Anasuya: బుల్లితెర‌పైకి అన‌సూయ రీఎంట్రీ - బిగ్‌బాస్ అమ‌ర్‌దీప్‌తో టీవీ షో చేస్తోన్న రంగ‌మ్మ‌త్త‌-anasuya re entry in to small screen with bigg boss amardeep tv show kirak boys khiladi girls star maa ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Anasuya: బుల్లితెర‌పైకి అన‌సూయ రీఎంట్రీ - బిగ్‌బాస్ అమ‌ర్‌దీప్‌తో టీవీ షో చేస్తోన్న రంగ‌మ్మ‌త్త‌

Anasuya: బుల్లితెర‌పైకి అన‌సూయ రీఎంట్రీ - బిగ్‌బాస్ అమ‌ర్‌దీప్‌తో టీవీ షో చేస్తోన్న రంగ‌మ్మ‌త్త‌

Nelki Naresh Kumar HT Telugu
Jun 10, 2024 06:20 AM IST

Anasuya: రెండేళ్ల తర్వాత అనసూయ బుల్లితెరపైకి రీెంట్రీ ఇస్తోంది. కిరాక్ బాయ్స్ ఖిలాడీ గ‌ర్ల్స్ పేరుతో ఓ షో చేయ‌బోతున్న‌ది. టీవీ సెల‌బ్రిటీలు కంటెస్టెంట్స్‌గా పాల్గొన‌నున్న‌ ఈ షో స్టార్ మాలో టెలికాస్ట్ కాబోతోంది.

అనసూయ
అనసూయ

Anasuya: బుల్లితెర‌పై టాప్ యాంక‌ర్స్‌లో ఒక‌రిగా కొన‌సాగింది అన‌సూయ‌. జ‌బ‌ర్ధ‌స్థ్ కామెడీ షోకు దాదాపు తొమ్మిదేళ్ల పాటు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించింది. జ‌బ‌ర్ధ‌స్థ్‌తో పాటు ప‌లు టీవీ షోస్‌తో బుల్లితెర స్టార్‌గా తిరుగులేని ఇమేజ్‌ను సొంతం చేసుకున్న అన‌సూయ సినిమాల కార‌ణంగా రెండేళ్లుగా టీవీల‌కు దూరంగా ఉంటోంది.

2022లో జ‌బ‌ర్ధ‌స్థ్‌కు గుడ్‌బై చెప్పి ఫ్యాన్స్‌ను స‌ర్‌ప్రైజ్ చేసింది. అన‌సూయ స్థానంలో సిరి హ‌నుమంతు జ‌బ‌ర్ధ‌స్థ్‌కు యాంక‌ర్‌గా మేక‌ర్స్ తీసుకున్నారు...

టీవీల్లోకి రీఎంట్రీ....

రంగ‌స్థ‌లం, పుష్ప త‌ర్వాత సినిమాల‌తో బిజీ కావ‌డంతోనే అన‌సూయ టీవీ షోస్‌కు గుడ్‌బై చెప్పిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. తాజాగా రెండేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ బుల్లితెర‌పైకి అనసూయ రీఎంట్రీ ఇస్తోంది. ఓ రియాలిటీ గేమ్ షోకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలిసింది. కిరాక్ బాయ్స్ ఖిలాడీ గ‌ర్ల్స్ పేరుతో స్టార్ మా ఛానెల్‌లో రియాలిటీ షో టెలికాస్ట్ కాబోతోంది.

ఈ షో అనౌన్స్‌మెంట్ వీడియోను స్టార్ మా సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో బిగ్‌బాస్ ర‌న్న‌ర‌ప్ అమ‌ర్‌దీప్ స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచాడు. అమ‌ర్‌దీప్‌తో పాటు విష్ణుప్రియ‌, శోభ‌శెట్టి, దీపిక పిల్లి, రీతూ చౌద‌రి, యాద‌మ‌రాజుతో పాటు ప‌లువురు టీవీ యాంక‌ర్స్‌, యాక్ట‌ర్స్‌ ఇందులో డ్యాన్స్ చేస్తూ క‌నిపించారు.

శేఖ‌ర్ మాస్ట‌ర్‌...అన‌సూయ‌...

ఈ వీడియో చివ‌ర‌లో టాలీవుడ్ కొరియోగ్రాఫ‌ర్ శేఖ‌ర్ మాస్ట‌ర్‌తో పాటు అన‌సూయ ఎంట్రీ ఇచ్చారు. అమ‌ర్ దీప్ అండ్ గ్యాంగ్‌తో క‌లిసి వీరిద్ద‌రు స్టెప్పులేశారు.

టీవీ సెల‌బ్రిటీలు....

కిరాక్ బాయ్స్ ఖిలాడీ గ‌ర్ల్స్ షోలో టీవీ సెల‌బ్రిటీలు అమ్మాయిలుగా, అబ్బాయిలుగా రెండు టీమ్‌లుగా విడిపోయి ఫ‌న్నీ గేమ్స్‌, డ్యాన్స్‌ల‌తో ఫ్యాన్స్‌ను అల‌రించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ షోకు అన‌సూయ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్న‌ట్లు స‌మాచారం.

శేఖ‌ర్ మాస్ట‌ర్ జ‌డ్జ్ గా క‌నిపించ‌బోతున్న‌ట్లు చెబుతోన్నారు. శేఖ‌ర్ మాస్ట‌ర్‌తో పాటు ప్ర‌తివారంఈ షోకు ఓ సెల‌బ్రిటీ గెస్ట్‌గా వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. త్వ‌ర‌లోనే కిరాక్ బాయ్స్‌, ఖిలాడీ గ‌ర్ల్స్‌ షో టెలికాస్ట్ డేట్‌ను స్టార్ మా రివీల్ చేయ‌నుంది. ఈ షో ఎలా ఉండ‌బోతుంద‌న్న‌ది కూడా అప్పుడే తేల‌నుంది.

ఐదు సినిమాలు...

టాలీవుడ్‌లో క్యారెక్ట‌ర్ రోల్స్‌, విల‌న్ పాత్ర‌లు చేస్తూ అన‌సూయ ఫుల్ బిజీగా ఉంది. గ‌త ఏడాది తెలుగులో అన‌సూయ న‌టించిన ఐదు సినిమాలు రిలీజ‌య్యాయి. మైఖేల్‌, రంగ‌మార్తండ‌, విమానం, పెద‌కాపు, ప్రేమ విమానం సినిమాల్లో పాజిటివ్‌, నెగెటివ్ షేడ్స్‌తో కూడిన డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్ చేసింది. ప్ర‌స్తుతం అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న పుష్ప 2లో విల‌న్‌గా క‌నిపించ‌బోతున్న‌ది. సెకం

దాక్ష‌య‌ణిగా ఫ‌స్ట్ పార్ట్‌కు మించి సీక్వెల్‌లో ఆమె విల‌నిజం ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అన‌సూయ లీడ్ ఓల్‌లో న‌టించిన ఆరి మూవీ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. థ్రిల్ల‌ర్ క‌థాంశంతో ఈ మూవీ తెర‌కెక్కింది. ఈ రెండు సినిమాల‌తో పాటు తెలుగులో మ‌రికొన్ని సినిమాల్లో అన‌సూయ న‌టిస్తోంది.

ఫ్లాష్‌బ్యాక్‌తో త‌మిళంలోకి ఎంట్రీ...

తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళ సినిమాల‌పై ఫోక‌స్ పెడుతోంది అన‌సూయ‌. త‌మిళంలో ఫ్లాష్‌బ్యాక్ అనే మూవీని అంగీక‌రించింది. ప్ర‌భుదేవా హీరోగా న‌టించిన ఈ మూవీ షూటింగ్ చాలా రోజుల క్రిత‌మే పూర్త‌యింది. అనివార్య కార‌ణాల వ‌ల్ల రిలీజ్ అల‌స్య‌మ‌వుతోంది. మ‌ల‌యాళంలో మెగాస్టార్‌ మ‌మ్ముట్టి హీరోగా న‌టించిన భీష్మ‌ప‌ర్వంలో అన‌సూయ కీల‌క పాత్ర పోషించింది.

టీ20 వరల్డ్ కప్ 2024