OTT Releases: మరికొన్ని గంటల్లో ఓటీటీల్లో టిల్లు స్క్వేర్, ఫ్యామిలీ స్టార్ హంగామా: స్ట్రీమింగ్ వివరాలివే-tillu square and family star movies to stream on from midnight on netflix and amazon prime video otts respectively ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Releases: మరికొన్ని గంటల్లో ఓటీటీల్లో టిల్లు స్క్వేర్, ఫ్యామిలీ స్టార్ హంగామా: స్ట్రీమింగ్ వివరాలివే

OTT Releases: మరికొన్ని గంటల్లో ఓటీటీల్లో టిల్లు స్క్వేర్, ఫ్యామిలీ స్టార్ హంగామా: స్ట్రీమింగ్ వివరాలివే

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 25, 2024 04:32 PM IST

Tillu Square - Family Star OTT Releases: ఈవారం ఓటీటీల్లో ఫుల్ హవా ఉండనుంది. టిల్లు స్క్వేర్, ఫ్యామిలీ స్టార్ సినిమాలు ఒకే రోజు స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనున్నాయి. ఈ సినిమాల స్ట్రీమింగ్ వివరాలు ఇవే..

OTT Releases: మరికొన్ని గంటల్లో ఓటీటీల్లో టిల్లు స్క్వేర్, ఫ్యామిలీ స్టార్ హంగామా: స్ట్రీమింగ్ వివరాలివే
OTT Releases: మరికొన్ని గంటల్లో ఓటీటీల్లో టిల్లు స్క్వేర్, ఫ్యామిలీ స్టార్ హంగామా: స్ట్రీమింగ్ వివరాలివే

OTT: ఈవారం ఓటీటీల్లో పాపులర్ సినిమాల ధమాకా ఉంది. ముఖ్యంగా ఫుల్ క్రేజ్ ఉన్న తెలుగు చిత్రాలు ఓటీటీలోకి వస్తున్నాయి. కామెడీతో థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించిన టిల్లు స్క్వేర్ మూవీ ఈవారమే స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ థియేటర్లలో రిలీజైన మూడు వారాల్లోనే ఓటీటీలో అడుగుపెడుతోంది. ఈ రెండు సినిమాలు ఒకే రోజున రేపు (ఏప్రిల్ 26) స్ట్రీమింగ్‍కు వచ్చేస్తున్నాయి. ఆ వివరాలివే..

టిల్లు స్క్వైర్

టిల్లు స్క్వేర్ సినిమా థియేటర్లలో రీసౌడింగ్ బ్లాక్‍బస్టర్ అయింది. కామెడీ, థ్రిల్‍తో ప్రేక్షకులను మెప్పించిన ఈ చిత్రం భారీ కలెక్షన్లతో అంచనాలకు మించి సక్సెస్ అయింది. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. ఈ టిల్లు స్క్వేర్ సినిమా రేపు (ఏప్రిల్ 26) నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఏప్రిల్ 26 అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ కానుంది. అంటే.. మరికొన్ని గంటల్లోనే ఈ మూవీ స్ట్రీమింగ్ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో మొదలుకానుంది.

టిల్లు స్క్వేర్ మూవీ మార్చి 29వ తేదీన థియేటర్లలో విడుదలైంది. సుమారు రూ.125 కోట్ల కలెక్షన్లు సాధించి బంపర్ హిట్ కొట్టింది. బాక్సాఫీస్‍ను షేక్ చేసినా.. ఈ మూవీ నాలుగు వారాల్లోనే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో అడుగుపెడుతోంది. ఈ చిత్రం ఓటీటీలోనూ రికార్డుల మోత మోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక, ఈ అర్ధరాత్రి (ఏప్రిల్ 26) నుంచే టిల్లు స్క్వేర్ మూవీని నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో చూసేయండి. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ స్ట్రీమింగ్‍కు రానుంది.

ఫ్యామిలీ స్టార్

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా అనుకున్న దాని కంటే ముందే ఓటీటీలోకి వచ్చేస్తోంది. థియేటర్లలో అంతగా ఆకట్టుకోని ఈ చిత్రం అప్పుడే స్ట్రీమింగ్‍కు సిద్ధమైంది. రేపు (ఏప్రిల్ 26) ఫ్యామిలీ స్టార్ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో అడుగుపెట్టనుంది. మరికొన్ని గంటల్లో ఈ అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ అవనుంది. తెలుగుతో పాటు తమిళంలోనూ ఫ్యామిలీ స్టార్ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.

ఫ్యామిలీ స్టార్ సినిమాకు పరుశురామ్ దర్శకత్వం వహించగా.. దిల్‍రాజు, శిరీష్ నిర్మించారు. భారీ అంచనాలతో ఏప్రిల్ 5న థియేటర్లలో విడుదలైన ఈ ఫ్యామిలీ డ్రామా మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో అనుకున్న రేంజ్‍లో వసూళ్లను రాబట్టలేకపోయింది. దీంతో.. ఏకంగా మూడు వారాల్లోనే ప్రైమ్ వీడియో ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఇంత త్వరగా వస్తుండటంతో ఓటీటీలో ఈ చిత్రానికి మంచి వ్యూవర్‌షిప్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ ఫ్యామిలీ స్టార్ మూవీని మరిన్ని గంటల్లో ప్రైమ్ వీడియో ఓటీటీలో చూసేయవచ్చు.

మరోవైపు, మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన భీమా సినిమా నేడు (ఏప్రిల్ 25) డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. తెలుగుతో పాటు మలయాళం, తమిళంలోనూ అందుబాటులోకి వచ్చింది. మార్చి 8న థియేటర్లలోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ అంచనాలను అందుకోలేకపోయింది.