A Movie Re Release: 26 ఏళ్ల క్రితమే 20 కోట్లు కొల్లగొట్టిన ఉపేంద్ర సినిమా ఏ రీ రిలీజ్.. ఎప్పుడంటే?-upendra movie a re release with 4k version on june 21 in telugu states kannada movies in telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  A Movie Re Release: 26 ఏళ్ల క్రితమే 20 కోట్లు కొల్లగొట్టిన ఉపేంద్ర సినిమా ఏ రీ రిలీజ్.. ఎప్పుడంటే?

A Movie Re Release: 26 ఏళ్ల క్రితమే 20 కోట్లు కొల్లగొట్టిన ఉపేంద్ర సినిమా ఏ రీ రిలీజ్.. ఎప్పుడంటే?

Sanjiv Kumar HT Telugu
Jun 08, 2024 02:41 PM IST

Upendra A Movie Re Release: కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర నటించిన ఏ మూవీని మళ్లీ రీ రిలీజ్ చేయనున్నారు. 1998లో రూ. 20 కోట్లుకుపైగా కలెక్షన్స్ వసూలు చేసిన ఈ ఏ సినిమాను 4కే వెర్షన్‌తో రీ రిలీజ్ చేస్తున్నారు. ఏ మూవీ రీ రిలీజ్ పూర్తి విశేషాల్లోకి వెళితే..

26 ఏళ్ల క్రితమే 20 కోట్లు కొల్లగొట్టిన ఉపేంద్ర సినిమా ఏ రీ రిలీజ్.. ఎప్పుడంటే?
26 ఏళ్ల క్రితమే 20 కోట్లు కొల్లగొట్టిన ఉపేంద్ర సినిమా ఏ రీ రిలీజ్.. ఎప్పుడంటే?

Upendra A Movie Re Release: ఇండస్ట్రీ ఎప్పుడూ కొత్త పుంతలు తొక్కుతూనే ఉంటుంది. అందులో భాగమే ఈ 4కే రీ రిలీజ్ ట్రెండ్. ఓల్డ్ బ్లాక్ బస్టర్ మూవీస్‌ను మరొక్కసారి హై క్వాలిటీతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఉప్పి క్రియేషన్స్, చందు ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై గ్రాండ్‌గా రీ రిలీజ్ అవుతున్న చిత్రం ఏ (A).

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర నటించిన ఈ చిత్రం ఓ ట్రెండ్ సెట్ చేసిన విషయం తెలిసిందే. 1998లో అంటే సుమారు 26 సంవత్సారాల క్రితం విడుదలైన ఏ సినిమా ఓ కల్ట్ ఫిల్మ్‌గా నిలిచింది. ఆ రోజుల్లో 100 రోజులు ప్రదర్శించడమే కాదు దాదాపు 3, 4 వారాలు టికెట్లు సైతం దొరకలేదంటే ఆ సినిమా చేసిన మ్యాజిక్ ను అర్థం చేసుకొవచ్చు.

ఈ కల్ట్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తూ వింటేజ్ రోజులను తెరపై అవిష్కరింపజేస్తున్నారు ప్రొడ్యూసర్ లింగం యాదవ్. కాగా చందు ఎంటర్‌టైన్మెంట్ స్థాపించి పలు చిత్రాలను నిర్మించడమే కాకుండా సినిమా అంటే ప్రేమతో రీ రిలీజ్‌లకు పూనుకున్నారు. అందులో భాగంగా హీరో ప్రభాస్ నటించిన ఛత్రపతి, యోగి చిత్రాలను 4కే లో మళ్లీ విడుదల చేసి మంచి పేరు తెచ్చుకున్నారు.

ఇప్పుడు ఏ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే కన్నడలో రీ రిలీజ్ అయిన ఈ చిత్రం అద్భుతమైన స్పందనను రాబట్టింది. ఇక జూన్ 21న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. కన్నడ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసిన సినిమా ఏ (A). బుద్దిమంతులకు మాత్రమే అనేది శీర్షిక.

ఈ చిత్రంలో ఉపేంద్ర సరసన చాందినీ నటించారు. తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ చిత్రం కేవలం కన్నడలో 1998లోనే రూ. 20 కోట్లకు పైగా వసూల్ చేసి ఇండస్ట్రీ రికార్డు క్రియేట్ చేసింది. అంతటి కల్ట్ ఫిల్మ్ జూన్ 21 న తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుందని సినిమా ప్రీయులు, ఉపేంద్ర ఫ్యాన్స్ తెగ సంబరం చేసుకుంటున్నారు. ఉపేంద్ర చేసే చిలిపి చేస్టలను తెరపై చూడాలని ఉవ్విల్లూరుతున్నారు.

కాగా ఉపేంద్ర కన్నడ స్టార్ అయినప్పటికీ ఆయనకు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమాలు తెలుగులో సైతం విడుదల అవుతుంటాయి. ఇటీవల కబ్జా అనే మూవీ పాన్ ఇండియాగా తెలుగులో కూడా రిలీజైన విషయం తెలిసిందే. ఇందులో ఉపేంద్రకు జోడీగా శ్రీయ సరన్ హీరోయిన్‌గా నటించింది. కానీ, ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.

సేమ్ కేజీఎఫ్ తరహాలో కబ్జా ఉందని, కాపీ కొట్టి తీశారని అనేక విమర్శలు మూటగట్టుకుంది కబ్జా మూవీ. ఇదే కాకుండా ఉపేంద్ర నేరుగా తెలుగు సినిమాల్లో నటించారు. కన్యాదానం మూవీతో హీరోగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత లాంగ్ గ్యాప్ తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి మూవీలో విలన్‌గా మంచి నటన కనబర్చారు.

ఇక ఇప్పుడు ఉపేంద్ర మరో వైవిధ్యమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆ సినిమా పేరే యూఐ. సరీలిస్ట్ యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ కన్నడ మూవీ నుంచి రిలీజైన ట్రోల్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు ఉపేంద్ర దర్శకత్వం వహించడం విశేషం.

టీ20 వరల్డ్ కప్ 2024