Telugu Comedy OTT: నేరుగా ఓటీటీలోకి తెలుగు కామెడీ మూవీ సోప‌తులు - స్ట్రీమింగ్ ఎందులో...ఎప్పుడంటే?-telugu comedy movie sopathulu directly streaming on etv win ott from september 19th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Comedy Ott: నేరుగా ఓటీటీలోకి తెలుగు కామెడీ మూవీ సోప‌తులు - స్ట్రీమింగ్ ఎందులో...ఎప్పుడంటే?

Telugu Comedy OTT: నేరుగా ఓటీటీలోకి తెలుగు కామెడీ మూవీ సోప‌తులు - స్ట్రీమింగ్ ఎందులో...ఎప్పుడంటే?

Nelki Naresh Kumar HT Telugu
Sep 15, 2024 04:16 PM IST

Telugu Comedy OTT: తెలుగు ఎమోష‌న‌ల్ కామెడీ మూవీ సోప‌తులు డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అవుతోంది. సెప్టెంబ‌ర్ 19 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కిన ఈ మూవీలో భాను ప్ర‌కాష్, సృజ‌న్‌, మ‌ణి అగుర్ల‌, మోహ‌న్ భ‌గ‌త్‌ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

సోప‌తులు మూవీ
సోప‌తులు మూవీ

Telugu Comedy OTT: ఇటీవ‌లే ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజైన వీరాంజ‌నేయులు విహార యాత్ర మూవీ క్లీన్‌ కామెడీతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. తాజాగా ఈటీవీ విన్‌లోకి సోప‌తులు పేరుతో మ‌రో ఎమోష‌న‌ల్ కామెడీ డ్రామా మూవీ రాబోతోంది. సోప‌తులు రిలీజ్ డేట్‌ను ఈటీవీ విన్ రివీల్ చేసింది. సెప్టెంబ‌ర్ 19 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు వెల్ల‌డించింది. రిలీజ్ డేట్ పోస్ట‌ర్‌ను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది.

మిడిల్ క్లాస్ మెలోడీస్ డైరెక్ట‌ర్‌...

సోప‌తులు మూవీలో భాను ప్ర‌కాష్, సృజ‌న్‌, మ‌ణి అగుర్ల‌, మోహ‌న్ భ‌గ‌త్‌, అనూష ర‌మేష్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తోన్నారు. సోప‌తులు మూవీకి అనంత్ వ‌ర్ధ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ద‌ర్శ‌కుడిగా ఇదే అత‌డికి మొద‌టి మూవీ అని స‌మాచారం. ఆనంద్ దేవ‌ర‌కొండ‌తో మిడిల్‌ క్లాస్ మెలోడీస్ సినిమాను తెర‌కెక్కించిన డైరెక్ట‌ర్ వినోద్ అనంతోజు సోప‌తులు మూవీకి ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్నాడు. డైరెక్ట్‌గా ఓటీటీ కోస‌మే ఈ మూవీని రూపొందించిన‌ట్లు స‌మాచారం.

తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌...

సోప‌తులు మూవీ కంప్లీట్‌గా తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో సాగ‌నున్న‌ట్లు స‌మాచారం. తొమ్మిదేళ్ల వ‌య‌సున్న ఇద్ద‌రు చిన్నారుల చుట్టూ ఈ క‌థ సాగ‌నున్న‌ట్లు తెలిసింది. ఆన్‌లైన్ క్లాస్‌లు అటెండ్ కావ‌డానికి స్నేహితుల‌కు స్మార్ట్‌ఫోన్ అవ‌స‌రం అవుతుంది.

ఆ ఫోన్ కోసం వారు చేసిన అడ్వెంచ‌ర్స్‌, ఈ క్ర‌మంలో ఇద్ద‌రు స్నేహితులు ఎదుర్కొన్న క‌ష్టాల‌ను వినోదాత్మ‌కంగా సోప‌తులు మూవీలో చూపించ‌బోతున్న‌ట్లు చెబుతోన్నారు. ఈ సినిమాలోని డైలాగ్స్ మొత్తం తెలంగాణ మాండ‌లికంలోనే ఉండ‌నున్న‌ట్లు తెలిసింది. న‌వ్విస్తూనే హృద‌యాల్ని క‌దిలించే భావోద్వేగాల‌తో ఈ క‌థ సాగ‌నున్న‌ట్లు స‌మాచారం.

ఆరంభం టీమ్‌...

సోప‌తులు సినిమాకు సింజీత్ ఎర్ర‌మ‌ల్లి మ్యూజిక్ అందిస్తున్నాడు. తెలుగులో వ‌చ్చిన సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ మూవీ ఆరంభం మూవీకి సింజీత్ సంగీతం అందించాడు. సింజీత్‌తో పాటు ఆరంభం సినిమాకు ప‌నిచేసిన ప‌లువురు టెక్నిషియ‌న్లు, యాక్ట‌ర్స్ సోప‌తులు సినిమాలో భాగ‌మ‌య్యారు.

కేరాఫ్ కంచెర‌పాలెం...

సోప‌తులు సినిమాలో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తోన్న మోహ‌న్ భ‌గ‌త్ ఇదివ‌ర‌కు తెలుగులో కేరాఫ్ కంచెర‌పాలెం, ఆరంభంతో పాటు మ‌రొకొన్ని సినిమాల్లో కీల‌క పాత్ర‌లు చేశాడు. ఇందులోనూ మోహ‌న్ భ‌గ‌త్ ఓ డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. మ‌ణి అగుర్ల...మేమ్ ఫేమ‌స్‌, మెయిల్ వంటి కామెడీ మూవీస్‌లో సినిమాల్లో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్ చేశాడు. సోప‌తులు మూవీ ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ ఒక‌టి, రెండు రోజుల్లో రిలీజ్ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.

టాపిక్