Bigg Boss 8 Telugu: బిగ్‌బాస్ 8 కంటెస్టెంట్స్ వీళ్లేనా? - ఈ సారి కొత్త రూల్స్ - హౌజ్‌లో ర‌చ్చ ర‌చ్చే!-bigg boss telugu season 8 starting date host and expected contestants list details ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss 8 Telugu: బిగ్‌బాస్ 8 కంటెస్టెంట్స్ వీళ్లేనా? - ఈ సారి కొత్త రూల్స్ - హౌజ్‌లో ర‌చ్చ ర‌చ్చే!

Bigg Boss 8 Telugu: బిగ్‌బాస్ 8 కంటెస్టెంట్స్ వీళ్లేనా? - ఈ సారి కొత్త రూల్స్ - హౌజ్‌లో ర‌చ్చ ర‌చ్చే!

Nelki Naresh Kumar HT Telugu
Jun 01, 2024 01:48 PM IST

Bigg Boss 8 Telugu: బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 8 ఆగ‌స్ట్ లేదా సెప్టెంబ‌ర్ నుంచి ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. సీజ‌న్ 8లో కంటెస్టెంట్స్‌గా ప‌లువురు టీవీ, సోష‌ల్ మీడియా స్టార్స్ ప్లేర్లు వినిపిస్తోన్నాయి. వారు ఎవ‌రంటే?

బిగ్‌బాస్ తెలుగు
బిగ్‌బాస్ తెలుగు

Bigg Boss 8 Telugu: బిగ్‌బాస్ సీజ‌న్ 7 ఊహించ‌ని మ‌లుపుల‌తో ముగిసింది. శివాజీ, అమ‌ర్‌దీప్‌, ప్రిన్స్ యావ‌ర్ వంటి పాపుల‌ర్ కంటెస్టెంట్‌ను కాద‌ని రైతుబిడ్డ‌గా హౌజ్‌లో అడుగుపెట్టిన‌ ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ విన్న‌ర్‌గా నిలిచాడు. ఎలాంటి అంచ‌నాలు లేకుండా హౌజ్‌లోకి అడుగుపెట్టి టైటిల్ ఎగ‌రేసుకుపోయాడు. బిగ్‌బాస్ ఫైన‌ల్ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాలు తెలుగు రాష్ట్రాల్లో ఆస‌క్తిని రేకెత్తించాయి.

అమ‌ర్‌దీప్‌, ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ ఫ్యాన్స్ మ‌ధ్య గొడ‌వ‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఈ గొడ‌వ‌ల కార‌ణంగా విన్న‌ర్ ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ జైలుకు వెళ్లాల్సివ‌చ్చింది. ఈ గొడ‌వ‌ల‌ను ప‌క్క‌న‌పెడితే బిగ్‌బాస్ సీజ‌న్ 7 టీఆర్‌పీ ప‌రంగా రికార్డులు క్రియేట్ చేసింది. గ‌త సీజ‌న్‌కు మించి స‌క్సెస్ అయ్యింది.

బిగ్‌బాస్ సీజ‌న్ 8...

సీజ‌న్ 7 స‌క్సెస్ నేప‌థ్యంలో బిగ్‌బాస్ 8ను తొంద‌ర‌లోనే ప్రారంభించేందుకు స్టార్‌మా స‌న్నాహాలు చేస్తోన్న‌ట్లు స‌మాచారం. ఈ సారి కొత్త రూల్స్‌, గేమ్స్‌తో బిగ్‌బాస్ 8 ప్రారంభం కాబోతోన్న‌ట్లు చెబుతోన్నారు.

ఈ సీజ‌న్‌లో బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌గా కొంద‌రు టీవీ, సోష‌ల్ మీడియా స్టార్స్ పేర్లు వినిపిస్తోన్నాయి.

సోష‌ల్ మీడియా...టీవీ స్టార్స్‌...

సోష‌ల్ మీడియా ద్వారా క‌మెడియ‌న్‌గా పాపుల‌ర్ అయిన బంచిక్ బ‌బ్లూ బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా హౌజ్‌లోకి అడుగుపెట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది. విరూపాక్ష ఫేమ్ సోనియా సింగ్ కూడా కంటెస్టెంట్‌గా ఛాన్స్ ద‌క్క‌నున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. డ్ర‌గ్స్‌ కేసుతో ఇటీవ‌ల వార్త‌ల్లో నిలిచిన హేమ కూడా ఈ సారి కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్‌లో పాల్గొనే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. యూట్యూబ్ సెన్సేష‌న్ నేత్ర‌తో పాటు ఆమె మాజీ భ‌ర్త వంశీ కూడా బిగ్‌బాస్ 8లో కంటెస్టెంట్‌గా హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

జ‌బ‌ర్ధ‌స్త్ నుంచి....

జ‌బ‌ర్ధ‌స్త్ కంటెస్టెంట్స్ పొట్టి న‌రేష్, రియాజ్, కిరాక్ ఆర్‌పీ, బుల్లెట్ భాస్క‌ర్‌, చ‌మ్మ‌క్ చంద్ర‌ల‌లో ఒక‌రు లేదా ఇద్ద‌రు బిగ్‌బాస్ షోలో పాల్గొన‌నున్న‌ట్లు స‌మాచారం.. అలాగే రీతూ చౌద‌రి, సురేఖ వాణి కూతురు సుప్రిత‌, యూట్యూబ‌ర్ నిఖిల్ విజ‌యేంద్ర‌సింహా బిగ్‌బాస్ టీమ్‌ సంప్ర‌దింపులు జ‌రుపుతోన్న‌ట్లు తెలుస్తోంది. వీరితో పాటు బిగ్‌బాస్ 8 కంటెస్టెంట్స్‌గా బ‌ర్రెల‌క్క‌, కుమారి ఆంటీ, ఖుషిత క‌ల్ల‌పు పేర్లు కూడా వినిపిస్తోన్నాయి.

అలాగే ఎక్‌నాథ్‌, హారిక జంట‌గా బిగ్‌బాస్‌లో సంద‌డి చేయ‌బోతున్న‌ట్లు చెబుతోన్నారు. కొంద‌రు పాత కంటెస్టెంట్స్ నైనీ పావ‌ని, యాంక‌ర్ శివ, స్ర‌వంతి చొక్కార‌పు కూడా హౌజ్‌లోకి రీఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. వీరితో పాటు మ‌రికొంద‌రుసోష‌ల్ మీడియా స్టార్స్ పేర్లు వినిపిస్తోన్నాయి. వీరిలో ఎవ‌రూ హౌజ్‌లోకి ఎంట్రీ ఇస్తారు?బిగ్‌బాస్ యాజ‌మాన్యం ఆఫ‌ర్‌ను ఎంత‌మంది అంగీక‌రిస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

నాగార్జున‌నే హోస్ట్‌...

ఈ సారి కూడా బిగ్‌బాస్‌కు నాగార్జున‌నే హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఆగ‌స్ట్ లేదా సెప్టెంబ‌ర్‌ల‌లో బిగ్‌బాస్ సీజ‌న్ 8 ప్రారంభం కానున్న‌ట్లు చెబుతోన్నారు. నాగార్జున స్థానంలో మ‌రొక‌రు సీజ‌న్ 8కు హోస్ట్‌గా రానున్న‌ట్లు వార్త‌లొచ్చాయి. అయితే సీజ‌న్ 7 స‌క్సెస్ కావ‌డంతో హోస్ట్‌ను మార్చాల‌నే నిర్ణ‌యంపై బిగ్‌బాస్ యాజ‌మాన్యం వెన‌క్కి త‌గ్గిన‌ట్లు చెబుతోన్నారు.

బిగ్‌బాస్ ఫ‌స్ట్ సీజ‌న్‌కు ఎన్టీఆర్‌, సెకండ్ సీజ‌న్‌కు నాని హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించారు. ఆ త‌ర్వాత మూడు నుంచి ఏడు వ‌ర‌కు మొత్తం ఐదు సీజ‌న్స్‌కు నాగార్జున హోస్ట్‌గా ఉన్నాడు. బిగ్‌బాస్ సీజ‌న్ 8 హోస్ట్‌గా నాగార్జున చివ‌రిది కానున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

టీ20 వరల్డ్ కప్ 2024