Tillu Square TV Premiere: టీవీలోకి వచ్చేస్తున్న బ్లాక్‍బస్టర్ టిల్లు స్క్వేర్ మూవీ.. టెలికాస్ట్ ఎప్పుడంటే..-tillu square movie tv premiere date time on star maa chennel telecast date and time tv news ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tillu Square Tv Premiere: టీవీలోకి వచ్చేస్తున్న బ్లాక్‍బస్టర్ టిల్లు స్క్వేర్ మూవీ.. టెలికాస్ట్ ఎప్పుడంటే..

Tillu Square TV Premiere: టీవీలోకి వచ్చేస్తున్న బ్లాక్‍బస్టర్ టిల్లు స్క్వేర్ మూవీ.. టెలికాస్ట్ ఎప్పుడంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 05, 2024 07:01 AM IST

Tillu Square TV Premiere: టిల్లు స్క్వేర్ సినిమా టీవీ ప్రీమియర్‌కు రెడీ అయింది. టెలికాస్ట్ డేట్, టైమ్ వచ్చేశాయి. ఈ సినిమాను టీవీ ఛానెల్‍లో ఎప్పుడు చూడొచ్చంటే..

Tillu Square TV Premiere: టీవీలోకి వచ్చేస్తున్న బ్లాక్‍బస్టర్ టిల్లు స్క్వేర్ మూవీ.. టెలికాస్ట్ ఎప్పుడంటే..
Tillu Square TV Premiere: టీవీలోకి వచ్చేస్తున్న బ్లాక్‍బస్టర్ టిల్లు స్క్వేర్ మూవీ.. టెలికాస్ట్ ఎప్పుడంటే..

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటించిన టిల్లు స్క్వేర్ సినిమా భారీ బ్లాక్‍బస్టర్ కొట్టింది. ఫుల్ క్రేజ్‍తో వచ్చిన ఈ మూవీ అంచనాలకు మించి దుమ్మురేపింది. డీజే టిల్లును మించి ఈ సీక్వెల్ చిత్రం ప్రేక్షకులకు మెప్పించింది. ఈ ఏడాది మార్చిలో రిలీజైన ఈ మూవీ రూ.100కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఓటీటీలోనూ దుమ్మురేపింది. టిల్లు స్క్వేర్ చిత్రం ఇప్పుడు టీవీ ఛానెల్‍లో ప్రీమియర్‌కు సిద్ధమైంది. టెలికాస్ట్ వివరాలు బయటికి వచ్చాయి.

టెలికాస్ట్ డేట్, టైమ్

టిల్లు స్క్వేర్ సినిమా ఆగస్టు 11వ తేదీన సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు స్టార్ మా టీవీ ఛానెల్‍లో ప్రసారం కానుంది. తొలిసారి టీవీలో ప్రీమియర్‌కు వచ్చేస్తోంది. ఈ విషయాన్ని స్టార్ మా అధికారికంగా వెల్లడించింది.

టిల్లు స్క్వేర్ మూవీ ముందుగా థియేటర్లలో బంపర్ హిట్ కొట్టింది. హీరో సిద్ధు జొన్నలగడ్డ తన మార్క్ యాక్టింగ్, కామెడీ టైమింగ్, స్వాగ్‍తో మళ్లీ దుమ్మురేపారు. అనుపమ పరమేశ్వరన్ కూడా చాలా ప్లస్ అయ్యారు. కామెడీ, రొమాన్స్, క్రైమ్‍‍తో టిల్లు స్క్వేర్ మూవీ ఫుల్ ఎంటర్‌టైన్‍ చేసింది. దీంతో ఈ ఏడాది బ్లాక్‍బస్టర్లలో ఈ చిత్రం ఒకటిగా నిలిచింది.

ఓటీటీలో ఎక్కడ..

టిల్లు స్క్వేర్ చిత్రం ఏప్రిల్ 26వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో అడుగుపెట్టింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో కూడా స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ మూవీకి ఓటీటీలోనూ మంచి ఆదరణ దక్కింది. భారీగా వ్యూస్ వచ్చాయి. చాలా రోజులు టాప్-5లో ట్రెండ్ అయింది. థియేటర్లలో హిట్ అయిన ఈ మూవీ.. ఓటీటీలోనూ అదరగొట్టింది. అయితే, టీవీలో ఎంత టీఆర్పీ దక్కించుకుంటుందో చూడాలి. మంచి క్రేజ్ ఉండటంతో ఆగస్టు 11న స్టార్ మాలో టీవీ ప్రీమియర్ మంచి టీఆర్పీ సాధిస్తుందనే అంచనాలు ఉన్నాయి.

టిల్లు స్క్వేర్ మూవీలో సిద్ధు, అనుపమ లీడ్ రోల్స్ చేయగా.. మురళీధర్ గౌడ్, ప్రిన్స్ సెసిల్, మురళీ శర్మ, ప్రణీత్ రెడ్డి కీలకపాత్రల్లో నటించారు. నేహా శెట్టి కాసేపు క్యామియో రోల్‍లో మెరిశారు. ఈ మూవీకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. హీరో సిద్ధునే రవి ఆంటోనీతో కలిసి ఈ చిత్రానికి స్క్రిప్ట్ అందించారు.

టిల్లు స్క్వేర్ కలెక్షన్లు

టిల్లు స్క్వేర్ సినిమా సుమారు రూ.130 కోట్ల కలెక్షన్లతో దుమ్మురేపింది. రూ.20కోట్లలోపు బడ్జెట్‍తో తెరకెక్కిన ఈ మూవీ భారీ బ్లాక్‍బస్టర్ అయింది. తొలి 9 రోజుల్లోనే రూ.100 కోట్ల మార్క్ దాటి సెన్సేషన్ క్రియేట్ చేసింది. తొలిసారి ఈ మైల్‍స్టోన్ దాటారు సిద్ధు జొన్నలగడ్డ. డీజే టిల్లుకు సీక్వెల్‍గా మంచి అంచనాలతో అడుగుపెట్టిన ఈ మూవీ అదరగొట్టింది.

సితార ఎంటర్‌టైన్‍మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య.. టిల్లు స్క్వేర్ మూవీని నిర్మించారు. ఈ చిత్రానికి రామ్ మిర్యాల, అచ్చు రాజమణి, భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ డైరెక్టర్లుగా పనిచేశారు. ఈ చిత్రానికి మ్యూజిక్ కూడా పెద్ద ప్లస్ అయింది.