Bhimaa OTT Official: ఓటీటీలోకి పవర్ ప్యాక్‌డ్ యాక్షన్ మూవీ.. 3 భాషల్లో స్ట్రీమింగ్.. ఎక్కడ చూస్తారంటే?
Gopichand Bhimaa OTT Streaming: గోపీచంద్ హీరోగా పవర్ ఫుల్ యాక్షన్ ఒరియెంటెడ్ సినిమాగా వచ్చింది భీమా. మార్చి 8న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా దాదాపుగా 50 రోజులకు ఓటీటీలోకి రానుంది. మరి భీమా ఓటీటీ రిలీజ్ డేట్, ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఏంటో తెలుసుకుందాం.
Bhimaa OTT Release: గోపీచంద్ హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ భీమా. ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌లో నిర్మాత కెకె రాధా మోహన్ నిర్మించారు. దర్శకుడు ఎ హర్ష దర్శకత్వం వహించారు. కన్నడ డైరెక్టర్ అయిన హర్షకు తెలుగులో ఇది తొలి సినిమా. దీంతోనే టాలీవుడ్‌లో దర్శకుడిగా అరంగేట్రం చేశారు.
భీమా ఓటీటీ డేట్
భీమా చిత్రంలో ప్రియ భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్‌గా నటించారు. పవర్ ఫుల్ పోలీస్ కథతో తెరకెక్కిన భీమా సినిమా గత నెల 8వ తేదీన థియేటర్స్‌లోకి వచ్చింది. మాస్ ఎంటర్ టైనర్‌గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది భీమా. ముఖ్యంగా బీ, సీ సెంటర్స్ ఆడియెన్స్ ఈ సినిమాను బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ భీమా సినిమా ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకుంది.
భారీ ధరకు హక్కులు
మాస్ యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారు భీమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌పై చాలా ఇంట్రెస్ట్‌గా ఉన్నారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మంచి ధర వెచ్చించి సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌పై డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ఈ అనౌన్స్ మెంట్ చేసింది.
50 రోజులకు
భీమా మూవీ ఈ నెల 25వ తేదీ (ఏప్రిల్ 25) నుంచి డిస్నీ ఫ్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కు రాబోతోంది. థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సుమారు 50 రోజులకు ఓటీటీలోకి వచ్చేయనుంది. అది కూడా తెలుగుతోపాటు తమిళం, మలయాళ మూడు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కానుందీ మూవీ. ఈ విషయాన్ని సదరు ఓటీటీ హాట్‌స్టార్ ప్రకటించింది.
ఓటీటీ రిలీజ్ కోసం
డిస్నీ ఫ్లస్ హాట్‌స్టార్‌లోనూ భీమా సినిమాకు మంచి రెస్పాన్స్ రానున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయిన వాళ్లు చాలామందే ఉన్నారు. వారంతా ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. కాబట్టి భీమా ఓటీటీకి వచ్చిన వెంటనే మిస్ అయిన ప్రేక్షకులు చూసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
సోషల్ మీడియాలో
ఇదిలా ఉంటే, భీమా సినిమాను 3 భాషల్లో రిలీజ్ చేస్తారని కొన్ని పోస్ట్స్, లేదు 5 భాషల్లో విడుదల చేస్తారని మరికొన్ని ట్వీట్స్ సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో గోపీచంద్ యాక్షన్ మూవీ భీమా 5 (తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ) భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. కానీ, దీనిపై పూర్తి క్లారిటీ ఏప్రిల్ 25న రానుంది.
నార్త్ ఆడియెన్స్
ఏది ఏమైనా పవర్ ప్యాక్‌డ్ యాక్షన్ సినిమాలను నార్త్ ఆడియెన్స్ చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. కాబట్టి, నేరుగా హిందీలో రిలీజ్ కాకున్నప్పటికీ కొద్ది రోజులకు ఆ భాషలో కూడా భీమా డిజిటల్ ప్రీమియర్ అయ్యే అవకాశం ఉంది.
రెండు పాత్రలు
కాగా భీమాలో గోపీచంద్ రెండు పాత్రలు పోషించినట్లుగా సమాచారం. హీరో హీరోయిన్లతోపాటు చిత్రంలో ముఖేష్ తివారి, వెన్నెల కిశోర్, రఘుబాబు, నాజర్, నరేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సలార్, కేజీఎఫ్ చిత్రాలతో గుర్తింపు పొందిన రవి బస్రూర్ సంగీతం అందించారు. అలాగే స్వామి జె గౌడ సినిమాటోగ్రాఫర్, రమణ వంక ప్రొడక్షన్ డిజైన్, తమ్మిరాజు ఎడిటర్ బాధ్యతలు చేపట్టారు.