Mystery Thriller Movie: పౌరాణిక క‌థ‌తో సుధీర్‌బాబు మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ - బాలీవుడ్ హీరోయిన్‌తో రొమాన్స్‌-sudheer babu join hands with debut director venkat kalyan for mystery thriller pan india movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mystery Thriller Movie: పౌరాణిక క‌థ‌తో సుధీర్‌బాబు మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ - బాలీవుడ్ హీరోయిన్‌తో రొమాన్స్‌

Mystery Thriller Movie: పౌరాణిక క‌థ‌తో సుధీర్‌బాబు మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ - బాలీవుడ్ హీరోయిన్‌తో రొమాన్స్‌

Nelki Naresh Kumar HT Telugu
Jul 01, 2024 05:37 PM IST

Mystery Thriller Movie: పౌరాణిక క‌థాంశంతో హీరో సుధీర్ బాబు ఓ పాన్ ఇండియ‌న్ మూవీ చేస్తోన్నాడు. సూప‌ర్ నాచుర‌ల్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో సుధీర్ బాబుకు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ న‌టించ‌నుంది.

 సుధీర్ బాబు
సుధీర్ బాబు

Mystery Thriller Movie: పౌరాణిక క‌థ‌ల‌తో సినిమాలు చేయ‌డం ప్ర‌జెంట్‌ ట్రెండ్‌గా మారింది. భార‌తీయ పురాణాల‌కు క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌ను జోడించి రూపొందిన క‌ల్కి, హ‌నుమాన్‌తో పాటు ప‌లు సినిమాలు పాన్ ఇండియ‌న్ స్థాయిలో వంద‌ల కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టాయి. పౌరాణిక క‌థ‌తో టాలీవుడ్ హీరో సుధీర్ బాబు ఓ సినిమా చేయ‌బోతున్నాడు. భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియ‌న్ మూవీగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు బాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ ప్రేర‌ణ అరోరా ప్ర‌జెంట‌ర్‌గా వ్య‌వ‌హ‌రింబోతున్నది.

అక్ష‌య్ కుమార్‌తో...

హిందీలో అక్ష‌య్ కుమార్‌తో టాయ్‌లెట్‌ ఏక్ ప్రేమ్ క‌థ‌, ప్యాడ్ మ్యాన్ తో పాటు రుస్తుం, ప‌రి వంటి సినిమాల‌ను ప్రొడ్యూస్ చేసింది ప్రేర‌ణ అరోరా. కాగా సుధీర్ బాబు, ప్రేర‌ణ అరోరా మూవీతో వెంక‌ట్ క‌ళ్యాణ్ ద‌ర్శ‌కుడిగా ఎంట్రీ ఇస్తోన్నాడు. సూప‌ర్ నాచుర‌ల్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ క‌థ‌తో తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో సుధీర్ బాబుకు జోడీగా ఓ బాలీవుడ్ హీరోయిన్ న‌టించ‌నున్న‌ది. ఆమె ఎవ‌ర‌న్న‌ది త్వ‌ర‌లోనే రివీల్ చేసేందుకు మేక‌ర్స్ స‌న్న‌హాలు చేస్తోన్నారు. సుధీర్ బాబు కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్ మూవీగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను ఆగ‌స్ట్ 15న రిలీజ్ చేయ‌బోతున్నారు. వ‌చ్చే ఏడాది శివ‌రాత్రికి ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తోన్నారు.

మంచికి చెడుకు మ‌ధ్య యుద్ధం...

భార‌తీయ పురాణాల నేప‌థ్యంలో మంచికి, చెడు మ‌ధ్య‌ జ‌రిగే యుద్ధంగా ఈ మూవీ ఉండ‌నుంద‌ని మేక‌ర్స్ పేర్కొన్నారు. ఇండియ‌న్ సినిమాల్లో ఓ మైల్ స్టోన్ మూవీలా బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా రూపొందించ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. లార్జ‌ర్ దేన్ లైఫ్ స్టోరీ లైన్‌తో ఇంత‌కు ముందెన్న‌డూ చూడ‌ని గ్రాఫిక్స్‌, విజువ‌ల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాలో ఉంటాయ‌ని, యాక్ష‌న్ స‌న్నివేశాలు అబ్బుర‌ప‌రుస్తాయ‌ని అన్నారు.

ఏడాదిగా ట్రావెల్‌...

ఈ సినిమా గురించి సుధీర్ బాబు మాట్లాడుతూ ‘‘వెంక‌ట్ క‌ళ్యాణ్‌ స్క్రిప్ట్ న‌చ్చి ఏడాది పాటు టీమ్‌తో ట్రావెల్ అవుతున్నాను. డిఫ‌రెంట్ కంటెంట్‌తో సినిమా రూపొంద‌నుంది. వ‌ర‌ల్డ్ క్లాస్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ప్రేక్ష‌కుల‌కు అందిస్తుంద‌నే న‌మ్మ‌క‌ముంది’’ అన్నారు. ప్రేర‌ణ అరోరా, శివిన్ నార‌గ్‌, నిఖిల్ నంద‌, ఉజ్వ‌ల్ ఆనంద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

హ‌రోంహ‌ర‌...

సుధీర్ బాబు హీరోగా న‌టించిన హ‌రోంహ‌ర మూవీ జూన్ 14న ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. గ్యాంగ్‌స్ట‌ర్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీలో ఔట్ అండ్ ఔట్ యాక్ష‌న్ రోల్‌లో సుధీర్ బాబు క‌నిపించాడు. హ‌రోంహ‌ర సినిమాలో మాళ‌వికా శ‌ర్మ హీరోయిన్‌గా న‌టించింది. హ‌రోంహ‌ర త‌ర్వాత మా నాన్న సూప‌ర్ హీరో పేరుతో ఓ మూవీ చేయ‌బోతున్నాడు సుధీర్ బాబు. త్వ‌ర‌లోనే ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

WhatsApp channel