Salaar: కేజీఎఫ్‌లో ‘బన్ సీన్’ ఎవరూ మర్చిపోలేరు, అలాంటివి ‘సలార్’లో ఎన్నో ఉన్నాయంటున్న ప్రశాంత్ నీల్
Salaar: సలార్ పార్ట్ 1 సినిమాలో మరో రెండు రోజుల్లో విడుదల కానుంది. ఈ సినిమా గురించి ప్రశాంత్ నీల్ కొన్ని విషయాలు మీడియాతో పంచుకున్నారు.
Salaar: ప్రశాంత్ నీల్ పేరు చెప్పగానే గుర్తొచ్చే సినిమా ‘KGF’. ఆ సినిమా చరిత్రను తిరగరాయాలన్న లక్ష్యంతో వస్తోంది సలార్. మరో రెండు రోజుల్లో విడుదల కానుంది. పాన్ ఇండియా స్థాయి సినిమా అయినా పెద్దగా ప్రమోషన్ కూడా చేయడం లేదు. అయినా అభిమానులు ఆ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆ సినిమా డైరెక్టర్ మీడియాతో మాట్లాడుతూ సలార్ సినిమా గురించి చెప్పారు. ప్రేక్షకులు యాక్షన్ సన్నివేశాల కన్నా, ఎమోషనల్‌గా అనిపించే చిన్న చిన్న సీన్లకు కనెక్ట్ అవుతారని అన్నారు. ఉదాహరణకు కేజీఎఫ్‌లో బన్ సీన్ ఎంత హిట్టో ఆయన గుర్తు చేశారు. బిడ్డతో పాటూ నడుచుకుంటూ వస్తున్న ఓ పేద తల్లికి రొట్టె ఇచ్చేందుకు హీరో తన కారును ఆపే తీరు అందరికీ నచ్చిందని ఆయన గుర్తు చేశారు. అలాంటి సీన్లు సలార్ లో ఉండేలా చూసుకున్నానని ఆయన చెప్పారు.
సలార్ ట్రైలర్
సలార్ ట్రైలర్ చూస్తే యాక్షన్ సన్నివేశాలు ఎంతగా నిండిపోయే అర్థమవుతుంది. కేజీఎఫ్ కి పనిచేసిన స్టంట్ మాస్టర్సే సలార్‌కి పనిచేశారు. ఇందులో భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించారు. గోదావర ఖని, హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఈ యాక్షన్ సన్నివేశాలను తీశారు. అలాగే హాలీవుడ్ స్టంట్ మాస్టర్‌ని కూడా ఈ సినిమా కోసం తీసుకొచ్చారు. సలార్ లో యాక్షన్ సన్నివేశాలు మరో స్థాయిలో ఉంటాయని ట్రైలర్ చూస్తే తెలిసిపోతో్ంది.
కేజీఎఫ్ లో తరహాలోనే సలార్ సినిమాను డార్క్ మోడ్ లోనే తీశారు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ బాక్సాఫీసును బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సలార్ కూడా అలా సైలెంట్ గా వచ్చి వైలెంట్ హిట్ కొట్టాలని ప్రశాంత్ నీల్ కోరుకుంటున్నారు. ఈయన సినిమాలు డార్క్ మోడ్ లో ఉంటాయి. చూడగానే ఒక గంభీరమైన, ఆసక్తికరమైన ఫీలింగ్ ను కలిగిస్తాయి. ఎక్కువగా హాలీవుడ్ లో కనిపించే ఈ గ్రే, డార్క్ మోడ్‌ని మన దేశంలో ఎక్కువగా వాడిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అది కూడా సినిమాకు ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. ఈయనకు ఎక్కువగా రంగులు వాడడం ఇష్టం ఉండదు. ఆయన షర్టులు కూడా ఇలా డార్క్, గ్రే రంగుల్లోనే ఉంటాయి. అందుకే ఆయన సినిమాలు కూడా అలాగే ఉంటాయి.
సలార్ సినిమాను రెండు పార్టులుగా తెరకెక్కించారు. ఇందులో పార్ట్ 1 డిసెంబర్ 22న రాబోతోంది. ఇద్దరు ప్రాణ స్నేహితులుగా ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ నటించారు. ఆ స్నేహితులే శత్రువులుగా మారితే అన్నదే కథ. ఈ సినిమాను తెలుగుతో పాటూ కన్నడ, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో శృతి హాసన్, ప్రమోద్, టిను ఆనంద్, జగపతి బాబు, ఈశ్వరీ రావు, శ్రేయారెడ్డి, గరుడ రామ్, నవీన్ శంకర్ తదితరులు నటించారు.