Kanguva Release Date: కంగువ రిలీజ్ డేట్ చెప్పేసిన మేకర్స్.. రాజీ పడాల్సి వస్తుందన్న హీరో సూర్య-suriya kanguva released on october 10 on the occasion of dussehra in international languages kollywood cinema news ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kanguva Release Date: కంగువ రిలీజ్ డేట్ చెప్పేసిన మేకర్స్.. రాజీ పడాల్సి వస్తుందన్న హీరో సూర్య

Kanguva Release Date: కంగువ రిలీజ్ డేట్ చెప్పేసిన మేకర్స్.. రాజీ పడాల్సి వస్తుందన్న హీరో సూర్య

Sanjiv Kumar HT Telugu
Jun 29, 2024 02:00 PM IST

Suriya Kanguva Release Date: తమిళ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ ప్రెస్టీజియస్ సినిమా కంగువ విడుదల తేదిని దర్శక నిర్మాతలు తాజాగా అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించి రిలీజ్ చేసిన పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

కంగువ రిలీజ్ డేట్ చెప్పేసిన మేకర్స్.. రాజీ పడాల్సి వస్తుందన్న హీరో సూర్య
కంగువ రిలీజ్ డేట్ చెప్పేసిన మేకర్స్.. రాజీ పడాల్సి వస్తుందన్న హీరో సూర్య

Suriya Kanguva Release Date: స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ 'కంగువ'. ఇటీవల కంగువ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ మోస్ట్ అవేటెడ్ మూవీని అక్టోబర్ 10 దసరా పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకొస్తున్నట్లు వెల్లడించారు.

భారీ బడ్జెట్‌తో

'కంగువ' చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా దిశా పటానీ, సూర్యకు పవర్‌ఫుల్ విలన్‌గా యానిమల్ విలన్ బాబీ డియోల్ నటిస్తున్నారు. 'కంగువ' సినిమాను హ్యూజ్ బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు.

పీరియాడిక్ యాక్షన్

'కంగువ' నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన సిజిల్ టీజర్, పోస్టర్స్ సినిమా మీద క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నాయి. పీరియాడిక్ యాక్షన్ జానర్‌లో ఇప్పటిదాకా తెరపైకి రాని ఒక కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకోబోతోందీ సినిమా. పది భాషల్లో తెరకెక్కుతున్న 'కంగువ' సినిమా త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్

అంతేకాకుండా పలు అంతర్జాతీయ భాషల్లోనూ కంగువ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి వస్తున్న మరో బిగ్గెస్ట్ మూవీగా 'కంగువ' సినిమాపై అటు ట్రేడ్ వర్గాల్లో, ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇక ఈ సినిమాల్లో ప్రధాన పాత్రలతోపాటు తమిళ కమెడియన్ యోగి బాబు కూడా నటిస్తున్నాడు.

ముంబైలో కంగువ గ్లింప్స్

ఇదిలా ఉంటే, ఇటీవల ముంబైలో 'కంగువ' గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో హీరో సూర్యతో పాటు చిత్రబృందం అంతా పాల్లొంది. ఈ సందర్భంగా హీరో సూర్య తన అనుభవాలను, సినీ విశేషాలను ముంబై వేదికగా పంచుకున్నారు. గొప్ప సినిమాల్లో నటించే అదృష్టం కొద్దీ దక్కుతుంటుందని, మన కోరికని ఈ యూనివర్స్ విని అది జరిగేలా చేస్తుందని నమ్ముతానని, అది కంగువ విషయంలో జరిగిందని హీరో సూర్య తెలిపారు.

రాజీ పడాల్సి వస్తుందని

కంగువ చిత్రం షూటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతి రోజు సినిమా మరింత పెద్ద ప్రాజెక్ట్‌గా మారుతూ వచ్చిందని, దానికి తమ డైరెక్టర్ శివకు ధన్యవాదాలు తెలిపాలని సూర్య అన్నారు. అయితే, ప్రతి సినిమాకు స్క్రిప్ట్‌కు, మేకింగ్‌కు మధ్య కొన్ని అంశాల్లో రాజీ పడాల్సి వస్తుందని, కానీ కంగువ మూవీకి మాత్రం ప్రతి రోజూ బెటర్‌గా పని చేస్తూ వచ్చామని సూర్య చెప్పుకొచ్చారు.

25 ఏళ్ల తర్వాత

ఒక పాత్రలోకి మారిపోవడం ఇంట్రెస్టింగ్‌గా, ఎగ్జైటింగ్‌గా ఉంటుందని, నటుడిగా 25 ఏళ్ల అనుభవం తర్వాత ఒక చిత్రానికి మరింత ఎగ్జైట్ అయి పని చేయడం అంత సులువు కాదని సూర్య అన్నారు. కంగువ సినిమాకు 150 రోజులకుపైగా చిత్రీకరించిన షూట్‌లో ప్రతి రోజు ప్రతిసారీ ఆ ఎగ్జైట్‌మెంట్‌ను అనుభవించినట్లుగా సూర్య చెప్పారు.

WhatsApp channel