Gem OTT: 2021లో థియేట‌ర్ల‌లో - 2024లో ఓటీటీలో- మూడేళ్ల త‌ర్వాత ఓటీటీలోకి శివాజీరాజా కొడుకు మూవీ-vijay raja raashi singh tollywood movie gem to stream on etv win ott from april 18th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gem Ott: 2021లో థియేట‌ర్ల‌లో - 2024లో ఓటీటీలో- మూడేళ్ల త‌ర్వాత ఓటీటీలోకి శివాజీరాజా కొడుకు మూవీ

Gem OTT: 2021లో థియేట‌ర్ల‌లో - 2024లో ఓటీటీలో- మూడేళ్ల త‌ర్వాత ఓటీటీలోకి శివాజీరాజా కొడుకు మూవీ

Nelki Naresh Kumar HT Telugu
Apr 14, 2024 07:07 PM IST

Gem OTT: టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు శివాజీరాజా త‌న‌యుడు విజ‌య్ రాజా హీరోగా న‌టించిన జెమ్ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైన మూడేళ్ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌స్తోంది. ఈటీవీ విన్ ఓటీటీలో ఈ యాక్ష‌న్ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది.

జెమ్ మూవీ ఓటీటీ
జెమ్ మూవీ ఓటీటీ

Gem OTT: సీనియ‌ర్ న‌టుడు శివాజీరాజా త‌న‌యుడు విజ‌య్ రాజా హీరోగా న‌టించిన జెమ్ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైన మూడేళ్ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. జెమ్ మూవీ 2021లో థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. ల‌వ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాకు సుశీల సుబ్ర‌హ్మ‌ణ్యం ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్...

తాజాగా ఈ మూవీ ఏప్రిల్ 18 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. జెమ్ స్ట్రీమింగ్ డేట్‌ను ఈటీవీ విన్ ఆదివారం వెల్ల‌డించింది. ఈ మూవీ పోస్ట‌ర్‌ను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది.

జెమ్ మూవీ క‌థ ఇదే...

జెమ్ (విజ‌య్ రాజా) ఓ అనాథ‌. ఓ ప్ర‌మాదం నుంచి శ్రీల‌క్ష్మి (రాశీ సింగ్‌) అనే అమ్మాయిని కాపాడుతాడు. శ్రీల‌క్ష్మి (రాశీ సింగ్‌) మంచిత‌నానికి ఫిదా అయినా జెమ్ ఆమెతో ప్రేమ‌లో ప‌డ‌తాడు. కానీ శ్రీల‌క్ష్మిని ఓ రౌడీ పెళ్లిచేసుకోవాల‌నే ప్ర‌య‌త్నంలో ఉంటాడు. ఆ రౌడీ బారి నుంచి త‌న ప్రేయ‌సిని జెమ్ ఎలా కాపాడున్నాడు? జెమ్‌, శ్రీల‌క్ష్మి ప్రేమ‌క‌థ‌లోకి వ‌చ్చిన క‌న‌క‌దుర్గ (న‌క్ష‌త్ర‌) ఎవ‌రు అన్న‌దే ఈ మూవీ క‌థ‌. ముక్కోణ‌పు ప్రేమ‌కథ‌కు యాక్ష‌న్‌, మాస్ అంశాల‌ను జోడించి ద‌ర్శ‌కుడు సుబ్ర‌హ్మ‌ణ్యం ఈ మూవీని తెర‌కెక్కించాడు.

సంపూర్ణేష్ బాబు కీ రోల్‌...

జెమ్ సినిమాలో సంపూర్ణేష్ బాబు ఓ కీల‌క పాత్ర పోషించాడు. ర‌చ్చ‌ర‌వి, అజ‌య్ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో క‌నిపించిన ఈ మూవీకి లైగ‌ర్ ఫేమ్ సునీల్ క‌శ్య‌ప్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాలో న‌క్ష‌త్ర నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్ చేసింది. రెగ్యుల‌ర్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కిన ఈ మూవీ తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించ‌లేక‌పోయింది. డిజాస్ట‌ర్‌గా నిలిచిన ఈ మూవీ మూడేళ్ల త‌ర్వాత ఓటీటీలోకి రావ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఏదైనా జ‌ర‌గొచ్చుతో టాలీవుడ్ ఎంట్రీ...

హీరోగా ఏదైనా జ‌ర‌గొచ్చు మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు విజ‌య్‌రాజా, ఆ త‌ర్వాత జెమ్‌తో పాటు వేయి శుభ‌ములు క‌లుగునీకుతో పాటు మ‌రో సినిమా చేశాడు. అవేవీ క‌థానాయ‌కుడిగా విజ‌య్ రాజాకు విజ‌యాల్ని తెచ్చిపెట్ట‌లేక‌పోయాయి. కొన్నాళ్లుగా సినిమాల‌కు దూరంగ ఉంటున్నాడు.

భూత‌ద్ధం భాస్క‌ర్ నారాయ‌ణలో…

మ‌రోవైపు తెలుగులో స‌క్సెస్‌, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా చిన్న సినిమాల్లో హీరోయిన్‌గా వ‌రుస‌గా అవ‌కాశాల్ని అందుకుంటోంది రాశీసింగ్‌. జెమ్‌తో పాటు శ‌శి, ప్రేమ్‌కుమార్ సినిమాలు చేసింది. రాశీసింగ్ హీరోయిన్‌గా న‌టించిన భూత‌ద్ధం భాస్క‌ర్ నారాయ‌ణ మూవీ ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ సినిమాలో జ‌ర్న‌లిస్ట్‌గా రాశీసింగ్ క‌నిపించింది. రాశీసింగ్ న‌టించిన రీసౌండ్‌తో పాటు మ‌రికొన్ని సినిమాలు షూటింగ్ ద‌శ‌లో ఉన్నాయి..

IPL_Entry_Point

టాపిక్