Joju George: గ్యాంగ్‌స్ట‌ర్ మూవీతో డైరెక్ట‌ర్‌గా ఎంట్రీ ఇస్తోన్న మ‌ల‌యాళం హీరో - బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌కు ఛాన్స్‌-joju george directorial debut movie pani first look unveiled by simbu malayalam movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Joju George: గ్యాంగ్‌స్ట‌ర్ మూవీతో డైరెక్ట‌ర్‌గా ఎంట్రీ ఇస్తోన్న మ‌ల‌యాళం హీరో - బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌కు ఛాన్స్‌

Joju George: గ్యాంగ్‌స్ట‌ర్ మూవీతో డైరెక్ట‌ర్‌గా ఎంట్రీ ఇస్తోన్న మ‌ల‌యాళం హీరో - బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌కు ఛాన్స్‌

Nelki Naresh Kumar HT Telugu
May 29, 2024 12:50 PM IST

Joju George: మ‌ల‌యాళ వెర్స‌టైల్ యాక్ట‌ర్ జోజు జార్జ్ డైరెక్ట‌ర్‌గా ఎంట్రీ ఇస్తోన్నాడు. ప‌ణి పేరుతో రివేంజ్ గ్యాంగ్‌స్ట‌ర్ మూవీ చేస్తోన్నాడు. ప‌ణి మూవీ ఫ‌స్ట్‌లుక్‌ను శింబు సోష‌ల్ మీడియా ద్వారా రిలీజ్ చేశాడు.

జోజు జార్జ్ ప‌ణి
జోజు జార్జ్ ప‌ణి

Joju George: హీరోలు మెగాఫోన్ ప‌ట్ట‌డం ద‌క్షిణాదిలో కొత్తేమీ కాదు. వెండితెర‌పై అస‌మాన న‌ట‌న‌తో ఆడియెన్స్‌ను అల‌రించిన ప‌లువురు దిగ్గ‌జ న‌టులు ద‌ర్శ‌కులుగా మారి విజ‌యాల్ని అందుకున్న సంద‌ర్భాలు ద‌క్షిణాది చిత్ర‌సీమ‌లో చాలానే ఉన్నాయి. కొన్నాళ్లుగా హీరోలు ద‌ర్శ‌కులుగా మారే ట్రెండ్ మ‌ల‌యాళంలో ఎక్కువ‌గా క‌నిపిస్తోంది.

లూసిఫ‌ర్‌, బ్రో డాడీల‌తో పృథ్వీరాజ్‌సుకుమార‌న్ డైరెక్ట‌ర్‌గా ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడు. మ‌రో అగ్ర న‌టుడు మోహ‌న్‌లాల్ బారోజ్ మూవీతో ద‌ర్శ‌కుడిగా త్వ‌ర‌లోనే ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. మోహ‌న్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమార‌న్‌ బాట‌లోనే మ‌రో మ‌ల‌యాళ హీరో జోజు జార్జ్ అడుగులు వేయ‌బోతున్నాడు. ప‌ణి మూవీతో డైరెక్ట‌ర్‌గా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు.

ఫ‌స్ట్ లుక్ శింబు రిలీజ్‌...

ప‌ణి సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూనే ఇందులో హీరోగా కూడా జోజు జార్జ్ క‌నిపించ‌బోతున్నాడు. ప‌ణి ఫ‌స్ట్ లుక్‌ను త‌మిళ హీరో శింబు రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలోవైర‌ల్‌గా మారింది. రివేంజ్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో జోజు జార్జ్ మాస్ రోల్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌....

ప‌ణి మూవీలో అభిన‌య హీరోయిన్‌గా న‌టిస్తోండ‌గా...బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ సాగ‌ర్‌, జునైస్ కీల‌క పాత్ర‌లు పోషిస్తోన్నారు. మ‌ల‌యాళం బిగ్‌బాస్ సీజ‌న్ 5 ద్వారా సాగ‌ర్, జునైస్ ఫేమ‌స్ అయ్యారు. ఇటీవ‌లే బిగ్‌బాస్ సీజ‌న్ 6కు స్పెష‌ల్ గెస్ట్‌లుగా సాగ‌ర్‌, జునైస్ హాజ‌ర‌య్యారు. వారితో పాటు జోజు జార్జ్ కూడా అటెండ్ అయ్యాడు. ప‌ణి మూవీ విశేషాల‌ను బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌తో సాగ‌ర్‌, జునైస్ పంచుకున్నారు.రెండు గ్రూపుల మ‌ధ్య గ్యాంగ్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో ప‌ణి మూవీ తెర‌కెక్కుతోన్న‌ట్లు వెల్ల‌డించారు.

బాలీవుడ్‌లోకి ఎంట్రీ...

జోజు జార్జ్ ఈ ఏడాదే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. అనురాగ్ క‌శ్య‌ప్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న హిందీలో మూవీలో బాబీడియోల్‌తో పాటు జోజు జార్జ్ ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తోన్నాడు. య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా తెర‌కెక్కుతోన్న ఈ బాలీవుడ్ థ్రిల్ల‌ర్ మూవీలో స‌న్యా మ‌ల్హోత్రా, స‌బా ఆజాద్ కీల‌క పాత్ర‌లు పోసిస్తోన్నారు.

సూర్య 44 లో కూడా...

సూర్య 44వ మూవీలో సూర్య హీరోగా కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న త‌మిళ మూవీలో జోజు జార్జ్ విల‌న్‌గా న‌టించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ త‌మిళ మూవీలో పూజాహెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది.

టాలీవుడ్‌లో విల‌న్‌గా...

హీరో పాత్ర‌ల‌కే ప‌రిమితం కాకుండా క‌థ న‌చ్చితే విల‌న్‌గా కూడా న‌టించ‌డానికి జోజు జార్జ్ సిద్ధంగా ఉంటాడు. తెలుగులోమెగా హీరో వైష్ణ‌వ్‌తేజ్ హీరోగా న‌టించిన ఆదికేశ‌వ‌లో జోజు జార్జ్ విల‌న్‌గా న‌టించాడు. ఈ మూవీతోనే అత‌డు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. రొటీన్ స్టోరీ కార‌ణంగా జోజు జార్జ్ తెలుగు డెబ్యూ మూవీ ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయింది.

సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు...

ప‌ణిలో హీరోయిన్‌గా న‌టిస్తోన్న అభిన‌య తెలుగులో ప‌లు సినిమాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా క‌నిపించింది. స్టార్ హీరోల‌కు చెల్లిలి పాత్ర‌ల్లో ప‌లు సినిమాల్లో క‌నిపించింది. సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, ధృవ‌, రాజుగారి గ‌ది 2, సీతారామం, గామి తో పాటు తెలుగులో ప‌లు సినిమాల్లో డిఫ‌రెంట్ రోల్స్ చేసింది.

టీ20 వరల్డ్ కప్ 2024

టాపిక్