Ninda: దెయ్యంపై సినిమా అని ఏదో ఒకటి రాశారు.. మీడియాపై నింద డైరెక్టర్ కామెంట్స్-varun sandesh ninda movie director rajesh jagannadham comment on media in an interview suspense thriller movie telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ninda: దెయ్యంపై సినిమా అని ఏదో ఒకటి రాశారు.. మీడియాపై నింద డైరెక్టర్ కామెంట్స్

Ninda: దెయ్యంపై సినిమా అని ఏదో ఒకటి రాశారు.. మీడియాపై నింద డైరెక్టర్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Jun 20, 2024 10:27 AM IST

Ninda Movie Director Rajesh Jagannadham About Media: మీడియాపై నింద మూవీ డైరెక్టర్ రాజేష్ జగన్నాథం చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దెయ్యంపై సినిమా అని, ఏదో ఒకటి రాశారని పలు కామెంట్స్ చేశారు.

దెయ్యంపై సినిమా అని ఏదో ఒకటి రాశారు.. మీడియాపై నింద డైరెక్టర్ కామెంట్స్
దెయ్యంపై సినిమా అని ఏదో ఒకటి రాశారు.. మీడియాపై నింద డైరెక్టర్ కామెంట్స్

Ninda Director Rajesh Jagannadham Interview: వరుణ్ సందేశ్ హీరోగా నటించిన సినిమా నింద. ఈ సినిమాను ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ జగన్నాధం స్వయంగా నిర్మిస్తూ, దర్వకత్వం వహించారు. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రం జూన్ 21న రాబోతోంది. మైత్రీ మూవీస్ ఈ సినిమాను నైజాంలో రిలీజ్ చేస్తోంది. ఈ క్రమంలో దర్శక నిర్మాత రాజేష్ జగన్నాథం ఈ చిత్రానికి సంబంధించిన పంచుకున్న విశేషాలివే..

మీ నేపథ్యం, సినీ ప్రయాణం గురించి చెప్పండి?

మాది నర్సాపురం. చదువుల కోసం నెల్లూరు, చెన్నై, యూఎస్‌ అంటూ తిరిగాను. యూఎస్‌లోనే ఉద్యోగం చేస్తూ ఉండిపోయాను. ఫిల్మ్ మేకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండేది. అక్కడే ఫిల్మ్ మేకింగ్‌లో కోర్సులు కూడా చేశాను. చిన్న చిన్నగా అక్కడే షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ఓ షార్ట్ ఫిల్మ్‌కి అవార్డు కూడా వచ్చింది.

నింద కథను వరుణ్ సందేశ్‌కే ఎందుకు చెప్పారు?

వరుణ్ సందేశ్ గారికి ఈ కారెక్టర్ సెట్ అవుతుందని నమ్మాను. ఆయనకు ఇది మంచి కమ్ బ్యాక్‌లా ఉంటుందని భావించాను. అందుకే ఆయనకు కథ చెప్పాను. వరుణ్ సందేశ్‌కి కథ బాగా నచ్చడంతో సినిమాను ముందుకు తీసుకెళ్లాను.

ఇందులో ఎంత వరకు నిజాలుంటాయి? ఎంత వరకు కల్పితం ఉంటుంది?

కాండ్రకోట మిస్టరీ అని నింద పోస్టర్ వదిలినప్పుడు అందరూ ఘోస్ట్ (దెయ్యం) మీద సినిమా అని రాశారు. సర్లే ఏదో ఒకటి రాశారు.. ప్రమోషన్ కల్పిస్తున్నారని అనుకున్నాను. టీజర్ రావడంతో అందరికీ ఓ క్లారిటీ వచ్చింది. ఈ చిత్రంలో రియల్ ఇన్సిడెంట్స్‌ను బేస్ చేసుకుని కొన్ని సీన్లు రాసుకున్నాను. కల్పితం కూడా ఉంటుంది.

నిర్మాతగా ఎందుకు మారారు?

నింద కథపై నాకు నమ్మకం ఉంది. నిర్మాతల కోసం ప్రయత్నించాను. వేరే వాళ్లు ఎందుకు? నా సినిమాను నేను నిర్మించాలని ఆ తరువాత అనిపించింది. అందుకే నిర్మాతగానూ మారాను. ప్రతీ రోజూ సెట్స్ మీద మా నాన్న గారు కూడా ఉండేవారు. చిన్న చిన్న ఖర్చులని ఆయన మ్యానేజ్ చేసేవారు.

దర్శకుడిగా సులభంగా అనిపించిందా? నిర్మాతగా సులభంగా అనిపించిందా?

నాకు క్రియేటివ్ ఫీల్డ్ అంటేనే ఇష్టం. దర్శకుడిగానే నాకు నచ్చింది. నాకు సినిమాలు తీయడమే ఇష్టం. సినిమాను తీయడం కంటే రిలీజ్ చేయడం చాలా కష్టమని ఇప్పుడు అర్థం అవుతోంది.

నింద టెక్నికల్ టీం గురించి చెప్పండి?

పీఎస్ వినోద్ గారి వద్ద అసిస్టెంట్‌గా పని చేసిన రమిజ్ ఈ చిత్రానికి కెమెరామెన్‌గా పని చేశారు. విశాల్ చంద్రశేఖర్ వద్ద పని చేసిన సాంతు ఓంకార్ మంచి ఆర్ఆర్, మ్యూజిక్‌ను ఇచ్చారు. ఈ చిత్రానికి టెక్నికల్ టీం మేజర్ అస్సెట్‌గా ఉంటుంది. టెక్నికల్‌గా హై స్టాండర్డ్‌లో ఉంటుంది.

నెక్ట్స్ ప్రాజెక్టులు రెడీగా ఉన్నాయా?

నా దగ్గర బౌండెడ్ స్క్రిప్ట్స్ ఉన్నాయి. కానీ, నింద రిలీజ్ అయ్యాక.. దాని రిజల్ట్ చూసి నెక్ట్స్ సినిమాలను ప్రకటిస్తాను. ఇకపై ఎక్కువగా సినిమా దర్శకత్వం మీదే ఫోకస్ పెడతాను.

Whats_app_banner