Bigg Boss Shanmukh:ఓటీటీ మూవీతో హీరోగా ఎంట్రీ ఇస్తోన్న బిగ్‌బాస్ ష‌ణ్ముఖ్ - మ‌ల‌యాళ బ్యూటీతో రొమాన్స్‌-bigg boss shanmukh jaswanth web movie leela directly streaming on etv win ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Shanmukh:ఓటీటీ మూవీతో హీరోగా ఎంట్రీ ఇస్తోన్న బిగ్‌బాస్ ష‌ణ్ముఖ్ - మ‌ల‌యాళ బ్యూటీతో రొమాన్స్‌

Bigg Boss Shanmukh:ఓటీటీ మూవీతో హీరోగా ఎంట్రీ ఇస్తోన్న బిగ్‌బాస్ ష‌ణ్ముఖ్ - మ‌ల‌యాళ బ్యూటీతో రొమాన్స్‌

Nelki Naresh Kumar HT Telugu
Jun 12, 2024 10:09 AM IST

Bigg Boss Shanmukh: బిగ్‌బాస్ ఫేమ్ ష‌ణ్ముఖ్ హీరోగా ఎంట్రీ ఇస్తోన్నాడు. అత‌డి డెబ్యూ మూవీ థియ‌ట‌ర్ల‌లో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. ఈ మూవీకి లీలా అనే టైటిల్‌ణు క‌న్ఫామ్ చేసిన‌ట్లు స‌మాచారం.

బిగ్‌బాస్  ష‌ణ్ముఖ్
బిగ్‌బాస్ ష‌ణ్ముఖ్

Bigg Boss Shanmukh: బిగ్‌బాస్ ఫేమ్, యూట్యూబ‌ర్ ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ హీరోగా ఎంట్రీ ఇస్తోన్నాడు. యూత్‌ఫుల్ ల‌వ్‌స్టోరీ మూవీ చేస్తోన్నాడు. హీరోగా ష‌ణ్ముఖ్ ఫ‌స్ట్ మూవీ థియేట‌ర్ల‌లో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది.

టైటిల్ ఇదే...

ష‌ణ్ముఖ్ హీరోగా న‌టిస్తోన్న‌ కొత్త సినిమా ఇటీవ‌ల మొద‌లైంది. ఈ మూవీకి లీలా అనే టైటిల్‌ను క‌న్ఫార్మ్ చేసిన‌ట్లు ఇన్‌డైరెక్ట్‌గా హింట్ ఇచ్చాడు ష‌ణ్ముఖ్‌. ఈ కొత్త మూవీ ఓపెనింగ్ తాలూకు ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానుల‌తో పంచుకున్నాడు. ఈ సినిమాతో మ‌ల‌యాళ బ్యూటీ అన‌ఘా అజిత్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.

ఈటీవీ విన్ ఓటీటీలో...

ష‌ణ్ముఖ్ డెబ్యూ మూవీ థియేట‌ర్ల‌లో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీ ద్వారా తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఈటీవీ విన్ ఓటీటీలో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ విష‌యాన్ని ష‌ణ్ముఖ్ అఫీషియ‌ల్‌గా వెల్ల‌డించాడు. నేను, లీలా అతి త్వ‌ర‌లో మీ ముందుకు రాబోతున్నాం అని ష‌ణ్ముఖ్ పేర్కొన్నాడు.

ఇదొక వెబ్ ఫిల్మ్ అని ప్ర‌క‌టించాడు. ష‌ణ్ముఖ్ కొత్త మూవీ ఓపెనింగ్ ఈవెంట్‌లో డైరెక్ట‌ర్ వివేక్ ఆత్రేయ‌తో పాటు బెక్కెం వేణుగోపాల్‌, ప్ర‌వీణ్ కండ్రేంగుల త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ కొత్త మూవీ ఓపెనింగ్ ఫొటోలు సోష‌ల్ మీడియాలోవైర‌ల్ అవుతోన్నాయి.

బిగ్‌బాస్ తో పాపుల‌ర్‌...

యూట్యూబ‌ర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ బిగ్‌బాస్‌తో పాపుల‌ర్ అయ్యాడు. బిగ్‌బాస్ సీజ‌న్ 5లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న ష‌ణ్ముఖ్ ర‌న్న‌ర‌ప్‌గా నిలిచాడు. త‌న ఆట‌తీరుతోఫైన‌ల్ చేరుకున్నాడు. ష‌ణ్ముఖ్ టైటిల్ గెలుస్తాడ‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ ఫైన‌ల్‌లో ష‌ణ్ముఖ్‌కు వీజే స‌న్నీ షాకిచ్చి టైటిల్‌ను ఎగ‌రేసుకుపోయాడు.

తెలుగు వెబ్ సిరీస్‌లు...

బిగ్‌బాస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ష‌ణ్ముక్ ఏజెంట్ ఆనంద్ సంతోష్‌తో పాటు ది సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్ తో పాటు మ‌రికొన్ని వెబ్‌సిరీస్‌లు చేశాడు. రుక్మిణి, మ‌లుపు, అయ్యోయ్యోతో పాటు ప‌లు ఇండిపెండెంట్ సాంగ్స్‌లో ష‌ణ్ముఖ్ క‌నిపించాడు.

వివాదాల‌తో వార్త‌ల్లో...

టీవీ షోస్‌తో పాటు వివాదాల‌తోనూ త‌ర‌చుగా వార్త‌ల్లో నిలుస్తూ వ‌చ్చాడు ష‌ణ్ముఖ్‌. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో గంజాయి కేసులో ష‌ణ్ముఖ్‌తో పాటు అత‌డి సోద‌రుడు సంప‌త్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్ది రోజుల‌కు జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాడు. గ‌తంలో మ‌ద్యం మ‌త్తులో కారును వేగంగా న‌డిపించి పోలీసుల‌కు దొరికాడు ష‌ణ్ముఖ్‌. దీప్తి సున‌య‌న‌తో ష‌ణ్ముఖ్ ప్రేమ‌లో ఉన్న‌ట్లు గ‌తంలో పుకార్లు షికారు చేశాయి. కానీ బిగ్‌బాస్ సీజ‌న్ 5లో సిరి హ‌నుమంతుతో ష‌ణ్ముఖ్ క్లోజ్‌గా మూవ్ కావ‌డంతో అత‌డి ల‌వ్ స్టోరీకి బ్రేక‌ప్ ప‌డింది.

బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌...

మ‌రోవైపు మ‌ల‌యాళంలో త‌న్నీర్ మాత‌న్ దినంగ‌ల్ అనే సినిమా చేసింది అన‌ఘా అజిత్‌. 2019లో మ‌ల‌యాళంలో రిలీజైన ఈ మూవీ ఆ ఏడాది అత్య‌ధిక వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. ష‌ణ్ముఖ్ మూవీతో టాలీవుడ్‌లో తొలి అడుగు వేయ‌బోతున్న‌ది.

WhatsApp channel