Bigg Boss Telugu 8: బిగ్‌బాస్ 8లోకి శివాజీ ఎంట్రీ ? - అయితే కంటెస్టెంట్‌గా కాదు...ఈ సారి కొత్త అవ‌తారం!-bigg boss telugu 8 shivaji will hosts bigg boss buzz talk show for season 8 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Telugu 8: బిగ్‌బాస్ 8లోకి శివాజీ ఎంట్రీ ? - అయితే కంటెస్టెంట్‌గా కాదు...ఈ సారి కొత్త అవ‌తారం!

Bigg Boss Telugu 8: బిగ్‌బాస్ 8లోకి శివాజీ ఎంట్రీ ? - అయితే కంటెస్టెంట్‌గా కాదు...ఈ సారి కొత్త అవ‌తారం!

Nelki Naresh Kumar HT Telugu
Jun 16, 2024 04:18 PM IST

Bigg Boss Telugu 8: బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 7లో థ‌ర్డ్ ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన శివాజీ బిగ్‌బాస్ 8లోనూ పాల్గొన‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే కంటెస్టెంట్‌గా కాదు. హోస్ట్‌గా...బిగ్‌బాస్ బ‌జ్ టాక్ షోకు శివాజీ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

బిగ్‌బాస్ 8
బిగ్‌బాస్ 8

Bigg Boss Telugu 8: బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 7 లో ఊహించ‌ని కంటెస్టెంట్‌గా బ‌రిలో దిగాడు సీనియ‌ర్ హీరో శివాజీ. సినిమాల‌కు దూర‌మై చాలా కాల‌మైన శివాజీ మ‌ళ్లీ బిగ్‌బాస్‌తోనే రీఎంట్రీ ఇచ్చాడు. ఈ షోలో శివాజీ రెండు, మూడు వారాలు ఉంటే ఎక్కువేన‌ని అనుకున్నారు. కానీ బిగ్‌బాస్ ఫ్యాన్స్ అంచ‌నాల‌ను త‌ల‌క్రిందులు చేస్తూ ఏకంగా ఫైన‌ల్‌కు చేరుకున్నాడు.

థ‌ర్డ్ ర‌న్న‌ర‌ప్‌గా బిగ్‌బాస్ షో నుంచి ఎలిమినేట్ అయ్యాడు. సీజ‌న్ 7 టైటిల్‌ను రైతుబిడ్డ ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ గెల‌వ‌డంలో శివాజీ కీల‌కంగా నిలిచారు. ప్ర‌తి టాస్క్‌, గేమ్‌ల‌లో ప‌ల్ల‌వి ప్ర‌శాంత్‌ను ఎంక‌రేజ్ చేస్తూ వ‌చ్చాడు శివాజీ. శివాజీ టైటిల్ గెల‌వ‌లేక‌పోయినా ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ అభిమానుల మ‌న‌సులు మాత్రం గెలుచుకున్నాడు.

బిగ్‌బాస్ 8లో కూడా...

తాజాగా బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 8లో శివాజీ పాల్గొన‌బోతున్న‌ట్లు స‌మాచారం. అయితే కంటెస్టెంట్‌గా కాదు హోస్ట్‌గా. బిగ్‌బాస్ బ‌జ్ పేరుతో స్టార్ మా ఓ టాక్‌షోను టెలికాస్ట్ చేస్తోంది. ఈ టాక్ షో ప్ర‌తి సీజ‌న్‌కు బిగ్‌బాస్ ద్వారా పాపుల‌ర్ అయిన మాజీ కంటెస్టెంట్‌ల‌లో ఎవ‌రూ ఒక‌రు హోస్ట్‌లుగా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌స్తోన్నారు. గ‌త సీజ‌న్‌లో గీతూ రాయ‌ల్ బిగ్‌బాస్ బ‌జ్ షోకు హోస్ట్‌గా క‌నిపించింది. బిగ్‌బాస్ షో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన కంటెస్టెంట్స్ ను ఈ టాక్ షోలో హోస్ట్‌లు ఇంట‌ర్వ్యూ చేస్తుంటారు.

కంటెస్టెంట్స్ ఇంట‌ర్వ్యూలు...

కంటెస్టెంట్స్‌ ఆట‌తీరుతో పాటు వారు షో నుంచి బ‌య‌ట‌కు రావ‌డానికి గ‌ల కార‌ణాలు ఈ టాక్ షోలో హోస్టులు విశ్లేషించ‌డ‌మే కాకుండా వారి నుంచి స‌మాధానాల‌ను రాబ‌డుతుంటారు. అంతే కాకుండా బిగ్‌బాస్ హౌజ్‌లో ఇత‌ర కంటెస్టెంట్స్‌తో ఉన్న సంబంధాల గురించి ఈ టాక్ షో బ‌య‌ట‌పెడుతోంటారు.

హోస్ట్‌గా శివాజీ...

కాగా ఈ సీజ‌న్‌లో బిగ్‌బాస్ బ‌జ్ టాక్ షోకు శివాజీ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ టాక్ షో కోసం శివాజీతో బిగ్‌బాస్ ప్ర‌తినిధులు సంప్ర‌దింపులు జ‌రుపుతోన్న‌ట్లు తెలిసింది. ఈ టాక్ షోకు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌డానికి శివాజీ అంగీక‌రించిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

బిగ్‌బాస్ సీజ‌న్ 7 హ‌య్యెస్ట్ టీఆర్‌పీ రేటింగ్‌ను సొంతం చేసుకొని పెద్ద స‌క్సెస్‌గా నిలిచింది. ఈ నేప‌థ్యంలో బిగ్‌బాస్ 8ను తొంద‌ర‌లోనే ప్రారంభించేందుకు స్టార్‌మా స‌న్నాహాలు చేస్తోన్న‌ట్లు స‌మాచారం.

ఈ సీజ‌న్‌లో బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌గా కొంద‌రు టీవీ, సోష‌ల్ మీడియా సెల‌బ్రిటీస్‌ పేర్లు వినిపిస్తోన్నాయి.

కంటెస్టెంట్స్ వీళ్లేనా...

తెలుగు హార‌ర్ మూవీ విరూపాక్ష ద్వారా ఫేమ‌స్ అయిన సోనియా సింగ్ బిగ్‌బాస్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉన్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. యూట్యూబ‌ర్‌ నేత్ర‌తో పాటు ఆమె మాజీ భ‌ర్త వంశీ కూడా బిగ్‌బాస్ 8లోకి కంటెస్టెంట్‌గా అడుగుపెట్ట‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్‌గా బంచిక్ బ‌బ్లూ, రీతూ చౌద‌రి, సురేఖ వాణి కూతురు సుప్రిత‌, యూట్యూబ‌ర్ నిఖిల్ విజ‌యేంద్ర‌సింహా తో పాటు మ‌రికొంద‌రి పేర్లు వినిపిస్తోన్నాయి.

క‌మెడియ‌న్స్ కూడా...

జ‌బ‌ర్ధ‌స్త్ కామెడీ షో నుంచి పొట్టి న‌రేష్, రియాజ్, కిరాక్ ఆర్‌పీ, బుల్లెట్ భాస్క‌ర్‌, చ‌మ్మ‌క్ చంద్ర‌ల‌లో ఒక‌రు లేదా ఇద్ద‌రు బిగ్‌బాస్ షోలో పాల్గొన‌నున్న‌ట్లు స‌మాచారం.. వీరితో పాటు బిగ్‌బాస్ 8 కంటెస్టెంట్స్‌గా బ‌ర్రెల‌క్క‌, కుమారి ఆంటీ, ఖుషిత క‌ల్ల‌పు పాల్గొనే అవ‌కాశం కూడా ఉన్న‌ట్లు స‌మాచారం. అంతే కాకుండా బిగ్‌బాస్ ఓల్డ్ కంటెస్టెంట్స్ నైనీ పావ‌ని, యాంక‌ర్ శివ, స్ర‌వంతి చొక్కార‌పు కూడా హౌజ్‌లోకి రీఎంట్రీ అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. వీరిలో ఎవ‌రు హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌నున్నార‌ని బిగ్‌బాస్ షో ప్రారంభానికి ముందే తేల‌నుంది. ఆగ‌స్ట్ లేదా సెప్టెంబ‌ర్‌లో బిగ్‌బాస్ సీజ‌న్ 8 మొద‌ల‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ సీజ‌న్‌కు కూడా నాగార్జున‌నే హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.

WhatsApp channel