GOAT OTT: ఓటీటీలోకి దళపతి విజయ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎక్కడంటే..-the greatest of all time ott release date thalapathy vijay action thriller to stream on netflix ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Goat Ott: ఓటీటీలోకి దళపతి విజయ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎక్కడంటే..

GOAT OTT: ఓటీటీలోకి దళపతి విజయ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎక్కడంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Oct 01, 2024 12:27 PM IST

The Greatest of All Time OTT Release Date: ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT) సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. విజయ్ దళపతి హీరోగా నటించిన ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. స్ట్రీమింగ్ తేదీని ఓటీటీ ప్లాట్‍ఫామ్ అధికారికంగా వెల్లడించింది.

The Goat OTT Release Date: ఓటీటీలోకి దళపతి విజయ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..  ఎక్కడంటే..
The Goat OTT Release Date: ఓటీటీలోకి దళపతి విజయ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎక్కడంటే..

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (ది గోట్) చిత్రం విపరీతమైన హైప్ మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం సెప్టెంబర్ 2వ తేదీన పాన్ ఇండియా రేంజ్‍లో రిలీజ్ అయింది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ మూవీకి మిక్స్డ్ టాక్ ఎక్కువగా వచ్చింది. దీంతో ఓపెనింగ్ కలెక్షన్లు అదిరిపోయినా ఆ తర్వాత డ్రాప్ అయింది.

ఈ ‘ది గోట్’ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేెందుకు రెడీ అయింది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్‍పై కొంతకాలంగా ఫుల్ బజ్ నడుస్తోంది. ఎట్టకేలకు అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది.

స్ట్రీమింగ్ తేదీ ఇదే

ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ చిత్రం అక్టోబర్ 3వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ స్ట్రీమింగ్‍కు రానుంది. అంటే మరో రెండు రోజుల్లో ఈ చిత్రం ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. ఈ విషయాన్ని ఆ ప్లాట్‍ఫామ్ నేడు (అక్టోబర్ 1) అధికారికంగా వెల్లడించింది. “ఓ సింహం.. గోట్‍గా మారడం ఎప్పుడైనా చూశారా? దళపతి విజయ్ ది గోట్ - ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‍టైమ్ మూవీ నెట్‍ఫ్లిక్స్‌లోకి అక్టోబర్ 3వ తేదీన రానుంది” అని సోషల్ మీడియాలో నెట్‍ఫ్లిక్స్ వెల్లడించింది.

ఐదు భాషల్లో..

ది గోట్ చిత్రం తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అక్టోబర్ 3న నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చేయనుంది. థియేటర్లలో ఐదు భాషల్లో రిలీజైన ఈ చిత్రం.. ఓటీటీలోకి కూడా అన్ని భాషల్లో ఒకేసారి వస్తోంది.

ఎక్కువ నిడివితో..

థియేటర్లతో పోలిస్తే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ది గోట్ చిత్రం రన్‍టైన్ ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. ఓటీటీ వెర్షన్ కోసం మేకర్స్ కొన్ని సీన్లు యాడ్ చేయనున్నారని టాక్. డైరెక్టర్స్ కట్‍తో ఓటీటీలోకి గోట్ చిత్రం స్ట్రీమింగ్‍కు రానుందని తెలుస్తోంది. ఈ మూవీ దర్శకుడు వెంకట్ ప్రభు ఈ విషయంపై గతంలోనే హింట్ ఇచ్చారు

భారీ ఓటీటీ డీల్

ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ చిత్రానికి ఫుల్ హైప్ ఉండటంతో భారీ ధరకు డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఏకంగా రూ.125కోట్లతో డీల్ చేసుకున్నట్టు సమాచారం బయటికి వచ్చింది. ఈ చిత్రం థియేటర్లలో రిలీజైన సుమారు నెలకు నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వస్తోంది.

గోట్ చిత్రంలో డ్యుయల్ రోల్ చేశారు దళపతి విజయ్. యంగ్ క్యారెక్టర్ కోసం డీఏజింగ్ టెక్నాలజీని డైరెక్టర్ వెంకట్ వినియోగించారు. దీనిపై మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అందులోనూ ఈ మూవీ అంచనాలను అందుకోలేకపోయింది. ఈ చిత్రంలో విజయ్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‍గా నటించారు. ప్రశాంత్, ప్రభుదేవ, మోహన్, జయరాం, అజ్మల్ అమీర్, వైభవ్, యోగిబాబు కీలకపాత్రలు చేశారు. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ త్రిష ఓ స్పెషల్ సాంగ్ చేశారు.

గోట్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.400కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది. ఈ మూవీ బడ్జెట్ కూడా దాదాపు రూ.400కోట్లుగా ఉంది. ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్‌టైన్‍మెంట్ బ్యానర్ నిర్మించింది. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.