ETV Win OTT Telugu Movies: ఈ నెలలో ఈటీవీ విన్ ఓటీటీలోకి రానున్న మూడు తెలుగు సినిమాలు ఇవే.. ఓ కొరియన్ వెబ్ సిరీస్ కూడా..
ETV Win OTT Telugu Movies: ఈటీవీ విన్ ఓటీటీలోకి సెప్టెంబర్ నెలలో మూడు ఇంట్రెస్టింగ్ తెలుగు సినిమాలు రాబోతున్నాయి. అంతేకాదు తొలిసారి ఈ ఓటీటీలోకి తెలుగులోకి డబ్ చేసిన కొరియన్ వెబ్ సిరీస్ కూడా రానుండటం విశేషం. ఈ విషయాన్ని సదరు ఓటీటీయే వెల్లడించింది.
ETV Win OTT Telugu Movies: ఈటీవీ విన్ తమ ప్లాట్‌ఫామ్ లో ఈ నెలలో రిలీజ్ కానున్న సినిమాలు, వెబ్ సిరీస్ వివరాలను తెలిపింది. సెప్టెంబర్ సర్‌ప్రైజెస్ అంటూ తమ ఓటీటీలోకి రాబోతున్న మూడు తెలుగు సినిమాలు ఏవో వెల్లడించింది. ఇందులో తొలిసారి ఓ కొరియన్ వెబ్ సిరీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా ఉండటం విశేషం.
ఈటీవీ విన్ సెప్టెంబర్ రిలీజెస్
ప్రముఖ తెలుగు ఓటీటీల్లో ఒకటైన ఈటీవీ విన్ ఓటీటీలోకి సెప్టెంబర్ నెలలో మూడు తెలుగు సినిమాలు రానున్నాయి. అందులో ఒకటి గత నెలలో థియేటర్లలో రిలీజై సంచలన విజయం సాధించిన కమిటీ కుర్రోళ్లు కూడా ఒకటి.
ఇక మరొకటి రెండేళ్ల కిందట థియేటర్లలో రిలీజైన సురాపానం మూవీ కావడం విశేషం. మూడోది ఈటీవీ విన్ ఒరిజినల్ మూవీ సోపతులు. ఇక ఇందులోనే వెల్‌కమ్ 2 లైఫ్ అనే ఓ కొరియన్ వెబ్ సిరీస్ కూడా ఉంది. "సెప్టెంబర్ సర్‌ప్రైజెస్" అనే క్యాప్షన్ తో ఈటీవీ విన్ ఓటీటీ ఈ రాబోయే సినిమాల గురించి తెలిపింది.
కమిటీ కుర్రోళ్లు ఓటీటీ రిలీజ్ డేట్
నిహారిక కొణిదెల నిర్మించిన కమిటీ కుర్రోళ్లు మూవీ ఎంతటి హిట్ అయ్యిందో మనకు తెలుసు. ఈ రూరల్ కామెడీ డ్రామా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. సినిమా డిజిటల్ హక్కులు తమ దగ్గరే ఉన్నాయని గత నెలలో వెల్లడించిన ఈటీవీ విన్ ఓటీటీ.. ఈ నెలలో వస్తుందని తెలిపింది.
అయితే ఇప్పటి వరకూ అధికారికంగా తేదీ మాత్రం చెప్పలేదు. తాజాగా వస్తున్న వార్తల ప్రకారం సెప్టెంబర్ 12న మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
సురాపానం మూవీ గురించి..
సెప్టెంబర్ లో ఈటీవీ విన్ ఓటీటీలోకి వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ మూవీ సురాపానం. నిజానికి ఈ సినిమా జూన్ 10, 2022న థియేటర్లలో రిలీజైంది. రెండేళ్ల మూడు నెలల తర్వాత ఇప్పుడు ఈ ఓటీటీలోకి అడుగుపెడుతుండటం విశేషం. గతేడాది అక్టోబర్ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా.. ఇప్పుడు మరో ఓటీటీలోకీ వస్తోంది.
వెల్‌కమ్ 2 లైఫ్ సిరీస్
వెల్‌కమ్ 2 లైఫ్ ఐదేళ్ల కిందట వచ్చిన ఓ కొరియన్ వెబ్ సిరీస్. ఇప్పుడీ సిరీస్ ఈటీవీ విన్ ఓటీటీలోకి తెలుగులో రానుండటం విశేషం. ఓ ప్రమాదం వల్ల మరో ప్రపంచంలోకి వెళ్లిపోయే ఓ లాయర్ చుట్టూ తిరిగే కథతో ఈ సిరీస్ రూపొందింది.
ఈటీవీ విన్ సెప్టెంబర్ లో రాబోయే ఈ సినిమాలు, సిరీస్ గురించి వెల్లడించినా.. వాటి రిలీజ్ డేట్స్ గురించి మాత్రం చెప్పలేదు. రాబోయే రోజుల్లో వీటిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.