Suriya Kanguva: సూర్య కంగువ.. పది వేల మందితో సూర్య, బాబీ డియోల్ వార్ సీన్ షూటింగ్-suriya kanguva movie war scene between suriya bobby deol shot with 10000 people reveals a report ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Suriya Kanguva: సూర్య కంగువ.. పది వేల మందితో సూర్య, బాబీ డియోల్ వార్ సీన్ షూటింగ్

Suriya Kanguva: సూర్య కంగువ.. పది వేల మందితో సూర్య, బాబీ డియోల్ వార్ సీన్ షూటింగ్

Hari Prasad S HT Telugu
May 17, 2024 04:14 PM IST

Suriya Kanguva: తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న కంగువ మూవీలో విలన్ బాబీ డియోల్ తో యుద్ధం సీన్ ఏకంగా 10 వేల మందితో తీసినట్లు ఓ రిపోర్టు వెల్లడించింది. ఈ పాన్ ఇండియా మూవీ భారీ బడ్జెట్ తో రూపొందుతున్న విషయం తెలిసిందే.

సూర్య కంగువ.. పది వేల మందితో సూర్య, బాబీ డియోల్ వార్ సీన్ షూటింగ్
సూర్య కంగువ.. పది వేల మందితో సూర్య, బాబీ డియోల్ వార్ సీన్ షూటింగ్

Suriya Kanguva: సూర్య నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ కంగువ. శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై తమిళ ఇండస్ట్రీలోనే కాదు దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ యాక్షన్ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని తాజాగా ఇండియా టుడే రిపోర్టు వెల్లడించింది. మూవీ కోసం సూర్య, బాబీ డియోల్ మధ్య ఓ అత్యంత భారీ యుద్ధానికి సంబంధించిన సీన్ తీసినట్లు ఆ రిపోర్టు తెలిపింది.

కంగువ వార్ సీన్

సూర్య నటిస్తున్న కంగువ మూవీ వర్గాలు వెల్లడించాయంటూ ఆ రిపోర్టు ఓ ఆసక్తికరమైన విషయం చెప్పింది. ఈ సినిమా కోసం తీస్తున్న వార్ సీన్ ను ఏకంగా 10 వేల మందితో తీసినట్లు చెప్పడం విశేషం. "సినిమా సబ్జెక్ట్, థీమ్ ప్రకారం ఆ యుద్ధ సన్నివేశానికి న్యాయం చేయడానికి ది స్టూడియో గ్రీన్, డైరెక్టర్ శివ, మొత్తం టీమ్ అంతా శ్రమించింది. ఈ సినిమాలో సూర్య, బాబీ డియోల్, మరో పది వేల మందితో అతిపెద్ద వార్ సీక్వెన్స్ ఉండనుంది" అని కంగువ వర్గాలు వెల్లడించినట్లు ఆ రిపోర్టు తెలిపింది.

ఓ కళ్లు చెదిరే సినిమాక్ ఎక్స్‌పీరియర్ష్ ను ఆడియెన్స్ కు అందించాలన్న ఉద్దేశంతో ఈ యుద్ధ సన్నివేశంలోని ప్రతి యాక్షన్, స్టంట్స్, విజువలైజేషన్ ను అంతర్జాతీయ నిపుణుల పర్యవేక్షణలో చేసినట్లు కూడా సదరు మూవీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన టీజర్ అసలు సినిమా ఎలా ఉండబోతోందో చెప్పకనే చెప్పింది. ఇందులో సూర్య, బాబీ డియోల్ ఒకరికొకరు ఎదురుపడటం చూడొచ్చు.

ఏంటీ కంగువ మూవీ?

తమిళ ఇండస్ట్రీ నుంచి వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఒకటిగా ఈ కంగువను భావిస్తున్నారు. ఈ సినిమాలో సూర్య డ్యుయల్ రోల్ పోషిస్తున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. అంతేకాదు అంతకుముందే తాను మూవీలో తన భాగం షూటింగ్ పూర్తి చేసినట్లు కూడా చెప్పాడు. ఇక బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ సినిమా ద్వారానే తమిళ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు.

కంగువ మూవీలో ఉధిరన్ అనే విలన్ పాత్రలో బాబీ కనిపించనున్నాడు. ఇదే సినిమా ద్వారా మరో బాలీవుడ్ నటి దిశా పటానీ కూడా తమిళ సినిమాలో అడుగుపెడుతోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో జగపతి బాబు, యోగి బాబు, నటరాజన్ సుబ్రమణ్యం, కేఎస్ రవికుమార్ లాంటి వాళ్లు కూడా నటిస్తున్నారు.

ఇక కంగువ మూవీకి టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది ఏకంగా పది భాషల్లో రిలీజ్ కానుంది. యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నాయి. 3డీ ఫార్మాట్లోనూ సినిమా రానుంది. అయితే కంగువ రిలీజ్ డేట్ పై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

భారీగా ప్రీరిలీజ్ బిజినెస్

కంగువ ప్రీ రిలీజ్ బిజినెస్ 500 కోట్ల‌కుపైనే జ‌రుగ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్ప‌టికే హిందీ డ‌బ్బింగ్ శాటిలైట్, థియేట్రిక‌ల్ హ‌క్కులు క‌లిపి వంద కోట్ల‌కు అమ్ముడుపోయిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

కంగువ సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ను కూడా ఖరారు చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ద‌క్కించుకున్న‌ది. ఎన‌భై కోట్ల‌కు కంగువ ఓటీటీ హ‌క్కుల‌ను అమెజాన్ ప్రైమ్ కొనుగులు చేసిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

Whats_app_banner