Dj Tillu Square Release Date: డీజే టిల్లు 2 అప్‌డేట్- సిద్ధు జొన్నలగడ్డ సీక్వెల్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
Dj Tillu Square Release Date: సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న డీజే టిల్లు 2 రిలీజ్ డేట్‌ను రిపబ్లిక్ డే సందర్భంగా అఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు. ఈ సినిమా ఎప్పడు ప్రేక్షకుల ముందుకు రానుందంటే?
Dj Tillu Square Release Date: సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లు సీక్వెల్ రిలీజ్ డేట్‌పై క్లారిటీ వచ్చేసింది. రిపబ్లిక్ డే సందర్భంగా శుక్రవారం రోజు సినిమా యూనిట్ అఫీషియల్‌గా డీజే టిల్లు స్క్వేర్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసింది. మార్చి 29న వరల్డ్ వైడ్‌గా డీజే టిల్లు స్క్వేర్ మూవీని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించింది.
రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌తో పాటు కొత్త పోస్టర్‌ను సోషల్ మీడియాలో మూవీ టీమ్ షేర్ చేసింది. ఈ పోస్టర్‌లో సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ రొమాంటిక్‌గా కనిపిస్తోన్నారు. పొట్టి డెనిమ్ షార్ట్‌లో అనుపమ పరమేశ్వరన్ గ్లామర్ డోస్ పెంచుతూ పోస్టర్‌లో దర్శనమిచ్చింది. డీజే టిల్లు 2 సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈగల్ కారణం పోస్ట్‌పోన్...
తొలుత డీజే టిల్లు 2 సినిమాను ఫిబ్రవరి 9న రిలీజ్ చేయాలని భావించారు. డీజే టిల్లు 2022 ఫిబ్రవరి 12న రిలీజైంది. ఫిబ్రవరి సెంటిమెంట్‌ను దృష్టిలో పెట్టుకొని చాలా రోజుల క్రితమే డీజే టిల్లు 2 రిలీజ్ డేట్‌ను అనౌన్స్‌చేశారు. కానీ సంక్రాంతి రిలీజ్‌లకు సంబంధించి నిర్మాతల మధ్య జరిగిన ఒప్పందాల్లో భాగంగా రవితేజ ఈగల్ కోసం డీజే టిల్లు 2 వెనక్కి తగ్గాల్సివచ్చింది.
సంక్రాంతి పోటీని నివారించడమే కాకుండా థియేటర్ల సమస్య తలెత్తకుండా సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈగల్‌ను ఫిబ్రవరి 9కి వాయిదావేశారు. ఈగల్ కోసం సిద్ధు జొన్నలగడ్డ తన రిలీజ్ డేట్‌ను త్యాగం చేయాల్సివచ్చింది. మరో డేట్ మంచి డేట్ కోసం అన్వేషించిన సినిమా యూనిట్ చివరకు మార్చి 29న రావాలని ఫిక్సయ్యారు.
డీజే టిల్లు సక్సెస్...
2022లో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన డీజేటిల్లు మూవీ బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో సిదద్దు జొన్నలగడ్డ యాక్టింగ్, కామెడీ టైమింగ్ ఆడియెన్స్‌ను మెప్పించాయి. ఎనిమిది కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 30 కోట్లకుపైగా కలెక్షన్స్ దక్కించుకున్నది. దాంతో డీజే టిల్లు సీక్వెల్‌పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఫస్ట్ పార్ట్‌లో నేహాశెట్టి హీరోయిన్‌గా నటించింది. సీక్వెల్‌లో అనుపమ పరమేశ్వరన్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు.
గత సినిమాలకు భిన్నంగా కంప్లీట్ గ్లామర్ రోల్‌లో అనుపమ కనిపించబోతున్నట్లు సమాచారం. డీజే టిల్లుకు విమల్ కృష్ణ దర్శకత్వం వహించగా డీజే టిల్లుకు మల్లిక్ రామ్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు. డీజే టిల్లు 2 సినిమాలో హీరోగా నటిస్తూనే ఈ సినిమాకు కథను అందించాడు సిద్ధు జొన్నలగడ్డ. ఈ సీక్వెల్ మూవీని సూర్యదేవర నాగవంశీతో కలిసి డైరెక్టర్ త్రివిక్రమ్ సతీమణి సాయిసౌజన్య నిర్మిస్తోంది.
తెలుసు కదా...
డీజే టిల్లు తర్వాత తెలుసు కదా అనే సినిమా చేస్తున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీతో నీరజ కోన డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. తెలుగు కదాతో పాటు బొమ్మరిల్లు భాస్కర్‌తో మరో మూవీ చేస్తున్నాడు సిద్ధు జొన్నలగడ్డ.