The Greatest of All Time Release Date: దళపతి విజయ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ రిలీజ్ డేట్ ఫిక్స్
The Greatest of All Time Release Date: తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ నటిస్తున్న ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. వినాయక చతుర్థికి ఈ సినిమా రిలీజ్ కానుంది.
The Greatest of All Time Release Date: ఈ ఏడాది మోస్ట్ అవేటెడ్ మూవీస్ లో ఒకటైన తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ రిలీజ్ డేట్ ను గురువారం (ఏప్రిల్ 11) అనౌన్స్ చేశారు. ఈ విషయాన్ని విజయ్ తోపాటు మేకర్స్ కూడా సోషల్ మీడియా ఎక్స్ ద్వారా వెల్లడించారు. సినిమా గణేష్ చతుర్థి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్
వెంకట్ ప్రభు డైరెక్ట్ చేసిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ సెప్టెంబర్ 5న రిలీజ్ కానుంది. ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీలో విజయ్ డ్యుయల్ రోల్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. మూవీ రిలీజ్ డేట్ ను విజయ్ ఎక్స్ ద్వారా అనౌన్స్ చేశాడు. ఈ సందర్భంగా మేకర్స్ ఓ కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. అందులో విజయ్ కళ్లజోడు పెట్టుకొని, ఓ ఫార్మల్ షర్ట్ లో సాల్ట్ పెప్పర్ లుక్ లో కనిపించాడు.
ఆ పోస్టర్ పై సెప్టెంబర్ ఫిఫ్త్ అని ఇంగ్లిష్ అక్షరాల్లో రాసి ఉంది. ఈ పోస్టర్ నే డైరెక్టర్ వెంకట్ ప్రభు కూడా ఎక్స్ లో షేర్ చేశాడు. "ఈద్ శుభాకాంక్షలు. మేము గణేష్ చతుర్థి సందర్భంగా సెప్టెంబర్ 5న వస్తున్నాం. మన దళపతి కోసం ఓ విజిల్ వేయండి" అనే క్యాప్షన్ తో వెంకట్ ప్రభు ఈ విషయాన్ని వెల్లడించాడు.
డ్యుయల్ రోల్లో విజయ్
ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీలో దళపతి విజయ్ డ్యుయల్ రోల్లో కనిపించనున్నాడు. అందులో ఒకదాంట్లో విజయ్ యువకుడిగా ఉన్న పాత్ర కావడం విశేషం. ఈ పాత్ర కోసం ఆర్టిఫిషీయిల్ ఇంటెలిజెన్స్ సాయం కూడా తీసుకున్నారు. హాలీవుడ్ మూవీ జెమిని మ్యాన్ కు ఇది రీమేక్ అన్న వాదన కూడా ఉంది. మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగానే చాలా మంది ఆ సినిమాతో పోల్చారు.
ఈ ది గోట్ మూవీలో విజయ్ తోపాటు ప్రశాంత్, ప్రభు దేవా, స్నేహ, లైలా, జయరాం, మీనాక్షి చౌదరి, యోగి బాబులాంటి వాళ్లు నటిస్తున్నారు. సినిమాకు యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నాడు. పాలిటిక్స్ లోకి పూర్తిగా వెళ్లే ముందు విజయ్ నటిస్తున్న చివరి సినిమాల్లో ఒకటైన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
విజయ్ పాలిటిక్స్
విజయ్ ఈ మధ్యే రాజకీయ పార్టీని ప్రారంభించిన విషయం తెలిసిందే. అంతేకాదు 2026 తమిళనాడు ఎన్నికల్లోనూ పోటీ చేయనున్నట్లు అతడు వెల్లడించాడు. దీంతో వచ్చే ఏడాది నుంచి విజయ్ పూర్తిగా రాజకీయాలపైనే దృష్టి సారించనున్నాడు. ఈ నేపథ్యంలో ది గోట్ తర్వాత అతడు తన కెరీర్లో చివరి మూవీ చేయనున్నాడు. ఇది విజయ్ కు 69వ సినిమా కానుంది.
ఈ సినిమా కోసం అతడు ఏకంగా రూ.250 కోట్లు తీసుకోబోతున్నాడని, హెచ్ వినోథ్ డైరెక్ట్ చేయనున్నాడని ఈ మధ్య వార్తలు వచ్చాయి. విజయ్ చివరి సినిమా అన్న ప్రచారంతో ఈ సినిమాకు ఓ రేంజ్ లో కలెక్షన్లు ఖాయం. అందుకే విజయ్ తన రెమ్యునరేషన్ ను భారీగా పెంచేశాడు.