Rana Rakshasa Raja: రాక్షస రాజాగా రానా - మళ్లీ నెగెటివ్ షేడ్స్ క్యారెక్టర్‌లో దగ్గుబాటి హీరో
Rana Rakshasa Raja: రానా పుట్టినరోజు సందర్భంగా గురువారం అతడి కొత్త సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ఈ సినిమాకు రాక్షసరాజా అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

Rana Rakshasa Raja: నేను రాజు నేనే మంత్రి తర్వాత హీరో రానా, డైరెక్టర్ తేజ కాంబినేషన్‌లో మరో మూవీ రాబోతోంది. గురువారం రానా పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను రివీల్ చేశారు. ఈ సినిమాకు రాక్షసరాజా అనే పేరును ఖరారు చేశారు. ఈ పోస్టర్‌లో భుజంపై గన్ పెట్టుకొని ఇంటెన్స్ లుక్‌లో రానా కనిపిస్తోన్నాడు. అతడి నుదిటిపై విభూతి బొట్టు ఉండటం ఆసక్తిని పంచుతోంది. నోటిలో సిగరెట్ ఉంది. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా రాక్షసరాజా మూవీ తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ఇందులో రానా పాత్ర నెగెటివ్ షేడ్స్‌తో ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు చేయని కొత్త పాత్రలో అతడు కనిపించబోతున్నట్లు చెబుతున్నారు.
పాన్ ఇండియన్ మూవీగా రాక్షసరాజాను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాక్షసరాజా సినిమాలో హీరోయిన్‌తో పాటు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరన్నది త్వరలోనే ప్రకటించబోతున్నారు.
బాహుబలి తర్వాత సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోన్నారు రానా. హీరోగా రెండు, మూడు సినిమాలు అనౌన్స్‌చేసినా అవి సెట్స్‌పైకి రాలేదు. ప్రస్తుతం రజనీకాంత్ వేటగాడు సినిమాలో రానా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అలాగే హిరణ్యకశ్యప అనే సినిమాను రానా అనౌన్స్ చేశాడు.
టాపిక్