Samantha for RCB: సమంత ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్.. ఆర్సీబీ కోసమేనా అంటూ ఫ్యాన్స్ కామెంట్స్-samantha cryptic post gone viral fans call it is for rcb team ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Samantha For Rcb: సమంత ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్.. ఆర్సీబీ కోసమేనా అంటూ ఫ్యాన్స్ కామెంట్స్

Samantha for RCB: సమంత ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్.. ఆర్సీబీ కోసమేనా అంటూ ఫ్యాన్స్ కామెంట్స్

Hari Prasad S HT Telugu
May 22, 2024 01:59 PM IST

Samantha for RCB: సమంత తన ఇన్‌స్టాగ్రామ్ లో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఫ్యాన్స్ అది చూసి సామ్ ఈ పోస్ట్ చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) టీమ్ కోసమే అని కామెంట్స్ చేస్తున్నారు.

సమంత ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్.. ఆర్సీబీ కోసమేనా అంటూ ఫ్యాన్స్ కామెంట్స్
సమంత ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్.. ఆర్సీబీ కోసమేనా అంటూ ఫ్యాన్స్ కామెంట్స్

Samantha for RCB: సమంత చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సరిగ్గా ఐపీఎల్లో ఎలిమినేటర్ మ్యాచ్ జరగనున్న సమయంలో ఆమె ఈ పోస్ట్ చేయడంతో ఆర్సీబీ కోసమేనా అంటూ కొందరు ఫ్యాన్స్ అడుగుతున్నారు. అయితే దాని వెనుక అర్థం ఇంకేదో ఉందని మరికొందరు కామెంట్స్ చేశారు. మొత్తానికి సామ్ చేసిన ఈ పోస్ట్ పై ఫ్యాన్స్ మధ్య మంచి చర్చే నడుస్తోంది.

సమంత చేసిన పోస్ట్ ఇదే..

బుధవారం (మే 22) ఉదయం సమయం సమంత తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేసింది. అందులో "ఐ వానా సీ యూ విన్" అనే అక్షరాలు ఉన్నాయి. అంటే మీరు గెలిస్తే చూడాలని ఉంది అని. దీనికి ఆమె ఇచ్చిన క్యాప్షన్ కూడా ఇంట్రెస్టింగా ఉంది. "మీ హృదయం ఏం కోరుకుంటున్నా, మీకు ఎలాంటి ఆకాంక్షలు ఉన్నా, మీ వెంట నేనున్నాను. మీరు విజయానికి అర్హులు" అనే క్యాప్షన్ ఉంచింది.

ఇది చూసి కొంత మంది ఫ్యాన్స్ సమంత ఈ పోస్ట్ చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కోసమే అని కామెంట్స్ చేశారు. ఐపీఎల్ 2024లో భాగంగా బుధవారం (మే 22) అహ్మదాబాద్ లో రాజస్థాన్ రాయల్స్ తో ఆర్సీబీ ఎలిమినేటర్ లో తలపడనుంది. ఈరోజే సామ్ కూడా ఈ పోస్ట్ చేయడంతో అందరూ దాని గురించే అని భావిస్తున్నారు.

అయితే మరికొందరు ఫ్యాన్స్ మాత్రం దీని వెనుక అర్థం అది కాదని చెబుతున్నారు. "ఆమె జీవితం గురించి ఈ విషయం చెబుతోంది. కానీ కొందరు ఐపీఎల్ కిడ్స్ మాత్రం తమకు ఇష్టమైన ఫ్రాంఛైజీ గురించి అనుకుంటున్నారు" అని ఓ అభిమాని కామెంట్ చేశారు. అయితే ఈ పోస్ట్ వెనుక అసలు ఆమె ఉద్దేశం ఏంటన్నది మాత్రం తెలియడం లేదు.

ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలోనూ..

సమంత ఇదే పోస్ట్ ను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలోనూ పోస్ట్ చేసింది. దానికంటే ముందు ఉదయాన్నే తాను జిమ్ లో కసరత్తులు చేస్తున్న వీడియోను కూడా షేర్ చేసింది. తన స్టైల్లో చిల్ అవడం అంటే ఇదే అనే క్యాప్షన్ తో ఆ పోస్ట్ చేసింది. ఫిట్‌నెస్ పై బాగా దృష్టిసారించే సమంత.. జిమ్ లో చెమటలు కక్కుతూ.. హైఫ్లైయింగ్ కిక్స్ ప్రాక్టీస్ చేయడం ఆ వీడియోలో చూడొచ్చు.

ఇక సమంత ఏడాది సినిమా బ్రేక్ తర్వాత మళ్లీ షూటింగ్ లతో బిజీ అవుతోంది. ఇప్పటికే సిటడెల్ ఇండియన్ వెర్షన్ షూటింగ్ పూర్తి చేసి డబ్బింగ్ కూడా చెప్పేసింది. సిటడెల్ హనీ బన్నీ అనే ఈ వెబ్ సిరీస్ లో వరుణ్ ధావన్ తో కలిసి ఆమె నటించింది. ఇక తన సొంత ప్రొడక్షన్ కంపెనీ అయిన ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ లో బంగారం అనే మూవీని కూడా సమంత అనౌన్స్ చేసింది. ఇదే కాకుండా అట్లీ, అల్లు అర్జున్ మూవీలోనూ ఆమె నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

టీ20 వరల్డ్ కప్ 2024