OTT Movies: ఓటీటీలో మళ్లీ సినిమాల జాతర.. ఒక్కరోజే 11 స్ట్రీమింగ్.. చూడాల్సిన సినిమాలు 7-ott movies releases on this friday miral ott streaming on aha today ott releases 105 minutes ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Movies: ఓటీటీలో మళ్లీ సినిమాల జాతర.. ఒక్కరోజే 11 స్ట్రీమింగ్.. చూడాల్సిన సినిమాలు 7

OTT Movies: ఓటీటీలో మళ్లీ సినిమాల జాతర.. ఒక్కరోజే 11 స్ట్రీమింగ్.. చూడాల్సిన సినిమాలు 7

Sanjiv Kumar HT Telugu
Jun 08, 2024 11:33 AM IST

OTT Movies Releases Friday: ఓటీటీలో మళ్లీ సినిమాల జాతర మొదలైంది. ఒక్కరోజే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి ఏకంగా 11 సినిమాలు రిలీజ్ అయ్యాయి. డిఫరెంట్ కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమాలు, వెబ్ సిరీసులు ఏంటీ, అవి ఏ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయో లుక్కేద్దాం.

ఓటీటీలో మళ్లీ సినిమాల జాతర.. ఒక్కరోజే 11 స్ట్రీమింగ్.. చూడాల్సిన సినిమాలు 7
ఓటీటీలో మళ్లీ సినిమాల జాతర.. ఒక్కరోజే 11 స్ట్రీమింగ్.. చూడాల్సిన సినిమాలు 7

Today OTT Releases: ఎప్పటికప్పుడు ఓటీటీలో విభిన్న సినిమాలు, వెబ్ సిరీసులు విడుదల అవుతూనే ఉంటాయి. థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్స్, ప్లాప్ సినిమాలతోపాటు నేరుగా ఓటీటీల్లో కొన్ని చిత్రాలు ప్రత్యక్షమవుతాయి. వాటిని వీక్షించేందుకు ఓటీటీ లవర్స్ కాచుకుని కూర్చుంటారు. ఈవారం కూడా చాలా వరకు సినిమాలు వెబ్ సిరీసులు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

వాటిలో ఈ శుక్రవారం అంటే జూన్ 7న (Friday OTT Release) ఓటీటీలోకి సినిమాలు, వెబ్ సిరీసులు అన్ని కలిపి దాదాపుగా 11 విడుదల అయ్యాయి. వాటితోపాటు ఇవాళ శనివారం (జూన్ 8) కూడా పలు సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరి ఆ సినిమాలు, వెబ్ సిరీసులు ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయో లుక్కేద్దాం.

ఆహా ఓటీటీ

మిరల్ (తెలుగు హారర్ మూవీ)- జూన్ 7

105 మినిట్స్ (తెలుగు హారర్ చిత్రం)- జూన్ 7

బూమర్ అంకుల్ (తమిళ చిత్రం)- జూన్ 7

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

హైరార్కీ కొరియన్ (వెబ్ సిరీస్)- జూన్ 7

హిట్ మ్యాన్ (హాలీవుడ్ యాక్షన్ కామెడీ మూవీ)- జూన్ 7

పర్ఫెక్ట్ మ్యాచ్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూన్ 7

జియో సినిమా ఓటీటీ

బ్లాక్ ఔట్ (హిందీ చిత్రం)- జూన్ 7

ది ఎండ్ వుయ్ స్టార్ట్ ఫ్రమ్ (ఇంగ్లీష్ మూవీ)- జూన్ 8

సోనీ లివ్ ఓటీటీ

వర్షంగల్కు శేషం (మలయాళ చిత్రం)- జూన్ 7

గుల్లక్ సీజన్ 4 (హిందీ వెబ్ సిరీస్)- జూన్ 7

స్టార్ (తమిళ మూవీ తెలుగులో) అమెజాన్ ప్రైమ్ ఓటీటీ- జూన్ 7

ఎబిగైల్ (ఇంగ్లీష్ చిత్రం)- బుక్ మై షో- జూన్ 7

ఇలా జూన్ 7న ఒక్కరోజే ఓటీటీలోకి 11 సినిమాలు రాగా జూన్ 8న ఒకే ఒక్క మూవీ వచ్చింది. దీంతో ఓటీటీలోకి 12 సినిమాలు వచ్చినట్లు అయింది. ఇక వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి రెండు హారర్ చిత్రాలు మిరల్ అండ్ 105 మినిట్స్. అలాగే బూమర్ అంకుల్ మూవీతోపాటు వర్షంగల్కు శేషం, హిట్ మ్యాన్, బ్లాక్ ఔట్, స్టార్ సినిమాలు. ఇలా వీటిలో 7 సినిమాలు ప్రత్యేకంగా ఉన్నాయి.

హారర్ అండ్ క్రైమ్ థ్రిల్లర్‌గా వచ్చింది మిరల్ మూవీ. ఇందులో ప్రేమిస్తే భరత్, వాణి భోజన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఆహాలో స్ట్రీమింగ్ అవుతోన్న మిరల్ మూవీ ఓ మాస్క్ కథాంశంతో సాగుతుంది. ఓ ఇంట్లోకి వెళ్లిన కుటుంబానికి అనుకోని సంఘటనలు ఎదురవుతుంటాయి. అందుకు కారణాలు ఏంటనే ఆసక్తికర అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది.

ఇక బ్యూటిఫుల్ హన్సిక మోత్వాని ప్రధాన పాత్రలో నటించిన 105 మినిట్స్ మూవీ ఒకటి. ఇది కూడా హారర్ సస్పెన్స్ జోనర్‌లో వచ్చింది. ఈ సినిమా కూడా ఆహాలోనే స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో బూమర్ అనే మరో ఇంట్రెస్టింగ్ మూవీ కూడా ఆహాలోనే రిలీజైంది. ఇలా ఏకంగా మూడు ఇంట్రెస్టింగ్ సినిమాలు ఆహా ఒక్క ఓటీటీలోనే సందడి చేస్తున్నాయి.

టీ20 వరల్డ్ కప్ 2024