Suriya: అభిమానులకు విందు ఇచ్చిన స్టార్ హీరో సూర్య.. కారణమిదే-kollywood star actor suriya gives special lunch party to his fans who participated in michaung cyclone relief works ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Suriya: అభిమానులకు విందు ఇచ్చిన స్టార్ హీరో సూర్య.. కారణమిదే

Suriya: అభిమానులకు విందు ఇచ్చిన స్టార్ హీరో సూర్య.. కారణమిదే

Published Mar 04, 2024 06:19 PM IST Chatakonda Krishna Prakash
Published Mar 04, 2024 06:19 PM IST

  • Suriya: తమిళ స్టార్ హీరో సూర్య మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. అభిమానులకు ప్రత్యేక విందు ఇచ్చారు. ఆయనే స్వయంగా వడ్డించారు. ఆయన ఈ విందు ఎందుకు ఏర్పాటు చేశారంటే..

తమిళ స్టార్ హీరో సూర్య.. తన అభిమానులకు భోజన విందు ఇచ్చారు. మిగ్‍జాం తుఫాన్ సమయంలో సహాయక చర్యల్లో పాల్గొన్న తన ఫ్యాన్స్‌కు ఈ పార్టీ ఇచ్చారు.

(1 / 5)

గతేడాది మిగ్‍జాం తుఫాన్ తమిళనాడుపై తీవ్ర ప్రభావాన్ని చూపగా.. ప్రజలకు తీవ్ర కష్టాలు ఎదురయ్యాయి. అయితే, ప్రజలకు సాయం చేయాలని తన అభిమానులను సూర్య కోరారు. ఆయన సూచన మేరకు చాలా మంది ఫ్యాన్స్.. అప్పుడు సహాయక చర్యలు చేపట్టారు.

(2 / 5)

ఈ తుఫాన్ సహాయక చర్యల్లో సేవలు అందించిన తన అభిమానుల కోసం ఇప్పుడు చెన్నైలో విందు ఏర్పాటు చేశారు సూర్య. తమిళనాడులోని పలు జిల్లాల నుంచి సూర్య అభిమానులు ఈ విందులో పాల్గొన్నారు. 

(3 / 5)

అభిమానులకు స్వయంగా భోజనం కూడా వడ్డించారు సూర్య. చాలా మందితో ఫొటోలు కూడా దిగారు. 

(4 / 5)

సూర్య ప్రస్తుతం కంగువ సినిమా చేస్తున్నారు. ఈ ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి శివ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‍తో రూపొందుతున్న ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. 

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు