Sreenu Vaitala and Allari Naresh: అల్లరి నరేష్ ఆఫర్‌ను శ్రీను వైట్ల తిరస్కరించారా? అసలేమైంది?
Sreenu Vaitala and Allari Naresh: అల్లరి నరేష్-శ్రీను వైట్ల కాంబినేషన్‌లో సినిమా వస్తే చూడాలని సినీ ప్రేక్షకులు చాలా రోజుల నుంచి కోరుకుంటున్నారు. అయితే ఈ మూవీ కార్యరూపం దాల్చే అవకాశం కనిపించట్లేదు.
Sreenu Vaitala and Allari Naresh: అల్లరి నరేష్ ట్రాక్ మార్చి కంటెంట్ బేస్డ్ చిత్రాలను ఎంచుకుంటూ సక్సెస్ అందుకుంటున్నాడు. ఇప్పటికే నాందితో అద్భుత విజయం సొంతం చేసుకున్న నరేష్.. ఇప్పుడు అదే దర్శకుడితో ఉగ్రం అనే సినిమా చేసి మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మూవీ మే 5న విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్లతో అల్లరి నరేష్ ఓ సినిమా రాబోతుందని ఆ మధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. చాలా రోజులుగా హిట్ లేక సతమతమవుతున్న శ్రీను వైట్ల.. అల్లరి నరేష్‌తో సినిమా చేస్తే బాగుంటుందని అభిమానులు కోరుకున్నారు.
స్వతహాగా కామెడీకి పెట్టింది పేరైన శ్రీను వైట్ల.. తన కామెడీతో అదరగొట్టే అల్లరి నరేష్ కాంబోలో మూవీ వస్తే మంచి ఎగ్జయిటింగ్‌గా ఉంటుంది ప్రేక్షకులు కోరుకుంటున్నారు. అయితే ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చే అవకాశం కనిపించట్లేదు. ఇందుకు కారణం శ్రీను వైట్ల.. నరేష్‌తో పనిచేసేందుకు ఆసక్తి చూపించట్లేదని ఫిల్మ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. స్టార్ యాక్టర్లయిన మహేష్ బాబు, రవితేజ, నాగార్జున, వెంకటేష్, ఎన్‌టీఆర్, రామ్ చరణ్ లాంటి వారితో పనిచేసి.. కామెడీ హీరో అయిన అల్లరి నరేష్‌తో పనిచేసేందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదని సమాచారం.
శ్రీను వైట్ల ఏ లిస్ట్ యాక్టర్లతోనే పనిచేయాలని అనుకుంటున్నారని సమాచారం. ఇప్పటికే మంచు విష్ణుతో ఢీ మూవీ సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ కొన్ని రోజుల పాటు షూటింగ్ జరుపుకొని తెలియని కారణాల వల్ల ఆగిపోయింది. దీంతో శ్రీను వైట్ల ప్రస్తుతం ఖాళీగానే ఉన్నారు. మరోపక్క నరేష్ కూడా ఇటీవలే ఉగ్రం లాంటి సూపర్ హిట్‌ను అందుకున్నారు. అంతేకాకుండా ఈ మూవీ విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా మెరుగైన వసూళ్లను సాధిస్తోంది. దీంతో డైరెక్టర్ శ్రీను వైట్ల.. అల్లరి నరేష్‌తో పనిచేయడాన్ని పునరాలోచించుకోవాలని ప్రేక్షకులు అనుకుంటున్నారు. అన్నీ కుదిరితే అల్లరోడుతో శ్రీను వైట్ల మూవీ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
శ్రీను వైట్ల చివరగా 2018లో రవితేజతో అమర్ అక్బర్ ఆంటోనీ అనే సినిమా చేశారు. ఇలియానా హీరోయిన్‌గా చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దూకుడు, బాద్‌షా తర్వాత ఆయన చేసిన ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
అల్లరి నరేష్ నటించిన ఉగ్రంలో మిర్నా హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే సహా దర్శకత్వ బాధ్యతలను విజయ్ కనకమేడల నిర్వర్తించారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని సమకూరుస్తున్నారు. మే 5న ప్రపంచ వ్యాప్తంగాప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
టాపిక్