Hanuman Movie: మహేష్, వెంకటేష్, నాగార్జున సినిమాలను దాటేసిన తేజా సజ్జా - సంక్రాంతి సినిమాల్లో హనుమాన్ టాప్
Hanuman Movie: సంక్రాంతికి రిలీజ్ అవుతోన్న తెలుగు సినిమాల్లో బుక్ మై షో యాప్‌లో స్టార్ హీరోల సినిమాల కంటే హనుమాన్‌కే ఎక్కువగా క్రేజ్ ఉంది. బుక్ మై షో ఇంట్రెస్ట్ లిస్ట్‌లో హనుమాన్ టాప్‌లో ఉంది.
Hanuman Movie: ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద ఐదు స్ట్రెయిట్ సినిమాలతో పాటు మూడు డబ్బింగ్ సినిమాలు పోటీపడబోతున్నాయి. స్టార్ హీరోల మధ్య సంక్రాంతి పోరు తెలుగు ఆడియెన్స్‌లో ఆసక్తికరంగా మారింది. ఈ పోటీలో విన్నర్ ఎవరు అవుతారోనని ప్రేక్షకులు ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నారు.
ఈ సంక్రాంతికి మహేష్‌బాబు గుంటూరు కారం, వెంకటేష్ సైంధవ్, నాగార్జున నా సామిరంగ, రవితేజ ఈగల్ వంటి స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరో తేజా సజ్జా కూడా హనుమాన్ సినిమాతో బాక్పాఫీస్ బరిలో నిలిచారు.
హనుమాన్‌కే క్రేజ్...
అయితే ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ యాప్‌బుక్ మై షోలో స్టార్ హీరోల కంటే హనుమాన్‌కు ఎక్కువగా క్రేజ్ ఉండటం గమనార్హం. బుక్ మై షో ఇంట్రెస్ట్ లిస్ట్ హనుమాన్ టాప్‌లో ఉంది. హనుమాన్ సినిమా చూడటానికి ఎక్కువగా మంది ఆడియెన్స్ ఆసక్తిని చూపుతున్నారు.ఇంట్రెస్టెడ్ లిస్ట్‌లో హనుమాన్ సినిమాకు 177.9 కే లైక్స్ ఉన్నాయి.
మహేష్‌బాబు గుంటూరు కారం సినిమాకు 177.4 కే లైక్స్ మాత్రమే ఉన్నాయి. బుక్‌మై షో ఇంట్రెస్ట్స్ విషయంలో గుంటూరు కారం సినిమాను హనుమాన్ దాటేయడం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ రెండు సినిమాల మధ్య తేడా పెద్దగా లేకపోవడం గమనార్హం. మరో రోజులో బుక్ మై షో ఇంట్రెస్టెడ్ లైక్స్ విషయంలో హనుమాన్‌ను గుంటూరు కారం దాటేయడం ఖాయంగానే కనిపిస్తోంది.
పోటీలో లేని స్టార్ హీరోలు...
రవితేజ ఈగల్, వెంకటేష్ సైంధవ్‌తో పాటు నాగార్జున నా సామి రంగ సినిమాల బుక్ మై షో ఇంట్రెస్ట్స్ విషయంలో గుంటూరు కారం, హనుమాన్‌లకు దరిదాపుల్లో కూడా లేవు. వెంకటేష్ సైంధవ్ సినిమాకు 64.8 కే లైక్స్, నా సామి రంగకు 42.4 కే లైక్స్ ఉన్నాయి. అతి తక్కువగా రవితేజ ఈగల్ సినిమాను చూడటానికి సిద్ధంగా ఉన్నట్లు 19.5 కే ఆడియెన్స్ మాత్రమే లైక్స్ చేశారు. సంక్రాంతి సినిమాల బుకింగ్స్ ఆదివారం నుంచి ఓపెన్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
థియేటర్లు డౌట్
సంక్రాంతి భారీ పోటీ నేపథ్యంలో అన్ని సినిమాలకు సమాన స్థాయిలో థియేటర్లు దొరకడం కష్టంగా మారింది. ముఖ్యంగా గుంటూరు కారంతో ఉన్న పోటీ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్‌కు చాలా తక్కువ సంఖ్యలో థియేటర్లు కేటాయించినట్లు తెలిసింది. హైదరాబాద్‌లో ఈ మూవీ యాభైకంటే తక్కువ థియేటర్లలోనే రిలీజ్ అవుతోన్నట్లు చెబుతున్నారు. హనుమాన్ సినిమాలో తేజా సజ్జా హీరోగా నటిస్తున్నాడు.
అతడు...ఖలేజా తర్వాత...
డివోషనల్ పాయింట్‌కు సూపర్ హీరో కథాంశాన్ని మిక్స్ చేస్తూ దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాను తెరకెక్కిస్తోన్నాడు. అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీలో వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మరోవైపు గుంటూరు కారం సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తోన్నాడు. అతడు, ఖలేజా తర్వాత మహేష్, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్న ఈ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. గుంటూరు కారం సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
జనవరి 6న గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీ స్థాయిలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదే రోజు ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు.