AP New Liquor Policy : లిక్కర్ ప్రియులకు గుడ్‌న్యూస్.. తెలంగాణ, కర్ణాటక కంటే తక్కువ ధరకే మద్యం!
- AP New Liquor Policy : ఏపీలోని మందు బాబులకు త్వరలోనే ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. ఇన్నాళ్లు మద్యం ధరలు ఎక్కువగా ఉన్నాయని బాధపడుతున్న వారికి బిగ్ రిలీఫ్ దక్కనుంది. అవును.. ఏపీలో మద్యం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.
- AP New Liquor Policy : ఏపీలోని మందు బాబులకు త్వరలోనే ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. ఇన్నాళ్లు మద్యం ధరలు ఎక్కువగా ఉన్నాయని బాధపడుతున్న వారికి బిగ్ రిలీఫ్ దక్కనుంది. అవును.. ఏపీలో మద్యం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.
(1 / 5)
ఆంధ్రప్రదేశ్ నూతన మద్యం పాలసీపై కసరత్తు దాదాపు ముగిసింది. 2014 నుంచి 2019 మధ్య అమల్లో మద్యం పాలసీని అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మద్యం పాలసీ అమల్లోకి వస్తే మందు బాబులకు రిలీఫ్ దక్కనుంది. అటు ఎన్నికల సమయంలోనూ తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందుబాటులోకి తెస్తామని చంద్రబాబు ప్రకటించారు.(Image source: https://istockphoto.com)
(2 / 5)
కొత్త లిక్కర్ పాలసీ అమల్లోకి వస్తే.. మద్యం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల కంటే తక్కువగా మద్యం ధరలు ఉండేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు సంబంధించి అధికారులు ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్న పాలసీని అధ్యయనం చేసినట్టు తెలుస్తోంది.(Image source: https://istockphoto.com)
(3 / 5)
అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త మద్యం విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఏపీలో అమలవుతున్న మద్యం పాలసీ సెప్టెంబర్ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త లిక్కర్ పాలసీపై కూటమి ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. అతి త్వరలోనే దీనిపై ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.(Image source: https://istockphoto.com)
(4 / 5)
కొత్త పాలసీపై ఇప్పటికే మంత్రివర్గ ఉప సంఘం సమావేశమైంది. 17వ తేదీన కేబినెట్ సబ్ కమిటీ ఆఖరి సమావేశం జరగనుంది. ఈ నెల 18న జరిగే కేబినెట్ భేటీలో కొత్త లిక్కర్ పాలసీ ప్రతిపాదనలను ఉంచాలని సబ్ కమిటీ నిర్ణయించింది. కేబినెట్ ఆమోదం తర్వాత కొత్త పాలసీని ప్రకటించే అవకాశం ఉంది. (Image source: https://istockphoto.com)
(5 / 5)
గత ప్రభుత్వం మద్యం విధానాన్ని పూర్తిగా అస్తవ్యస్తంగా చేసిందని.. కేబినెట్ సబ్ కమిటీ అభిప్రాయపడింది. సొంత ఆదాయం పెంచుకునేందుకే మద్యం విధానం రూపొందించారని ఆరోపించింది. గత ప్రభుత్వ మద్యం విధానం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతిన్నదని.. అందుకోసమే కొత్త లిక్కర్ పాలసీ ఏర్పాటు చేస్తున్నామని కూటమి నేతలు చెబుతున్నారు. (Disclaimer - మద్యపానం ఆరోగ్యానికి హానికరం)(Image source: https://istockphoto.com)
ఇతర గ్యాలరీలు