Raghava Lawrence: తెలుగు డైరెక్టర్‌తో రాఘవ లారెన్స్ 25వ మూవీ ఫిక్స్ - అనౌన్స్‌మెంట్ రోజే రిలీజ్ డేట్ రివీల్!
Raghava Lawrence: రాఘవ లారెన్స్ హీరోగా తన 25వ మూవీని శనివారం అఫీషియల్‌గా అనౌన్స్‌చేశాడు. ఈ మూవీకి టాలీవుడ్ డైరెక్టర్, రాక్షసుడు ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ ఏడాది నవంబర్‌లో షూటింగ్‌ను ప్రారంభించి వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Raghava Lawrence: హీరోగా తన 25వ మూవీని తెలుగు దర్శకుడితో చేయబోతున్నాడు రాఘవ లారెన్స్. లారెన్స్ 25వ మూవీ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ శనివారం వచ్చేసింది. ఈ సినిమాకు రాక్షసుడు ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు.కె.ఎల్. యూనివర్శిటీ ఛైర్మన్ కోనేరు సత్యనారాయణ ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది.
నవంబర్‌లో షూటింగ్...
లారెన్స్, రమేష్ వర్మ మూవీ అనౌన్స్‌మెంట్ పోస్టర్ ఆసక్తిని పంచుతోంది. ఇందులో షాడో అవతారంలో లారెన్స్ కనిపిస్తున్నాడు. పొడవైన జట్టుతో రైలు పట్టాలపై రౌద్రంగా లారెన్స్ నిల్చొన్నట్లుగా ఈ పోస్టర్‌లో కనిపిస్తోంది. లారెన్స్ 25వ సినిమా షూటింగ్‌ను నవంబర్‌లో ప్రారంభించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
2025 సమ్మర్‌లో సినిమాను విడుదలచేస్తామని వెల్లడించారు. లారెన్స్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాల్లో ఒకటిగా తెరకెక్కుతోన్న ఈ మూవీని పాన్ ఇండియన్ రేంజ్‌తో తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. త్వరలోనే హీరోయిన్‌తో పాటు ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాల్ని మేకర్స్ వెల్లడించబోతున్నారు.
రవితేజ ఖిలాడి...
దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తోన్న సినిమా ఇది. చివరగా 2022లో రవితేజతో ఖిలాడి మూవీ చేశాడు రమేష్ వర్మ. దాదాపు 30 కోట్ల బడ్జెట్‌తో భారీ అంచనాలు నడుమ రిలీజైన ఖిలాడి మూవీ డిజాస్టర్‌గా నిలిచింది.
రాక్షసుడుతో హిట్...
ఖిలాడి కంటే ముందు రమేష్ వర్మ దర్శకత్వం వహించిన రాక్షసుడు మాత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. సైకో కిల్లర్ కాన్సెప్ట్‌తో రాక్షసుడు సినిమాను రమేష్ వర్మ తెరకెక్కించాడు. రాక్షసుడు, ఖిలాడి...రెండు సినిమాలను కోనేరు సత్యనారాయణ నిర్మించారు.
లారెన్స్ సినిమాతో ఈ బ్యానర్‌లో హ్యాట్రిక్ మూవీ చేయనున్నాడు రమేష్ వర్మ. లారెన్స్ మూవీ దర్శకుడిగా రమేష్ వర్మకు తొమ్మిదో సినిమా. తరుణ్ ఒక ఊరిలో మూవీతో దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రమేష్ వర్మ...రైడ్, వీర, అమ్మాయితో అబ్బాయితో పాటు మరికొన్ని సినిమాలను తెరకెక్కించాడు.
గత ఏడాది మూడు సినిమాలు...
మరోవైపు గత కొన్నాళ్లుగా లారెన్స్ బ్యాడ్‌టైమ్ నడుస్తోంది. గత ఏడాది లారెన్స్ హీరోగా నటించిన చంద్రముఖి 2, రుద్రన్ డిజాస్టర్స్‌గా నిలిచాయి. జిగర్తాండ డబుల్ ఎక్స్ మంచి సినిమాగా పేరొచ్చిన కమర్షియల్‌గా మాత్రం ఆశించిన వసూళ్లను దక్కించుకోలేకపోయింది. ప్రస్తుతం తమిళంలో దుర్గ, అధిగారం సినిమాలు చేస్తోన్నాడు లారెన్స్.
పూజాహెగ్డే హీరోయిన్..
తనను హీరోగా నిలబెట్టిన కాంచన ఫ్రాంచైజ్‌లో నాలుగో మూవీని చేసేందుకు లారెన్స్ సన్నాహాలు చేస్తోన్నాడు. కాంచన 4 టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీలో హీరోగా నటిస్తూనే దర్శకత్వం వహించబోతున్నాడు లారెన్స్. కాంచన 4లో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.