రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కలయికలో వచ్చిన ఖిలాడి చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా నిర్మాతలకు నష్టాలను మిగిల్చింది. రవితేజకు రమేష్ వర్మ ఫ్లాప్ ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా వీరిద్దరి కలయికలో వచ్చిన వీర సినిమా కూడా ఫెయిల్యూర్ గా నిలిచింది. అయినా అతడిపై నమ్మకంతో ఖిలాడికి దర్శకుడిగా అవకాశం ఇచ్చారు రవితేజ. ఆ నమ్మకాన్ని రమేష్ వర్మ నిలబెట్టుకోలేకపోయారు.
ఈ సినిమా ఫలితం విషయంలో రవితేజ, రమేష్ వర్మ మధ్య బేధాభిప్రాయాలు వచ్చినట్లు వార్తలొచ్చాయి. రవితేజపై రమేష్ వర్మ సతీమణి చేసిన ట్వీట్స్ అప్పట్లో వైరల్‌గా మారాయి. తనకు రెండు ఫ్లాప్‌లను ఇచ్చిన దర్శకుడు రమేష్ వర్మ కు రవితేజ మరోసారి ఛాన్స్ ఇచ్చినట్లు చెబుతున్నారు. రవితేజ ఫ్యామిలీ నుండి ఆయన సోదరుడు రఘు తనయుడు మాధవ్ హీరోగా పరిచయం కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు రమేష్ వర్మ స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ ను సమకూర్చబోతున్నట్లు చెబుతున్నారు. దర్శకత్వ బాధ్యతల్ని కొత్త డైరెక్టర్ చేపట్టబోతున్నట్లు సమాచారం.
వీర, ఖిలాడి తో చేదు ఫలితాలే ఎదురైనా మరోసారి రమేష్ వర్మను రవితేజ ఫ్యామిలీ నమ్మడం టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. మరోవైపు రాక్షసుడు సక్సెస్ తర్వాత రాక్షసుడు -2 పేరుతో సీక్వెల్‌ను తెరకెక్కించబోతున్నట్లు రమేష్ వర్మ ప్రకటించారు. ఈ సినిమాను అనౌన్స్ చేసి చాలా రోజుల అయినా ఇప్పటివరకు షూటింగ్ మొదలుకానుంది.
సంబంధిత కథనం
టాపిక్