 6) నాడు ఆపరేషన్ వాలెంటైన్ మూవీ నుంచి గగనాల అనే లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఇందుకోసం మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్‌లో ప్రత్యేక ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు వరుణ్ తేజ్ సమాధానం ఇచ్చాడు. ఈ క్రమంలోనే "మీరు ఇప్పటివరకు చాలా సినిమాలు చేశారు కదా. మీ ఫేవరేట్ హీరోయిన్ ఎవరు?" అని ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పాడు వరుణ్ తేజ్.

"నిజానికి నా ఫేవరేట్ హీరోయిన్ అయిన లావణ్యను నేను వివాహం చేసుకున్నాను. అది నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు సాయి పల్లవి అంటే కూడా ఎంతో ఇష్టం. ఇక లావణ్య త్రిపాఠికి నేనే ముందు లవ్ ప్రపోజ్ చేశాను" అని వరుణ్ తేజ్ తన భార్య లావణ్య త్రిపాఠితో ప్రేమ గురించి తెలిపాడు. అనంతరం ఆపరేషన్ వాలెంటైన్ సినిమా గురించి వరుణ్ తేజ్ మాట్లాడాడు. ఆపరేషన్ వాలెంటైన్ మూవీ కోసం టీమ్ మొత్తం ఎంతో కష్టపడ్డారని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చాడు.

ఆపరేషన్ వాలెంటైన్ సినిమా తప్పకుండా విడుదల తర్వాత అందరినీ ఆకట్టుకుందనే నమ్ముతున్నాను అని వరుణ్ తేజ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే ఆపరేషన్ వాలెంటైన్ సినిమాలో 2017లో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న మానుషి చిల్లర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈమె తెలుగులోకి ఆపరేషన్ వాలెంటైన్ మూవీతో అరంగేట్రం చేస్తోంది. అయితే ఆపరేషన్ వాలెంటైన్ సినిమాలో మానుషి చిల్లర్ రాడార్ ఆఫీసర్‍‌ పాత్రలో అలరించేందుకు రెడీగా ఉంది.

ఆపరేషన్ వాలెంటైన్ సినిమాకు కుశక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించగా.. గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ (వకీల్ ఖాన్), నందకుమార్ అబ్బినేని సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం దేశంలోని వైమానిక దళ వీరుల అలుపెరగని పోరాటాని, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్ల అద్భుతంగా చూపించనున్నారు.

Whats_app_banner