Citadel Web Series: సిటడెల్ వెబ్ సిరీస్ పేరు మార్చారు.. సమంత, వరుణ్ ధావన్ సిరీస్ పేరు ఇదే
Citadel Web Series: సమంత, వరుణ్ ధావన్ కలిసి నటించిన సిటడెల్ ఇండియన్ వెర్షన్ వెబ్ సిరీస్ కు కొత్త టైటిల్ పెట్టారు. ఈ విషయాన్ని ప్రైమ్ వీడియో మంగళవారం (మార్చి 19) అనౌన్స్ చేసింది.
Citadel Web Series: అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ ఏడాది తమ ఓటీటీ ప్లాట్‌ఫామ్ పై రిలీజ్ కానున్న కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ ల అనౌన్స్‌మెంట్ మంగళవారం (మార్చి 19) ఓ గ్రాండ్ ఈవెంట్లో చేసింది. ఇందులో భాగంగా సమంత, వరుణ్ ధావన్ కలిసి నటించిన సిటడెల్ సిరీస్ గురించి కూడా వెల్లడించింది. అయితే ఈ వెబ్ సిరీస్ పేరును మాత్రం వాళ్లు మార్చారు.
సిటడెల్ వెబ్ సిరీస్
గతేడాది ఇంగ్లిష్ లో సిటడెల్ పేరుతో ఓ స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ వచ్చిన సంగతి తెలుసు కదా. ప్రియాంకా చోప్రా అందులో నటించింది. ఇప్పుడదే ఇండియన్ వెర్షన్ రాబోతోంది. ఇందులో సమంత, వరుణ్ ధావన్ నటించారు. రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్ కు సిటడెల్ హనీ బన్నీ అనే టైటిల్ పెట్టడం విశేషం. ఇండియన్ వెర్షన్ సిటడెల్ పేరు మార్చినట్లు ప్రైమ్ వీడియో వెల్లడించింది.
మంగళవారం (మార్చి 19) ముంబైలో జరిగిన ఓ గ్రాండ్ ఈవెంట్లో ప్రైమ్ వీడియో ఈ ఏడాది రాబోతున్న తన కొత్త వెబ్ సిరీస్, సినిమాల వివరాలను వెల్లడించింది. సిటడెల్ గురించి ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ.. "సిటడెల్ యూనివర్స్ లో భాగంగా ఇండియన్ సిరీస్ ను గతంలో ప్రైమ్ వీడియో కన్ఫమ్ చేసింది. దీనికి సిటడెల్: హనీ బన్నీ అనే టైటిల్ పెట్టాం. సిటడెల్: హనీ బన్నీ ఓ లవ్ స్టోరీతోపాటు అద్భుతమైన కథనం, ఉత్కంఠకు గురి చేసే ఓ స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఇది 90ల బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సిరీస్. సిటడెల్ యూనివర్స్ లో హనీ బన్నీ ఇండియన్ సిరీస్" అనే క్యాప్షన్ తో సరికొత్త పోస్టర్ రిలీజ్ చేసింది.
ఇందులో హనీ బన్నీ అనే అక్షరాల్లోనే సమంత, వరుణ్ ధావన్ ఫొటోలను చూడొచ్చు. ఈ ఇద్దరూ చేతుల్లో గన్స్ పట్టుకొని కనిపిస్తున్నారు. రాజ్ అండ్ డీకే డైరెక్షన్ కావడంతో ఈ సిరీస్ చాలా ఇంట్రెస్టింగా సాగుతుందని భావిస్తున్నారు. గతంలో ఈ ఇద్దరి డైరెక్షన్ లోనే సమంత ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో నటించింది. అంతకుముందు ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 1, ఫర్జీలాంటి అద్భుతమైన వెబ్ సిరీస్ లను వీళ్లు తెరకెక్కించారు.
ప్రైమ్ వీడియో కొత్త షోలు ఇవే
అమెజాన్ ప్రైమ్ వీడియో మంగళవారం కొన్ని సరికొత్త షోలను అనౌన్స్ చేసింది. ఇందులో తెలుగులో ఇన్‌స్పెక్టర్ రిషి వెబ్ సిరీస్ కూడా ఒకటి. ఇందులో నవీన్ చంద్ర నటించాడు. ఇదొక సూపర్ నేచురల్ హారర్ సిరీస్. మార్చి 29 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇక విజయ్ వర్మ నటిస్తున్న మట్కా కింగ్ అనే మరో కొత్త వెబ్ సిరీస్ ను కూడా ప్రైమ్ వీడియో అనౌన్స్ చేసింది.
ఇక రానా దగ్గుబాటి హోస్ట్ చేస్తున్న ది రానా కనెక్షన్ కూడా ప్రైమ్ వీడియోలో రానుంది. ఇండియన్ సినిమాలోని తన ఫ్రెండ్స్, సహచరులతో రానా ఏర్పాటు చేసే ఈ టాక్ షో కూడా త్వరలో స్ట్రీమింగ్ కానుంది. ఇక రంగీన్, ది గ్రేట్ ఇండియన్ కోడ్, అరేబియా కడలి అనే వెబ్ సిరీస్ లను కూడా అనౌన్స్ చేసింది.