Harom Hara OTT: ఓటీటీలోకి సుధీర్ బాబు యాక్ష‌న్ మూవీ హ‌రోంహ‌ర - స్ట్రీమింగ్ ఎందులో..ఎప్పుడంటే?-sudheer babu gangster action movies harom hara to stream on amazon prime video and aha ott telugu ott update ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Harom Hara Ott: ఓటీటీలోకి సుధీర్ బాబు యాక్ష‌న్ మూవీ హ‌రోంహ‌ర - స్ట్రీమింగ్ ఎందులో..ఎప్పుడంటే?

Harom Hara OTT: ఓటీటీలోకి సుధీర్ బాబు యాక్ష‌న్ మూవీ హ‌రోంహ‌ర - స్ట్రీమింగ్ ఎందులో..ఎప్పుడంటే?

Nelki Naresh Kumar HT Telugu
Jul 01, 2024 11:28 AM IST

Harom Hara OTT: సుధీర్ బాబు హ‌రోంహ‌ర మూవీ త్వ‌ర‌లోనే ఓటీటీలోకి రాబోతున్న‌ట్లు స‌మాచారం. ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ కానున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

సుధీర్ బాబు హ‌రోంహ‌ర ఓటీటీ
సుధీర్ బాబు హ‌రోంహ‌ర ఓటీటీ

Harom Hara OTT: గ‌త కొన్నాళ్లుగా పాత్ర‌లు, క‌థ‌ల ప‌రంగా ప్ర‌యోగాల‌కు ప్రాధాన్య‌త‌నిస్తోన్నాడు టాలీవుడ్ హీరో సుధీర్‌బాబు. హంట్‌లో గే పోలీస్ ఆఫీస‌ర్‌గా, మామ మ‌శ్చీంద్ర‌లో ట్రిపుల్ రోల్‌లో సుధీర్‌బాబు క‌నిపించాడు. ఈ ప్ర‌యోగాలు సుధీర్‌బాబుకు విజ‌యాల్ని తెచ్చిపెట్ట‌లేక‌పోయినా న‌టుడిగా మాత్రం మెప్పించాడు సుధీర్‌బాబు.

ఇటీవ‌లే హ‌రోంహ‌ర‌మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు సుధీర్‌బాబు. ఔట్ అండ్ ఔట్ యాక్ష‌న్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీ జూన్ 14న థియేట‌ర్ల‌లో రిలీజైంది. కుప్పం ప్రాంత నేప‌థ్యంలో 1980 పీరియాడిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమాకు జ్ఞాన‌సాగ‌ర్ ద్వార‌క ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

ప్ర‌మోష‌న్స్‌లో మ‌హేష్‌బాబు...

హ‌రోంహ‌ర టీజ‌ర్స్‌, ట్రైలర్స్ కొత్త‌గా ఉండ‌టం, ప్ర‌మోష‌న్స్‌లో మ‌హేష్‌బాబు పాల్గొన‌డంతో హ‌రోంహ‌రపై తెలుగు ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి ఏర్ప‌డింది. ప్ర‌మోష‌న్స్ కార‌ణంగా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జ‌రిగింది. రాత‌లో ఉన్న కొత్త‌ద‌నం తీత‌లో లేక‌పోవ‌డంతో హ‌రోంహ‌రం బాక్సాఫీస్ వ‌ద్ద యావ‌రేజ్‌గా నిలిచింది.

ఓటీటీలోకి...

హ‌రోంహ‌ర మూవీ త్వ‌ర‌లోనే ఓటీటీలోకి రాబోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. జూలై 12 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు స‌మాచారం. త్వ‌ర‌లోనే హ‌రోంహ‌ర ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానున్న‌ట్లు స‌మాచారం. అమెజాన్ ప్రైమ్ తో పాటు ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు స‌మాచారం. రెండు ఓటీటీ సంస్థ‌ల‌తో మేక‌ర్స్ డీల్ కుదుర్చుకున్న‌ట్లు చెబుతోన్నారు.

హ‌రోం హ‌ర క‌థ ఇదే...

సుబ్ర‌హ్మ‌ణం (సుధీర్ బాబు) కుప్పం పాలిటెక్నిక్ కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్‌గా కొత్త‌గా ఉద్యోగంలో చేరుతాడు. కుప్పం ప్రాంతాన్ని త‌మ్మిరెడ్డి (ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్‌), అత‌డి త‌మ్ముడు బ‌స‌వారెడ్డి (ర‌వి కాలె) ఏలుతుంటారు. అనుకోకుండా త‌మ్మిరెడ్డి మ‌నుషుల‌తో జ‌రిగిన గొడ‌వ కార‌ణంగా సుబ్ర‌హ్మ‌ణ్యం ఉద్యోగం పోతుంది.

డ‌బ్బు కోసం గ‌న్ స్మ‌గ్లింగ్ బిజినెస్‌లోకి సుబ్ర‌హ్మ‌ణం అడుగుపెడ‌తాడు. సామాన్యుడిగా ఉన్న సుబ్ర‌హ్మ‌ణ్యం కుప్పం ఏరియాలో తిరుగులేని గ్యాంగ్‌స్ట‌ర్‌గా ఎలా ఎదిగాడు? త‌మ్మిరెడ్డి, బ‌స‌వ‌రెడ్డిల‌ను ఎదురించి కుప్పం ప్ర‌జ‌ల‌ను సుబ్ర‌హ్మ‌ణ్యం ఎలా కాపాడాడు అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

మాళ‌వికా శ‌ర్మ హీరోయిన్‌...

హ‌రోంహ‌ర సినిమాలో మాళ‌వికా శ‌ర్మ హీరోయిన్‌గా న‌టించింది. సునీల్‌, అక్ష‌రా గౌడ ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషించారు. కేజీఎఫ్‌, విక్ర‌మ్, పుష్ప సినిమాల నుంచి స్ఫూర్తి పొంది ద‌ర్శ‌కుడు ఈ మూవీని తెర‌కెక్కించారు. ఆ సినిమాల ఛాయ‌ల‌తోనే సాగ‌డంతో హ‌రోంహ‌రం ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయింది.సుధీర్‌బాబు కెరీర్‌లో మ‌రో ఫెయిల్యూర్‌గా నిలిచింది.

మా నాన్న సూప‌ర్ హీరో…

ప్ర‌స్తుతం సుధీర్ బాబు మా నాన్న సూప‌ర్ హీరో పేరుతో ఓ మూవీ చేస్తోన్నాడు. ఫాద‌ర్ సెంటిమెంట్‌తో ఈ మూవీ తెర‌కెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ పూర్త‌యింది. ఈ సినిమాకు అభిలాష్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. గ‌తంలో తెలుగులో అభిలాష్ రెడ్డి లూజ‌ర్ అనే వెబ్ సిరీస్‌ను తెర‌కెక్కించాడు. త్వ‌ర‌లో ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయ‌బోతున్నారు. మా నాన్న సూప‌ర్ హీరోతో పాటు తెలుగులో మ‌రో రెండు సినిమాల‌కు సుధీర్ బాబు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం.సుధీర్ బాబు హ‌రోంహ‌ర మూవీ త్వ‌ర‌లోనే ఓటీటీలోకి రాబోతున్న‌ట్లు స‌మాచారం. ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ కానున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

.

WhatsApp channel