(1 / 5)
భరత్ తిప్పిరెడ్డి, ధన్య బాలకృష్ణ, కేరాఫ్ కంచరపాలెం కేశవ కర్రీ ప్రధాన పాత్రలలో నటించిన సినిమా శర్మ అండ్ అంబానీ.
(All Pics @Instagram)(2 / 5)
క్రైమ్ కామెడీ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన శర్మ అండ్ అంబానీ సినిమాకు కార్తీక్ సాయి దర్శకత్వం వహించారు. ఈ సినిమా నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది.
(3 / 5)
ప్రమోషనల్ కంటెంట్‌తో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ శర్మ అండ్ అంబానీ సినిమా ప్రముఖ తెలుగు ఓటీటీ ఈటీవీ విన్‌లో ఏప్రిల్ 11 అంటే గురువారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
(4 / 5)
ఈ సినిమాను అనిల్ పల్లాతో కలిసి భరత్ తిప్పిరెడ్డి నిర్మించారు. ఈ స్క్రిప్ట్‌ని భరత్ తిప్పిరెడ్డితో కలిసి డైరెక్టర్ కార్తీక్ సాయి సిద్ధం చేశారు. ఇక ఈ సినిమాలో మానస్ అద్వైత్, రాజశేఖర్ నర్జాల, విశ్వనాథ్ మండలిక, యష్, రూపక్, హనుమంతరావు వంటి నటులు ఇతర కీలక పాత్రలలో నటించారు.
(5 / 5)
ఆయుర్వేద వైద్యుడిగా శర్మ, షూ క్లీన్ చేసే వ్యక్తిగా అంబానీ జీవితం గడుపుతుంటారు. వారికి ఓ గ్యాంగ్‌కు సంబందించిన డైమండ్స్ బ్యాగ్ దొరకడంతో వారి జీవితాలు ఎలా తారుమారు అయ్యాయనే కథాంశంతో శర్మ అండ్ అంబానీ తెరకెక్కింది.
ఇతర గ్యాలరీలు