Japan vs Jigarthanda Telugu Collection:ఈ దీపావళికి తెలుగు, తమిళ భాషల్లో కార్తి జపాన్, లారెన్స్ జిగర్‌తాండ డబుల్ ఎక్స్ మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. రెండు భాషల్లో పండుగకు రిలీజైన సినిమాల్లో ఇవే భారీ బడ్జెట్ మూవీస్ కావడం గమనార్హం. జపాన్ సినిమాకు రాజ్ మురుగన్ డైరెక్టర్ కాగా... , జిగర్ తాండ సీక్వెల్‌కు కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం వహించాడు. భారీ అంచనాలతో రిలీజైన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.
భారీ నష్టాల దిశగా సాగుతోన్నాయి. కార్తి జపాన్ మూడు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 15 కోట్లకుపైగా గ్రాస్, ఏడున్నర కోట్లకు వరకు షేర్ కలెక్షన్స్ రాబట్టింది. తెలుగులో ఈ మూవీ ఇప్పటివరకు మూడున్నర కోట్ల వరకు గ్రాస్‌ను, కోటి డెబ్బై లక్షల వరకు షేర్ కలెక్షన్స్ దక్కించుకున్నట్లు సమాచారం.
తొలిరోజు జపాన్ మూవీకి కోటికిపైగా కలెక్షన్స్ వచ్చాయి. కానీ నెగెటివ్ టాక్ కారణంగా మూడో రోజు వసూళ్లు దారుణంగా పడిపోయాయి. ఆదివారం రోజు ఈ సినిమా 35 లక్షల వరకు మాత్రమే వసూళ్లను సొంతం చేసుకున్నది. తెలిసింది. జపాన్ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటించింది.
లారెన్స్, ఎస్‌జేసూర్య హీరోలుగా నటించిన జిగర్‌తాండ డబుల్ ఎక్స్ తెలుగులో పూర్తిగా నిరాశ పరిచింది. మూడు రోజుల్లో ఈ మూవీకి రెండు కోట్ల నలభై లక్షల వరకు గ్రాస్, కోటి ఇరవై లక్షల షేర్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. మూడో రోజు ఈ సినిమా యాభై లక్షల వరకు వసూళ్లు దక్కించుకున్నట్లు తెలిసింది. తెలుగులో కార్తి జపాన్ కంటే జిగర్ తాండ ఎక్కువగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. జపాన్ నాలుగు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజవ్వగా...జిగర్ తాండ డబుల్ ఎక్స్ ఐదున్నర కోట్ల వరకు ప్రీ రిలీజ్ చేసింది. కలెక్షన్స్ చూస్తుంటే రెండు సినిమాలు తెలుగులో బ్రేక్ ఈవెన్ కావడం కష్టంగానే కనిపిస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. జపాన్, జిగర్‌తాండ నిర్మాతలకు భారీగా నష్టాలను మిగిల్చే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు.