OTT Movies: ఓటీటీలో మూవీ ఫెస్టివల్.. ఏకంగా 24 సినిమాలు స్ట్రీమింగ్.. 2 మాత్రమే స్పెషల్.. ఇక్కడ చూసేయండి?
OTT Releases This Week: ఈ వారం ఓటీటీలోకి సినిమాలు వెబ్ సిరీసులు అన్ని కలిపి ఏకంగా 24 డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీగా ఉన్నాయి. వీటిలో సూపర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలతో పాటు విభిన్న జోనర్ల వెబ్ సిరీసులు ఉన్నాయి. మరి ఈ సినిమాలు, వెబ్ సిరీసుల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో తెలుసుకుందాం.
This Week OTT Movies: ప్రస్తుతం థియేటర్లలలో ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ సినిమా అదరగొడుతోంది. కలెక్షన్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. దాంతో థియేటర్లలో కొత్త సినిమాలు వచ్చే అవకాశం దాదాపుగా లేనట్లే తెలుస్తోంది. కానీ, ఓటీటీలో మాత్రం అందరూ మెచ్చే కంటెంట్ రానుంది.
తెలుగులో హిందీ వెబ్ సిరీస్
ఈ వారం ఓటీటీలో సినీ పండుగ జరగనుంది. ఈ వారం అంటే జూలై 1 నుంచి 7 వరకు సినిమాలు, వెబ్ సిరీసులు అన్ని కలిపి మొత్తంగా 24 ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. కానీ, వీటిలో ఎక్కువగా వెబ్ సిరీసులు ఉండటం విశేషం. అలాగే ఒక్క తెలుగు సినిమా లేకపోవడం నిరాశపడాల్సిన అంశం.
కానీ, పాపులర్ హిందీ వెబ్ సిరీస్ మాత్రం తెలుగులో కూడా రానుంది. అయితే, వీకెండ్ ముగిసేలోపు తెలుగు సినిమాలు ఏవైనా సడెన్ ఎంట్రీ ఇచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి, ఇప్పటివరకు అయితే ఈ వారం ఓటీటీలోకి రానున్న సినిమాలు, వెబ్ సిరీసులను చూస్తే..
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
బాబ్ మార్లీ: వన్ లవ్ (ఇంగ్లీష్ చిత్రం)- జూలై 3
గరుడన్ (తమిళ మూవీ)- జూలై 3
స్పేస్ క్యాడెట్ (ఇంగ్లీష్ సినిమా)- జూలై 4
మీర్జాపూర్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ హిందీ వెబ్ సిరీస్)- జూలై 5
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
స్టార్ ట్రెక్ ప్రొడిగీ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూలై 1
అల్విన్ సీజన్ 5 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూలై 1
స్ప్రింట్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూలై 2
బేవర్లీ హిల్స్ కాప్: అలెక్సా ఎఫ్ (ఇంగ్లీష్ చిత్రం)- జూలై 2
ది మ్యాన్ విత్ 1000 కిడ్స్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూలై 3
బార్బెక్యూ షో డౌన్ సీజన్ 3 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూలై 4
రైమ్ ప్లస్ ఫ్లో ఫ్రాన్స్ సీజన్ 3 (ఫ్రెంచ్ వెబ్ సిరీస్)- జూలై 4
డెస్పరేట్ లైస్ (పోర్చుగీస్ వెబ్ సిరీస్)- జూలై 5
గోయో (స్పానిష్ చిత్రం)- జూలై 5
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ
రెడ్ స్వాన్ (కొరియన్ వెబ్ సిరీస్)- జూలై 3
ల్యాండ్ ఆఫ్ తనబతా (జపనీస్ వెబ్ సిరీస్)- జూలై 4
జియో సినిమా ఓటీటీ
ప్రైమ్ టైమ్ విత్ మూర్తీస్ (హిందీ వెబ్ సిరీస్)- జూలై 3
హీ వెంట్ దట్ వే (ఇంగ్లీష్ సినిమా)- జూలై 5
బుక్ మై షో ఓటీటీ
ఇఫ్ (ఇంగ్లీష్ మూవీ)- జూలై 3
ఫ్యూరోసియా ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా (ఇంగ్లీష్ చిత్రం)- జూలై 4
ది సీడింగ్ (ఇంగ్లీష్ సినిమా)- జూలై 5
విజన్స్ (ఫ్రెంచ్ మూవీ)- జూలై 5
హరా (తమిళ సినిమా)- ఆహా తమిళ్ ఓటీటీ- జూలై 5
మలయాళీ ఫ్రమ్ ఇండియా (మలయాళ సినిమా)- సోనీ లివ్ ఓటీటీ- జూలై 5
మందాకిని (మలయాళ మూవీ)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- జూలై 5
2 మాత్రమే స్పెషల్
ఇలా ఈ వారం సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి 24కు డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీగా ఉన్నాయి. వీటిలో ఇండియన్ ఓటీటీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న మీర్జాపూర్ సీజన్ 3 వెబ్ సిరీస్ ఉంది. అమెజాన్ ప్రైమ్‌లో జూలై 5 నుంచి తెలుగులో కూడా మీర్జాపూర్ స్ట్రీమింగ్ కానుంది. దీంతో పాటు తమిళ సినిమా గరుడన్ కాస్తా ఇంట్రెస్టింగ్ కానుంది. ఇలా 24లో 2 మాత్రమే స్పెషల్ కానున్నాయి.
టాపిక్