Tillu Square Glimpse: బర్త్‌డే రోజు జరిగిన హారర్ గుర్తు చేసుకున్న స్టార్ బాయ్ సిద్దూ.. టిల్లూ స్క్వేర్ గ్లింప్స్ చూశారా?-tillu square glimpse star boy siddu jonnalagadda birthday surprise for fans bubbly girl anupama parameshwaran ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tillu Square Glimpse: బర్త్‌డే రోజు జరిగిన హారర్ గుర్తు చేసుకున్న స్టార్ బాయ్ సిద్దూ.. టిల్లూ స్క్వేర్ గ్లింప్స్ చూశారా?

Tillu Square Glimpse: బర్త్‌డే రోజు జరిగిన హారర్ గుర్తు చేసుకున్న స్టార్ బాయ్ సిద్దూ.. టిల్లూ స్క్వేర్ గ్లింప్స్ చూశారా?

Hari Prasad S HT Telugu
Feb 07, 2024 09:56 PM IST

Tillu Square Glimpse: స్టార్ బాయ్ సిద్దూ జొన్నలగడ్డ బర్త్ డే అయిన బుధవారం (ఫిబ్రవరి 7) టిల్లూ స్క్వేర్ మూవీ టీమ్ ఓ సర్‌ప్రైజ్ గ్లింప్స్ రిలీజ్ చేసింది. ఇందులో తన లాస్ట్ బర్త్ డే రోజు జరిగిన హారర్ గుర్తు చేసుకొని అతడు తెగ భయపడిపోతాడు.

లాస్ట్ ఇయర్ బర్త్ డే హారర్ గుర్తు చేసుకుంటూ టిల్లూ స్క్వేర్ గ్లింప్స్ వచ్చేసింది
లాస్ట్ ఇయర్ బర్త్ డే హారర్ గుర్తు చేసుకుంటూ టిల్లూ స్క్వేర్ గ్లింప్స్ వచ్చేసింది

Tillu Square Glimpse: డీజే టిల్లూ మూవీతో స్టార్ బాయ్ సిద్దూ జొన్నలగడ్డ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. రెండేళ్ల తర్వాత ఈ మూవీకి సీక్వెల్ టిల్లూ స్క్వేర్ రానుండగా.. మేకర్స్ మాత్రం ప్రమోషన్లు బాగానే చేస్తున్నారు.

అయితే సినిమా టైమ్ బాగాలేక రిలీజ్ వాయిదా పడుతూ వెళ్తోంది. తాజాగా మార్చి 29న ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు వెల్లడించిన మేకర్స్.. సిద్దూ బర్త్ డే (ఫిబ్రవరి 7) సందర్భంగా ఓ ఫన్నీ వీడియో రిలీజ్ చేశారు.

టిల్లూ బర్త్‌డే కష్టాలు

టిల్లూ స్క్వేర్ మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా మేకర్స్ రిలీజ్ చేసిన వీడియోలో సిద్దూ తన చివరి బర్త్ డే కష్టాలు చెప్పుకుంటాడు. కారులో అతడు బబ్లీ గర్ల్ అనుపమ పరమేశ్వరన్ తో కలిసి వెళ్తుంటాడు. ఆమె సడెన్ గా నీ లాస్ట్ బర్త్ డే రోజు ఏం చేశావ్ అని అడుగుతుంది. అది వినగానే అతనిలో ఓ రకమైన భయం మొదలవుతుంది.

వెంటనే డీజే టిల్లూ మూవీలోని సీన్స్ వస్తాయి. తన బర్త్ డే రోజే రాధిక ఇంటికి టిల్లూ వెళ్లడం, అప్పటికే ఆమె అక్కడో మర్డర్ చేయడం.. ఆ శవాన్ని పూడ్చి పెట్టడానికి వాళ్లు పడే కష్టాలు అన్నీ టిల్లూకి గుర్తుకు వస్తాయి. ఆ రోజు ఫ్రెండ్స్ అందరం కలిసి ఓ మూవీ చూసినం.. దాని పేరు నల్లమల ఫారెస్ట్.. నల్ల చీర.. ఎ ఫిల్మ్ బై రాధిక.. చాలా గొప్ప డైరెక్టర్.. కథలు బాగా చెప్తది అంటూ తనదైన స్టైల్లో టిల్లూ చెబుతాడు.

అలాంటి సినిమా కూడా వచ్చిందా అని పక్కనే ఉన్న అనుపమ అడుగుతుంది. ఓటీటీటీ.. పాన్ మల్కాజ్‌గిరి మూవీ అది.. అని టిల్లూ అంటాడు. దాని స్టోరీ ఏంటి అని మళ్లీ అడుగుతుంది. అది బేసికల్లీ లవ్.. హార్ట్ బ్రేక్, హారర్, మిస్టరీ, థ్రిల్లర్, చీటింగ్.. క్రైమ్, ఓవరాల్ గా అయితే చాలా పెద్ద కామెడీ అది అప్పటి తన బర్త్ డేను తలచుకొని అతడు తెగ ఇదైపోతాడు.

టిల్లూ స్క్వేర్ ట్రైలర్ వచ్చేస్తోంది

వీడియో చివర్లో సిద్దూకి బర్త్ డే విషెస్ చెబుతూ ట్రైలర్, మూవీ రిలీజ్ డేట్స్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. టిల్లూ స్క్వేర్ మూవీ ట్రైలర్ ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. ఇక ఈ మూవీ మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిజానికి డీజే టిల్లూ మూవీ 2022, ఫిబ్రవరి 9న రిలీజైంది. సీక్వెల్ కూడా గతేడాదే రావాల్సి ఉంది. కానీ ఎన్నోసార్లు వాయిదా పడుతూ వెళ్లింది.

ఫిబ్రవరి 9కి రావడం ఖాయమనుకున్న సమయంలో సంక్రాంతి ఒప్పందాల మేరకు ఈగల్ కోసం టిల్లూ స్క్వేర్ ను వాయిదా వేశారు. ఈ మూవీ మొత్తానికి మార్చి 29న రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్, సాంగ్స్, సిద్దూ, అనుపమ కెమెస్ట్రీ.. ఇలా అన్నీ చాలా బాగా ఆకట్టుకున్నాయి. దీంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

IPL_Entry_Point