Bigg Boss Sivaji: సినిమాల్లోకి బిగ్‌బాస్ శివాజీ రీఎంట్రీ - విష్ణు అవ‌తారాల‌తో పాన్ ఇండియ‌న్ మూవీ-bigg boss sivaji re entry into tollywood with kurma nayaki movie shivaji telugu cinema upadte tollywood ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Sivaji: సినిమాల్లోకి బిగ్‌బాస్ శివాజీ రీఎంట్రీ - విష్ణు అవ‌తారాల‌తో పాన్ ఇండియ‌న్ మూవీ

Bigg Boss Sivaji: సినిమాల్లోకి బిగ్‌బాస్ శివాజీ రీఎంట్రీ - విష్ణు అవ‌తారాల‌తో పాన్ ఇండియ‌న్ మూవీ

Nelki Naresh Kumar HT Telugu
Jun 30, 2024 06:53 AM IST

Bigg Boss Sivaji: దాదాపు ఏడెనిమిదేళ్ల గ్యాప్ త‌ర్వాత టాలీవుడ్‌లోకి బిగ్‌బాస్ ఫేమ్ శివాజీ రీఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. కూర్మ‌నాయ‌కి మూవీలో ఓ కీల‌క పాత్ర చేస్తోన్నాడు. ఈ సోషియో ఫాంట‌సీ మూవీలో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

బిగ్‌బాస్ ఫేమ్ శివాజీ
బిగ్‌బాస్ ఫేమ్ శివాజీ

Bigg Boss Sivaji: బిగ్‌బాస్ ఫేమ్‌ శివాజీ దాదాపు ఏడెనిమిదేళ్ల లాంగ్ గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ టాలీవుడ్ సిల్వ‌ర్ స్క్రీన్‌పై క‌నిపించ‌బోతున్నాడు. సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోన్నాడు. చాలా కాలంగా టాలీవుడ్‌కు దూరంగా ఉంటోన్న శివాజీ బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 7తో మ‌ళ్లీ లైమ్‌లైట్‌లోకి వ‌చ్చాడు. ఈ షోలో ఫైన‌ల్ చేరుకున్న శివాజీ థ‌ర్డ్ ర‌న్న‌ర‌ప్‌గా బిగ్‌బాస్ హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. బిగ్‌బాస్ త‌ర్వాత నైంటీస్ ఏ మిడిల్ క్లాస్ బ‌యోపిక్ పేరుతో తెలుగులో ఓ వెబ్‌సిరీస్ చేశాడు శివాజీ. రియ‌లిస్టిక్ ఎమోష‌న్స్‌, ఫ‌న్‌తో తెర‌కెక్కిన ఈ సిరీస్‌లో మిడిల్ క్లాస్ ఫాద‌ర్‌గా చ‌క్క‌టి న‌ట‌న‌ను క‌న‌బ‌రిచాడు శివాజీ.

కూర్మ‌నాయ‌కి మూవీ...

తాజాగా శివాజీ ఓ పాన్ ఇండియ‌న్ సోషియో ఫాంట‌సీ మూవీకి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చాడు. వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌, సాయికుమార్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెలుగులో కూర్మ‌నాయ‌కి పేరుతో ఓ భారీ బ‌డ్జెట్ మూవీ తెర‌కెక్కుతోంది. మహావిష్ణు అవతారాల్లోని కూర్మావతారం నేపథ్యంలో దర్శకుడు హర్షవర్థన్ కడియాల ఈ సినిమాను తెర‌కెక్కిస్తోన్నాడు.

ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌...

కూర్మ‌నాయ‌కి మూవీలో శివాజీ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. శ‌నివారం శివాజీ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా అత‌డి ఫ‌స్ట్‌లుక్‌తో పాటు ఓ స్పెష‌ల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో పీరియాడిక‌ల్ త‌ర‌హా లుక్‌లో శివాజీ క‌నిపించాడు. పాత కాలం నాటి కారులో నుంచి దిగిన అత‌డికి ఓ గుడిలోని పూజారులు స్వాగ‌తం ప‌లికిన‌ట్లుగా ఈ వీడియోలో చూపించారు. కూర్మ‌నాయ‌కి మూవీలో శివాజీ రోల్ ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంటుంద‌ని చిత్ర యూనిట్ చెబుతోంది.ఈ మూవీలో శివాజీ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

స్టార్ హీరో కూడా....

వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌, శివాజీతో పాటు కూర్మ‌నాయ‌కి మూవీలో ఓ స్టార్ హీరో కూడా న‌టించ‌నున్న‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు. అత‌డు ఎవ‌ర‌న్న‌ది త్వ‌ర‌లోనే రివీల్ చేస్తామ‌ని తెలిపారు. ఈ మూవీలో అతిరారాజ్, వీటీవీ గణేష్ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. స‌ప్త‌గిరి, గెట‌ప్ శ్రీను, తాగుబోతు ర‌మేష్, మ‌హేష్ విట్టా క‌మెడియ‌న్లుగా క‌నిపించ‌బోతున్నారు. ఈ సినిమాను కె విజితా రావ్ నిర్మిస్తున్నారు. ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటిదాకా రానటువంటి కథా కథనాలతో కూర్మ‌నాయ‌కి సినిమా ఉంటుంద‌ని యూనిట్ చెబుతోంది.

థ‌ర్డ్ షెడ్యూల్‌...

హై క్వాలిటీ గ్రాఫిక్స్‌, వీఎఫ్ఎక్స్ తో పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో ఈ మూవీని రూపొందిస్తోన్న‌ట్లు ద‌ర్శ‌కుడు తెలిపాడు. . ప్రస్తుతం కూర్మ‌నాయ‌కి రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్త‌యింది. థర్డ్ షెడ్యూల్ లో శివాజీ జాయిన్ అయ్యారు.

మాస్ట‌ర్‌తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ...

చిరంజీవి మాస్ట‌ర్ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు శివాజీ. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌, హీరో ఫ్రెండ్‌గా కెరీర్ ఆరంభంలో ప‌లు సినిమాల్లో క‌నిపించాడు. ప్రేమంటే ఇదేరా, యువ‌రాజు, ప్రియ‌మైన నీకు, ఖుషితో పాటు ప‌లు సినిమాలు చేశాడు. ఆ త‌ర్వాత హీరోగా ప్ర‌మోష‌న్ పొందిన శివాజీ మిస్స‌మ్మ‌, అమ్మాయి బాగుంది, మంత్ర‌తో పాలు ప‌లు విజ‌యాల‌ను అందుకున్నాడు. ప‌రాజ‌యాల కార‌ణంగా 2016 నుంచి సినిమాల‌కు దూరంగా ఉంటున్నాడు.

WhatsApp channel