Viraaji: సరికొత్త అవతార్‌లో వరుణ్ సందేశ్.. 17 ఏళ్ల కెరీర్‌లో చేయని డిఫరెంట్ మూవీ విరాజి-varun sandesh new movie viraaji title announcement varun sandesh about viraaji and his charecter in title launch ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Viraaji: సరికొత్త అవతార్‌లో వరుణ్ సందేశ్.. 17 ఏళ్ల కెరీర్‌లో చేయని డిఫరెంట్ మూవీ విరాజి

Viraaji: సరికొత్త అవతార్‌లో వరుణ్ సందేశ్.. 17 ఏళ్ల కెరీర్‌లో చేయని డిఫరెంట్ మూవీ విరాజి

Sanjiv Kumar HT Telugu
Jul 03, 2024 06:10 AM IST

Varun Sandesh About Viraaji Movie: వరుస పెట్టి సినిమాలతో దూసుకుపోతోన్న హీరో వరుణ్ సందేశ్ ఇప్పుడు మరో కొత్త మూవీతో అలరించేందుకు రెడీగా ఉన్నాడు. వరుణ్ సందేశ్ నటిస్తున్న కొత్త సినిమా విరాజి టైటిల్ లాంచ్ ఈవెంట్ ఘనంగా చేశారు. ఈ మూవీలో వరుణ్ సందేశ్ కొత్త అవతారంలో కనిపించనున్నాడు.

సరికొత్త అవతార్‌లో వరుణ్ సందేశ్.. 17 ఏళ్ల కెరీర్‌లో చేయని డిఫరెంట్ మూవీ విరాజి
సరికొత్త అవతార్‌లో వరుణ్ సందేశ్.. 17 ఏళ్ల కెరీర్‌లో చేయని డిఫరెంట్ మూవీ విరాజి

Varun Sandesh Viraaji Title Launch: ఇటీవల "నింద" మూవీతో మంచి సక్సెస్ అందుకున్న హీరో వరుణ్ సందేశ్ తన కొత్త సినిమా "విరాజి" తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రాన్ని మహా మూవీస్‌తో కలిసి ఎమ్ 3 మీడియా బ్యానర్‌పై మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు. విరాజి చిత్రంతో ఆద్యంత్ హర్ష దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

yearly horoscope entry point

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. మంగళవారం (జూలై 2) విరాజి సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాతలు, హీరో, ఇతర టెక్నిషియన్స్ తమ మనసులోని భావాలను పంచుకున్నారు.

"విరాజి చాలా మంచి టైటిల్. వరుణ్ సందేశ్ గారు ఇప్పటిదాకా ఎన్నో మంచి మూవీస్ చేశారు. హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఆయనను కొత్త అవతారంలో చూపించే చిత్రమిది. మూవీ చాలా బాగా వచ్చింది. ఆగస్టు 2న రిలీజ్ చేయాలని అనుకుంటున్నాను. ఈ నెల రోజులు బాగా ప్రమోట్ చేయాలని ప్లాన్ చేశాం. మేము కొత్త వాళ్లుగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నా" అని నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల అన్నారు.

"విరాజి కథ చెప్పేందుకు హర్ష నా దగ్గరకు వచ్చాడు. ఫస్టాఫ్ వింటున్నప్పుడు పది నిమిషాల తర్వాత కథ ఇలా ఉంటుందేమో అని రెండు మూడు చోట్ల గెస్ చేశాను. సెకండాఫ్‌కు వచ్చేసరికి గూస్ బంప్స్ వచ్చాయి. కథ చాలా బాగుందని హర్షకు చెప్పాను. ఈ సినిమా తప్పకుండా చేయాలని ఫిక్స్ అయ్యా" అని హీరో వరుణ్ సందేశ్ తెలిపారు.

"మా డైరెక్టర్ హర్షకు ఇది మొదటి సినిమా. కానీ, ఆయన చేయబోయే చాలా సినిమాలకు ఇది మొదటి సినిమా. హర్షకు లాంగ్ కెరీర్ ఉంటుంది. నేను రీసెంట్‌గా చేసిన నింద మూవీకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఓ పదేళ్ల తర్వాత నా మూవీకి అలాంటి ఓపెనింగ్స్ చూశాను. నింద సక్సెస్ నాకు మంచి మోటివేషన్, బూస్ట్ ఇచ్చింది. నింద డైరెక్టర్ రాజేశ్‌కు రెండు పెద్ద ప్రొడక్షన్స్ నుంచి సినిమా చేసేందుకు పిలుపులు వచ్చాయి. హర్షకు కూడా అలాంటి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది" అని వరుణ్ సందేశ్ అన్నారు.

"ఇవాళ్టికి ఎగ్జాక్ట్‌గా నెల రోజుల సమయం ఉంది మా సినిమా రిలీజ్‌కు. ఇవాళ్టి నుంచి ప్రమోషన్ స్టార్ట్ చేశాం. మీ అందరికీ తప్పకుండా నచ్చే సినిమా అవుతుంది. విరాజి నేను నా 17 ఏళ్ల కెరీర్‌లో చేయని ఒక డిఫరెంట్ మూవీ. అలాంటి మోస్ట్ క్రేజియెస్ట్ క్యారెక్టర్ ఇందులో చేశాను. ఈ నెల 10వ తేదీన విరాజి ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తాం. మీరు చూడగానే సర్‌‌ప్రైజ్ అవుతారు" అని వరుణ్ సందేశ్ చెప్పుకొచ్చారు.

"ఈ క్యారెక్టర్ కోసం రెడీ అయ్యేందుకు గంట సమయం పట్టేది. నేను విరాజి మూవీ రిలీజ్ కోసం ఎగ్జైటెడ్‌గా వెయిట్ చేస్తున్నాను. మా ప్రొడ్యూసర్ మహేంద్ర నాకు బ్రదర్ లాంటి వారు. ఈ మూవీని ప్రేక్షకుల దగ్గరకు బాగా రీచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. విరాజి సినిమాకు పనిచేసిన వారంతా ప్యాషన్‌తో వర్క్ చేశారు. మా సినిమాకు మీరంతా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా" అని వరుణ్ సందేశ్ కోరారు.

Whats_app_banner