Varun Sandesh Injury: కాలికి గాయం అయింది.. అతని కోసమే రిస్క్ తీసుకున్నా.. హీరో వరుణ్ సందేశ్ కామెంట్స్-varun sandesh comments on ninda movie director rajesh jagannadham and his leg injury in an interview tollywood ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Varun Sandesh Injury: కాలికి గాయం అయింది.. అతని కోసమే రిస్క్ తీసుకున్నా.. హీరో వరుణ్ సందేశ్ కామెంట్స్

Varun Sandesh Injury: కాలికి గాయం అయింది.. అతని కోసమే రిస్క్ తీసుకున్నా.. హీరో వరుణ్ సందేశ్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Jun 19, 2024 06:02 AM IST

Varun Sandesh About Ninda Movie Director And Leg Injury: హ్యాపీడేస్ సినిమాతో హీరోగా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న వరుణ్ సందేశ్ నటించిన లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ నింద. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వరుణ్ సందేశ్ తన కాలికి అయిన గాయం గురించి వరుణ్ సందేశ్ తెలిపాడు.

కాలికి గాయం అయింది.. అతని కోసమే రిస్క్ తీసుకున్నా.. హీరో వరుణ్ సందేశ్ కామెంట్స్
కాలికి గాయం అయింది.. అతని కోసమే రిస్క్ తీసుకున్నా.. హీరో వరుణ్ సందేశ్ కామెంట్స్

Varun Sandesh About Leg Injury: వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ నింద. ఈ చిత్రాన్ని ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ జగన్నాధం (Rajesh Jagannadham) నిర్మిస్తూ, దర్వకత్వం వహించారు. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రం జూన్ 21న రాబోతోంది. మైత్రీ మూవీస్ ఈ సినిమాను నైజాంలో రిలీజ్ చేస్తోంది. ఈ మూవీ విశేషాలను పంచుకునేందుకు హీరో వరుణ్ సందేశ్ మీడియా ముందుకు వచ్చారు.

‘నింద’ కథను అంగీకరించడానికి ప్రధాన కారణం ఏంటి?

రొటీన్ సినిమాలు చేస్తూ ఉండటంతో నాకే బోరింగ్‌గా అనిపించింది. ఏంట్రా ఇలాంటి సినిమాలే చేస్తున్నానని అనుకునే సందర్భాలు వచ్చాయి. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని యూఎస్ వెళ్లా. ఆ టైంలోనే రాజేష్ గారు ఈ నింద కథను చెప్పారు. విన్న వెంటనే ఎంతో నచ్చింది. ఈ సినిమా చేసేద్దామని అన్నాను.

‘నింద’లో మీ పాత్ర ఎలా ఉండబోతోంది?

నిందలో నా పాత్రకి, నిజ జీవితంలోని నా పాత్రకి అస్సలు పోలిక ఉండదు. నేను బయట జాలీగా, చిల్‌గా ఉంటాను. నేను ఎప్పుడూ కూడా సీరియస్‌గా ఉండను. కానీ, ఈ చిత్రంలో నా వ్యక్తిత్వానికి, మనస్తత్వానికి పూర్తిగా భిన్నమైన పాత్రను పోషించాను. ఈ చిత్రంలో ఎంతో సెటిల్డ్‌గా, మెచ్యూర్డ్‌గా కనిపిస్తాను.

ఈ మూవీ దర్శకుడే నిర్మాతగా అవుతారని మీకు ముందే తెలుసా?

నింద కథ విన్నప్పుడు ఈ మూవీని ఎవరు నిర్మిస్తారు.. ఎవరు తీస్తారు అనే ఆలోచనలు రాలేదు. నాకు కథ నచ్చింది. రాజేష్ కథను నెరేట్ చేసిన విధానం మరింతగా నచ్చింది. ఇక ఆయనే సినిమాను నిర్మిస్తున్నాడని తెలిసి మరింత ఆనందం వేసింది. తన కథ మీద తనకు ఉన్న నమ్మకంతోనే నిర్మించేందుకు ముందుకు వచ్చారు. ఆయనకు చాలా గట్స్, ధైర్యం ఉండటం వల్లే దర్శకుడిగా, నిర్మాతగా ఈ సినిమాను చేశారు.

‘నింద’ షూటింగ్‌లో ఎదురైన సవాళ్లు ఏంటి?

కానిస్టేబుల్ అనే సినిమా షూటింగ్‌లో నా కాలికి (Leg Injury) గాయమైంది. ఆ వెంటనే నింద షెడ్యూల్ ఉంది. అప్పటికే ఆర్టిస్టులంతా రెడీగా ఉన్నారు. అంతా సెట్ అయి ఉంది. నా ఒక్కడి కోసం షూటింగ్ క్యాన్సిల్ చేయడం ఇష్టం లేక.. రాజేష్ గారి డెడికేషన్, ప్యాషన్ చూసి.. ఆ గాయంతోనే షూటింగ్ చేశాను. రాజేష్ గారి కోసమే ఆ రిస్క్ తీసుకున్నాను.

మైత్రీ వారు ఈ ప్రాజెక్ట్‌ను ఎలా టేకప్ చేసి రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చారు?

మా దర్శక నిర్మాత రాజేష్ గారి ఫ్రెండ్ యూఎస్‌లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఆయన మైత్రీ నవీన్‌ గారికి తెలుసు. అలా మైత్రీ శశి గారు మా సినిమాను చూశారు. మూవీ నచ్చితేనే రిలీజ్ చేస్తామని శశిగారు అన్నారు. ఆయన చిత్రాన్ని చూశారు. బాగా నచ్చింది. అందుకే మా సినిమాను రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చారు.

Whats_app_banner