Gopichand: హంతకుడిగా గోపీచంద్.. చాలా కాలం తర్వాత విలన్ రోల్.. అదిరిపోయిన విశ్వం ఫస్ట్ స్ట్రైక్ వీడియో-gopichand viswam first strike video released gopichand plays villain role after goutham nanda ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gopichand: హంతకుడిగా గోపీచంద్.. చాలా కాలం తర్వాత విలన్ రోల్.. అదిరిపోయిన విశ్వం ఫస్ట్ స్ట్రైక్ వీడియో

Gopichand: హంతకుడిగా గోపీచంద్.. చాలా కాలం తర్వాత విలన్ రోల్.. అదిరిపోయిన విశ్వం ఫస్ట్ స్ట్రైక్ వీడియో

Sanjiv Kumar HT Telugu
Apr 12, 2024 10:47 AM IST

Gopichand Viswam Title Glimpse: మాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వం. ఇందులో గోపీచంద్ విలన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్, ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్.

హంతకుడిగా గోపీచంద్.. చాలా కాలం తర్వాత విలన్ రోల్.. అదిరిపోయిన విశ్వం ఫస్ట్ స్ట్రైక్ వీడియో
హంతకుడిగా గోపీచంద్.. చాలా కాలం తర్వాత విలన్ రోల్.. అదిరిపోయిన విశ్వం ఫస్ట్ స్ట్రైక్ వీడియో

Gopichand Viswam First Look: మాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వం. ఈ సినిమాకు కామెడీ యాక్షన్ చిత్రాలకు పేరొందిన శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈద్ సందర్భంగా విశ్వం ఫస్ట్ స్ట్రైక్ వీడియోను విడుదల చేసి మాస్ ఫీస్ట్‌ని అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వ ప్రసాద్, చిత్రాలయం స్టూడియోస్‌‌పై వేణు దోనేపూడి నిర్మిస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది.

గోపీచంద్ కెరీర్‌లో 32వ సినిమాగా వస్తున్న ఈ సినిమా ఫస్ట్ స్ట్రైక్ వీడియో చాలా ఆసక్తికరంగా ఉంది. వధూవరులు పెళ్లి మండపంలోకి రావడం, సంగీత విద్వాంసుల బృందం వివిధ వాయిద్యాలను వాయిస్తూ, పూజారి మంత్రాలు పఠించడం, రుచికరమైన ఆహారాన్ని సిద్ధం చేస్తున్న చెఫ్‌లు.. ఇలా వివాహ వేడుకలతో ఫస్ట్ స్ట్రైక్ వీడియో ప్రారంభమవుతుంది. గోపీచంద్ పెద్ద గిటార్ కేస్‌ని భుజంపై వేసుకుని పెళ్లి వేదిక వైపు నడుస్తూ ఎంట్రీ ఇచ్చారు.

అయితే, అది గిటార్ కాదు, మెషిన్ గన్. ఆశ్చర్యకరంగా, అతను వధూవరులను, వివాహానికి వచ్చిన అతిథులందరినీ కాల్చడం ప్రారంభిస్తారు. అందరిని కాల్చేసిన తర్వాత చివరగా, అక్కడ వండిన ఆహారాన్ని గోపీచంద్ ఆస్తాదిస్తాడు. "ఖానే ఖానే పే లిఖా, ఖానే వాలే కా నామ్... ఇస్పే లిఖా మేరే నామ్" అని హిందీలో డైలాగ్ చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగించడంతోపాటు చాలా పవర్ ఫుల్ గా ఉంది. తినే ప్రతి గంజపై తినేవాడి పేరు రాసి ఉంటుందంటారు. దీనిపై నా పేరు రాసి ఉంది అని ఆ డైలాగ్‌కు మీనింగ్ వస్తుంది.

ఇందులో లైట్ గడ్డంతో, డార్క్ కళ్లద్దాలు పెట్టుకునిస్టైలిష్‌గా కనిపించిన గోపీచంద్‌ని నెగెటివ్‌ షేడ్‌లో చూడటం నిజంగా సర్‌ప్రైజింగ్‌గా ఉంది. అతను డైలాగ్ పలికిన విధానం క్యారెక్టర్ గ్రే షేడ్‌ని సూచిస్తుంది. ఇలా ఈ మూవీలో గోపీచంద్ విలన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. నిజంగా విలన్‌గా నటిస్తున్నాడా లేదా డ్యూయెల్ రోల్ ఉందా, ఇంకేమైన ఆసక్తికర అంశాలు ఉన్నాయా అనేది సినిమా రిలీజ్ తర్వాత, లేదా టీజర్, ట్రైలర్‌ ద్వారా అర్థం చేసుకోవచ్చు.

శ్రీను వైట్ల ఫస్ట్ స్ట్రైక్‌ని మాస్ ఫీస్ట్‌గా చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు. ఇది చాలా స్టైలిష్‌గా, ప్రామెసింగ్ గా కనిపిస్తుంది. గోపీచంద్‌ని ఒక విభిన్నమైన పాత్రలో చూపించారు. కేవీ గుహన్‌ నైపుణ్యం ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది. చైతన్ భరద్వాజ్ స్కోర్ సినిమా సాంకేతికంగా ఎంత రిచ్ గా ఉందో తెలియజేస్తుంది. అద్భుతమైన ప్రొడక్షన్ డిజైన్ కన్నుల విందును అందిస్తుంది. మొత్తంమీద, ఫస్ట్ స్ట్రైక్ మాస్ ఫీస్ట్ ని అందించింది.

శ్రీనువైట్ల పలు బ్లాక్‌బస్టర్స్‌తో అనుబంధం ఉన్న గోపీ మోహన్ స్క్రీన్‌ప్లే రాశారు. అమర్‌రెడ్డి కుడుముల ఎడిటర్‌గా, కిరణ్‌ మన్నె ఆర్ట్‌ డైరెక్టర్‌ గా పని చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్, ఇతర వివరాలు త్వరలో ప్రకటించనున్నట్లు మేకర్స్ తెలిపారు. కాగా గోపీచంద్ చాలా కాలం తర్వాత విలన్‌గా నటిస్తున్నాడు. చివరిగా గౌతమ్ నంద సినిమాలో ఒక పాత్రలో విలన్‌గా చేసి మెప్పించాడు. ఇప్పుడు మరోసారి నెగెటివ్ రోల్‍లో ఆకట్టుకోనున్నట్లు తెలుస్తోంది.

IPL_Entry_Point