Suriya 44: సూర్య కొత్త మూవీ షూటింగ్ షురూ.. డిఫరెంట్‍ లుక్‍లో స్టార్ హీరో: వీడియో-suriya 44 shooting starts suriya with different look in director karthik subbaraj film first shot ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Suriya 44: సూర్య కొత్త మూవీ షూటింగ్ షురూ.. డిఫరెంట్‍ లుక్‍లో స్టార్ హీరో: వీడియో

Suriya 44: సూర్య కొత్త మూవీ షూటింగ్ షురూ.. డిఫరెంట్‍ లుక్‍లో స్టార్ హీరో: వీడియో

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 02, 2024 09:24 PM IST

Suriya 44 First Shot: సూర్య నయా సినిమా షూటింగ్ మొదలైంది. ఫస్ట్ షాట్ అంటూ ఓ వీడియోను టీమ్ రిలీజ్ చేసింది. సూర్య డిఫరెంట్‍ లుక్‍తో కనిపించారు.

Suriya 44: సూర్య కొత్త మూవీ షూటింగ్ షురూ.. డిఫరెంట్‍ లుక్‍లో స్టార్ హీరో: వీడియో
Suriya 44: సూర్య కొత్త మూవీ షూటింగ్ షురూ.. డిఫరెంట్‍ లుక్‍లో స్టార్ హీరో: వీడియో

Suriya 44 Update: తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ఫ్యాంటసీ యాక్షన్ మూవీ ‘కంగువ’ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. శివ దర్శకత్వం వహించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం షూటింగ్ పూర్తవగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. అయితే, కంగువ రిలీజ్ డేట్ ఇంకా ఖరారు కాలేదు. ఈ తరుణంలో సూర్య మరో సినిమా షూటింగ్ మొదలుపెట్టేశారు. తమిళ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య హీరోగా చేస్తున్న ఈ చిత్రం (Suriya 44) షూటింగ్ నేడు (జూన్ 2) షురూ అయింది.

ఫస్ట్ షాట్ వీడియో.. డిఫరెంట్ లుక్‍తో సూర్య

సూర్య 44 నుంచి ఫస్ట్ షాట్ వీడియోను మూవీ టీమ్ నేడు రిలీజ్ చేసింది. లగేజీ పక్కన పెట్టుకొని సముద్రాన్ని సూర్య తదేకంగా చూస్తున్నట్టు వెనుక నుంచి ఈ వీడియో మొదలైంది. ఆ తర్వాత కెమెరావైపు సూర్య తిరుగారు. ముందుగా నవ్వి.. ఆ తర్వాత సీరియస్‍గా ఎక్స్‌ప్రెషన్ మార్చారు. ఈ వీడియోలో సూర్య లుక్ చాలా డిఫరెంట్‍గా ఉంది. గుబురు మీసాలు, కాస్త లాంగ్ హెయిర్‌తో పాటు ఫేస్ కూడా విభిన్నంగా కనిపిస్తోంది. ఇది కాస్త వింటేజ్ లుక్‍లా అనిపిస్తోంది.

సూర్య నయా లుక్‍కు మంచి రెస్పాన్స్ వస్తోంది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. సూర్య అదిరిపోయారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అండమాన్ నికోబార్‌లోని పోర్ట్ బ్లైర్‌లో ఈ మూవీ షూటింగ్ మొదలైంది.

సూర్య 44 చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. అయితే, ట్యాగ్ మాత్రం ‘లవ్.. లాఫర్.. వార్’ అంటూ అప్పుడే చాలా క్యూరియాసిటీ పెంచేసింది. యాక్షన్ థ్రిల్లర్‌గానే ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది.

హీరోయిన్‍గా పూజా హేగ్డే

సూర్య 44 చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‍గా నటించనున్నారు. ఈ విషయంపై మూవీ టీమ్ శనివారమే (జూన్ 1) అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాలోకి పూజకు వెల్‍కమ్ చెప్పింది. జయరాం, కరుణాకరన్, జిజూ జార్జ్ కూడా ఈ చిత్రంలో కీలకపాత్రలు చేయనున్నారు.

సూర్య 44 మూవీని స్టోన్ బీచ్ ఫిల్మ్స్, 2డీ ఎంటర్‌టైన్‍మెంట్ బ్యానర్లపై కార్తీక్ సుబ్బరాజ్, కార్తీకేయన్ సంతానం, కల్యాణ్ సుబ్రమణియం, సూర్య, జ్యోతిక సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. 2025లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తోంది మూవీ టీమ్.

కంగువపై రిలీజ్‍పై ఇంకా నో క్లారిటీ!

సూర్య హీరోగా చేసిన కంగువ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే వచ్చిన లుక్స్, గ్లింప్స్‌తో ఈ మూవీకి క్రేజ్ విపరీతంగా పెరిగింది. అయితే, ఈ మూవీ రిలీజ్ డేట్ ఇంకా ఖరారు కాలేదు. ఈ ఏడాదే రిలీజ్ అవుతుందనే అంచనాలు బలంగా ఉన్నాయి. అక్టోబర్ లేకపోతే డిసెంబర్‌లో విడుదల చేయాలని మూవీ టీమ్ ఆలోచిస్తోందని తెలుస్తోంది. శివ దర్శకత్వం వహిస్తున్న కంగువ చిత్రంలో వీఎఫ్‍ఎక్స్ భారీ స్థాయిలో ఉంటుంది. ఈ కారణంగా ఆలస్యమవుతూ వస్తోంది.

కంగువ చిత్రం 2డీతో పాటు 3డీ, ఐమ్యాక్స్ వెర్షన్‍లలోనూ రానుంది. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్, కేవీఎన్ ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ నిర్మిస్తున్నాయి. దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

టీ20 వరల్డ్ కప్ 2024