Kaatera Telugu OTT: కన్నడ బ్లాక్‌బస్టర్ కాటేరా తెలుగు వెర్షన్ ఓటీటీలోకి వచ్చేసింది - స్ట్రీమింగ్ ఎందులో అంటే?
Kaatera Telugu OTT: కన్నడ బ్లాక్‌బస్టర్ మూవీ కాటేరా తెలుగు వెర్షన్ ఓటీటీలో రిలీజైంది. దర్శన్ హీరోగా నటించిన ఈ యాక్షన్ మూవీ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
Kaatera Telugu OTT: కన్నడ స్టార్ దర్శన్ హీరోగా నటించిన కాటేరా మూవీ తెలుగులో రిలీజైంది. థియేటర్లలో కాదు. ఓటీటీ ద్వారా ఈ బ్లాక్‌బస్టర్ మూవీ తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. కాటేరా తెలుగు తో పాటు తమిళ వెర్షన్ జీ5 ఓటీటీలో ఆదివారం నుంచి స్ట్రీమింగ్ అవుతోన్నాయి. ఈ విషయాన్ని జీ5 ఓటీటీ అఫీషియల్‌గా ప్రకటించింది. కన్నడ వెర్షన్ జీ5 ఓటీటీలో ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్‌ను మాత్రం థియేటర్లలో విడుదలైన ఐదు నెలల తర్వాత ఓటీటీలోకి తీసుకొచ్చారు.
మాలాశ్రీ కూతురు...
కాటేరా సినిమాలో ఆరాధన రామ్ హీరోయిన్‌గా నటించింది. సీనియర్ హీరోయిన్ మాలాశ్రీ కూతురు అయిన ఆరాధన రామ్ కాటేరాతోనే సాండల్‌వుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. 1970 బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు తరుణ్ సుధీర్ కాటేరా మూవీని తెరకెక్కించాడు
సలార్‌కు పోటీగా....
ప్రభాస్ సలార్‌కు పోటీగా గత ఏడాది డిసెంబర్‌లో థియేటర్లలో విడుదలైన ఈ కన్నడ మూవీ 70 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. 2023లో కన్నడంలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. కాటేరా సినిమాలో టాలీవుడ్ నటుడు జగపతిబాబు విలన్‌గా నటించాడు. మరో నెగెటివ్ షేడ్ పాత్రలో సీనియర్ హీరో వినోద్ కుమార్ కనిపించాడు. దాదాపు నలభై ఐదు కోట్ల బడ్జెట్‌తో రాక్‌లైన్ వెంకటేష్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేశాడు.
మాస్ రోల్‌లో దర్శన్...
కాటేరా సినిమాలో కథ, కథనాలపై విమర్శలొచ్చాయి. సినిమా నిడివి కూడా మూడు గంటలు ఉండటం మైనస్ అయ్యింది. కానీ దర్శన్ హీరోయిజం, అతడిపై తెరకెక్కించిన యాక్షన్ సీక్వెన్స్‌లు మాత్రం అభిమానులను ఆకట్టుకున్నాయి. ఔట్ అండ్ ఔట్ మాస్ రోల్‌లో కనిపించి అభిమానులను మెప్పించాడు దర్శన్.
కాటేరా కథ ఇదే...
దేవరాయ (జగపతిబాబు) అనే భూస్వామిని చంపిన కేసులో జైలు శిక్షను అనుభవిస్తోన్న కాటేరా (దర్శన్) పెరోల్ మీద బయటకు వస్తాడు. జైలు నుంచి విడుదలైన కాటేరాను చంపేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. వారందరూ ఎవరు? భీమనహల్లి అనే ప్రాంతంలో కమ్మరి (ఇనుప పనిముట్లు)గా పని చేసే కాటేరా ఎందుకు జైలుకు వెళ్లాడు? పెద్దలను ఎదురించి కాటేరాను పెళ్లి చేసుకున్న ప్రభావతి (ఆరాధన రామ్) ఎలా చనిపోయింది?
భీమనహల్లి ప్రాంతంలో చాలా ఏళ్లుగా పంటలను సాగుచేస్తోన్న రైతులకు భూమిపై హక్కును కల్పించేందుకు కాటేరా, ప్రభావతి ఎలాంటి పోరాటం చేశారు? దేవరాయ, కాళీగౌడ (వినోద్‌కుమార్) అనే భూస్వాములతో కాటేరాకు ఎందుకు విరోధం ఏర్పడింది? అన్నదే కాటేరా మూవీ కథ. లవ్ స్టోరీ, కుల వివక్ష, భూసంస్కరణలు, యాక్షన్...పలు అంశాలతో మల్టీజోనర్ మూవీగా కాటేరాను తెరకెక్కించాడు డైరెక్టర్ తరుణ్ సుధీర్.
కేజీఎఫ్‌కు పోటీగా...
కేజీఎఫ్‌కు పోటీగా కాటేరా మూవీని తెరకెక్కించినట్లు కన్నడనాటప్రచారం జరిగింది. రిలీజ్‌కు ముందు కాటేరా కేజీఎఫ్ రికార్డులను బీట్ చేస్తుందని ప్రచారం జరిగింది. కానీ వంద కోట్ల కలెక్షన్స్ కూడా టచ్ చేయలేకపోయింది. కాటేరా తర్వాత డెవిల్ ది హీరో పేరుతో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు దర్శన్.