Varun Sandesh: నా లుక్ చూసి చాలా కామెంట్స్ చేస్తున్నారు.. వాటికి సమాధానం ఇదే: వరుణ్ సందేశ్-varun sandesh reacts to trolling on his new look in viraaji movie varun sandesh about his look in viraji tollywood ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Varun Sandesh: నా లుక్ చూసి చాలా కామెంట్స్ చేస్తున్నారు.. వాటికి సమాధానం ఇదే: వరుణ్ సందేశ్

Varun Sandesh: నా లుక్ చూసి చాలా కామెంట్స్ చేస్తున్నారు.. వాటికి సమాధానం ఇదే: వరుణ్ సందేశ్

Sanjiv Kumar HT Telugu

Varun Sandesh About His Look In Viraaji: హ్యాపీడేస్ హీరో వరుణ్ సందేశ్ నటిస్తున్న మరో లేటెస్ట్ మూవీ విరాజీ. ఈ సినిమా కోసం వరుణ్ సందేశ్ కొత్త లుక్‌లో కనిపించాడు. అయితే ఈ లుక్‌పై ట్రోలింగ్, కామెంట్స్ రావడంతో వాటికి సమాధానం ఇదే అని వరుణ్ సందేష్ స్పందించాడు.

నా లుక్ చూసి చాలా కామెంట్స్ చేస్తున్నారు.. వాటికి సమాధానం ఇదే: వరుణ్ సందేశ్

Varun Sandesh About His Look In Viraaji: వరుసపెట్టి సినిమాలతో బిజీగా ఉంటున్నాడు హ్యాపీడేస్ ఫేమ్ వరుణ్ సందేశ్. ఈ యంగ్ హీరో లేటెస్ట్‌గా నటించిన థ్రిల్లర్ మూవీ విరాజీ. మహా మూవీస్, ఎమ్ 3 మీడియా పతాకంపై మహేంద్ర నాథ్ కూండ్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆద్యంత్ హర్ష దర్శకత్వం వహించారు.

విరాజీ చిత్రం ఆగస్టు 2న అంటే ఇవాళ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ హైలైట్స్‌ను లేటెస్ట్ ఇంటర్వ్యూలో తెలిపారు హీరో వరుణ్ సందేశ్. ఇందులో తన లుక్‌పై వచ్చిన కామెంట్స్‌పై స్పందించిన వరుణ్ సందేశ్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.

- విరాజీ మూవీలో నా లుక్ కొత్తగా ఉండేలా మా డైరెక్టర్ ఆద్యంత్ హర్ష డిజైన్ చేశారు. రెండు డిఫరెంట్ కలర్స్‌లో వెరైటీగా హెయిర్ స్టైల్, ముక్కు పుడక, టాటూస్ తో ఒక కొత్త మేకోవర్ చేయించారు. నాకు కథ కంటే ముందు నేను ఈ సినిమాలో చేసిన ఆండీ క్యారెక్టర్ లుక్ ఎలా ఉంటుందో డైరెక్టర్ వివరించారు. సినిమా కంప్లీట్ అయ్యాక ఇప్పుడు ప్రమోషన్ కోసం మళ్లీ ఆ లుక్ లోనే కనిపిస్తున్నా. మీకు త్వరగా రిజిస్టర్ అయ్యి రీచ్ అవ్వాలంటే కొత్తగా కనిపించాలి.

- విరాజి ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. మెంటల్ ఆస్పత్రి దగ్గర కొద్దిమంది ఉంటారు. వారి దగ్గరకు ఆండీ వస్తాడు. అతను వచ్చాక గందరగోళం మొదలవుతుంది. అదేంటి అనేది తెరపై చూడాలి. ఈ కథలో అంతర్లీనంగా సోషల్ మెసేజ్ ఉంటుంది. ఈ సినిమాలో నా లుక్ చూసి రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా వస్తున్నాయి. కానీ, వాటికి ఈ సినిమానే సమాధానం చెబుతుంది. విరాజీ సినిమా చూశాక నేను ఎందుకు ఈ మేకోవర్‌లో ఉన్నాను అని తెలుసుకుంటారు. ఈ సినిమా చూశాక ఆండీ క్యారెక్టర్ పట్ల గర్వపడతారు.

- విరాజి కథలో చాలా టిస్టులు టర్న్స్ ఉంటాయి. ఒక మంచి మూవీ చేశామని మేమంతా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ఈ సినిమాలో వర్క్ చేస్తున్నప్పుడు మేకోవర్ కోసమే ఎక్కువ కష్టపడ్డాను. హెయిర్ కలరింగ్ కోసం 7 అవర్స్, అలాగే టాటూస్ కోసం దాదాపు గంట సమయం పట్టేది. ప్రతి రోజూ ఒక స్నేక్ టాటూ వేసేవాళ్లం.

- విరాజీ సినిమా చూశాక ఎమోషనల్ అయ్యాను. చివరలో హార్ట్ టచింగ్‌గా అనిపించింది. నా వైఫ్ వితిక కూడా సినిమా చూసి అలాగే ఫీలయ్యింది. ఈ సినిమాలో సగం తెలుగు సగం ఇంగ్లీష్ మాట్లాడుతుంటా. ఇది నా బాడీ లాంగ్వేజ్‌కు కంఫర్ట్‌గా అనిపించింది. ప్రతి సినిమాకు, క్యారెక్టర్‌కు నేనెంతవరకు అడాప్ట్ అవగలనో అంతవరకు ప్రయత్నిస్తుంటాను.

- ఏపీలో విరాజీ టూర్ చేశాం. ఆ టూర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ టూర్ విశేషాలు ఇన్ స్టా‌లో షేర్ చేసుకున్నా. చీకట్లో ఉన్న వారికి వెలుగు పంచే వాడు విరాజీ. ఇదే టైటిల్ జస్టిఫికేషన్. సస్పెన్స్ , థ్రిల్లర్, హారర్ ఎలిమెంట్స్, డ్రామా, ఎమోషన్ వంటి అన్ని అంశాలు కథలో కలిపి రూపొందించారు దర్శకుడు ఆద్యంత్ హర్ష.