Thalapathy Vijay Spark Song: దళపతి విజయ్ డీ-ఏజ్డ్ లుక్‍పై సోషల్ మీడియాలో రచ్చ.. పాటపైనా అసంతృప్తి!-thalapathy vijay de aged look in the greatest of all time spark song getting mixed response in social media ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Thalapathy Vijay Spark Song: దళపతి విజయ్ డీ-ఏజ్డ్ లుక్‍పై సోషల్ మీడియాలో రచ్చ.. పాటపైనా అసంతృప్తి!

Thalapathy Vijay Spark Song: దళపతి విజయ్ డీ-ఏజ్డ్ లుక్‍పై సోషల్ మీడియాలో రచ్చ.. పాటపైనా అసంతృప్తి!

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 03, 2024 11:23 PM IST

Thalapathy Vijay De-aged Spark Song: ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమా నుంచి మూడో పాట వచ్చింది. ఈ పాటలో విజయ్ లుక్‍పై సోషల్ మీడియాలో రచ్చ సాగుతోంది. పాటపై కూడా చాలా మంది పెదవి విరుస్తున్నారు.

Thalapathy Vijay Spark Song: దళపతి విజయ్ డీ-ఏజ్డ్ లుక్‍పై సోషల్ మీడియాలో రచ్చ
Thalapathy Vijay Spark Song: దళపతి విజయ్ డీ-ఏజ్డ్ లుక్‍పై సోషల్ మీడియాలో రచ్చ

తమిళ స్టార్ దళపతి విజయ్ హీరోగా ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‍టైమ్ (గోట్) సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ఆయన డ్యుయల్ రోల్ చేస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీగా దర్శకుడు వెంకట్ ప్రభు రూపొందిస్తున్నారు. ఈ చిత్రంపై భారీ హైప్ ఉంది. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‍గా నటిస్తున్నారు. గోట్ చిత్రం నుంచి నేడు (ఆగస్టు 3) స్పార్క్ అంటూ మూడో సాంగ్ వచ్చింది. అయితే, ఈ లిరికల్ వీడియోలో విజయ్ లుక్‍పై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.

డీ-ఏజ్డ్ లుక్

గోట్ చిత్రంలో రెండు పాత్రల్లో విజయ్ కనిపించనున్నారు. వయసు తక్కువగా చూపించేందుకు స్పార్క్ పాటలో మూవీ మేకర్స్ డీ-ఏజింగ్ టెక్నాలజీ వాడారు. దీంతో విజయ్‍ను యువకుడిలా డిఫరెంట్ లుక్‍లో చూపించారు. కోర మీసం, ట్రెండీ గడ్డంతో ఈ లుక్ ఉంది. ఈ డీ-ఏజ్డ్ లుక్‍పై రచ్చ సాగుతోంది.

మిక్స్డ్ రెస్పాన్స్

స్పార్క్ పాటలో దళపతి విజయ్ డీ-ఏజ్డ్ లుక్‍పై మిక్స్ రెస్పాన్స్ వస్తోంది. ఈ లుక్‍పై కొందరు తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ లుక్ అనవసరమని, సాధారణంగానే ఉన్నా బాగుండేదని కొందరు ట్వీట్లు చేస్తున్నారు. కొందరు ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయిన డాలీ ఛాయ్ వాలాతో విజయ్ డీ-ఏజ్ లుక్‍ను ఓ ట్విట్టర్ యూజర్ పోల్చారు. ఈ లుక్‍కు డాలీనే స్ఫూర్తినా అంటూ వెటకారంగా పోస్ట్ చేశారు.

విజయ్ డీ-ఏజ్డ్ లుక్ చాలా తేడాగా అనిపిస్తోందని కొందరు పోస్టులు చేస్తున్నారు. ఈ లుక్ స్టిల్స్‌ లో బాగానే ఉన్నా.. వీడియో పార్ట్స్‌లో చాలా విచిత్రంగా అనిపిస్తోందని ఓ యూజర్ ట్వీట్ చేశారు. అసలు ఈ ప్రయోగం ఎందుకని, మేకర్ ద్వారా యంగ్ లుక్ చూపించి ఉంటే బాగుండేదని మరో యూజర్ అభిప్రాయపడ్డారు.

విజయ్ ఫ్యాన్స్ కూడా ట్రోలింగ్‍కు గట్టిగానే బదులిస్తున్నారు. డీ-ఏజింగ్ టెక్నాలజీ అంటే అలాగే ఉంటుందని, లుక్ బాగానే ఉందని అంటున్నారు. కొత్తగా కనిపిస్తున్నందుకు బాలేదని అనడం సరికాదంటూ సమాధానాలు ఇస్తున్నారు. ఈ లుక్ బాగానే ఉందంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇలా, విజయ్ డీ-ఏజ్డ్ లుక్‍పై సోషల్ మీడియాలో రచ్చ సాగుతోంది.

పాటపై కూడా..

ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‍టైమ్ నుంచి వచ్చిన ఈ స్పార్క్ పాటపై కూడా ఎక్కువగా నెగెటివ్ స్పందన వస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజాపై కొందరు విజయ్ ఫ్యాన్స్ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విజయ్ త్వరగా రాజకీయాల్లోకి వస్తుండటంతో ఈ చిత్రాన్ని ఫ్యాన్స్ చాలా ముఖ్యంగా భావిస్తున్నారు. స్పార్క్ అంటూ పాటకు పేరు పెట్టి.. ఇలాంటి స్లో ట్యూన్ ఇవ్వడమేంటని కొందరు పెదవి విరుస్తున్నారు. మొత్తంగా స్పార్క్ పాటకు అన్ని విషయాల్లో మిశ్రమ స్పందన వస్తోంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సాంగ్ వచ్చింది.

ఈ గోట్ చిత్రం సెప్టెంబర్ 5వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ మూవీలో విజయ్, మీనాక్షి లీడ్ రోల్స్ చేస్తుండగా ప్రశాంత్, ప్రభుదేవ కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. అజ్మల్ అమీర్, మోహన్, జయరాం, స్నేహ, లైలా, వైభవ్, యోగిబాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు. మానాడు ఫేమ్ వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఏజీఎస్ ఎంటర్‌టైన్‍మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.