Marco First Look: భాగ‌మ‌తి హీరో పాన్ ఇండియ‌న్ యాక్ష‌న్ మూవీ - మార్కో ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌-malayalam hero unni mukundan pan indian action movie marco first look unveiled ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Marco First Look: భాగ‌మ‌తి హీరో పాన్ ఇండియ‌న్ యాక్ష‌న్ మూవీ - మార్కో ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

Marco First Look: భాగ‌మ‌తి హీరో పాన్ ఇండియ‌న్ యాక్ష‌న్ మూవీ - మార్కో ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

Nelki Naresh Kumar HT Telugu
Jun 16, 2024 12:56 PM IST

Marco First Look: ఉన్ని ముకుంద‌న్ హీరోగా న‌టిస్తోన్న పాన్ ఇండియ‌న్ మూవీ మార్కో ఫ‌స్ట్ లుక్‌ను మేక‌ర్స్ ఆదివారం రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్‌లో ఇంటెన్స్ లుక్‌లో ఉన్ని ముకుంద‌న్ క‌నిపిస్తోన్నాడు.

మార్కో ఫ‌స్ట్ లుక్‌
మార్కో ఫ‌స్ట్ లుక్‌

Marco First Look: భాగ‌మ‌తి, య‌శోద సినిమాల ఫేమ్ ఉన్ని ముకుంద‌న్ హీరోగా న‌టిస్తోన్న పాన్ ఇండియ‌న్ మూవీ మార్కో ఫ‌స్ట్ లుక్‌ను మేక‌ర్స్ ఆదివారం రిలీజ్ చేశారు. ముఖంపై ర‌క్త‌పు మ‌ర‌క‌ల‌తో ఈ పోస్ట‌ర్‌లో ఇంటెన్స్ లుక్‌లో ఉన్ని ముకుంద‌న్ క‌నిపిస్తోన్నాడు. అత‌డి నోటిలో ర‌క్తంతో త‌డిచిన క‌త్తి ఉండ‌టం ఆస‌క్తిని పంచుతోంది. ఉన్ని ముకుంద‌న్ మార్కో ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. మార్కో మూవీకి హ‌నీష్ అదేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

నెగెటివ్ షేడ్స్ క్యారెక్ట‌ర్‌లో...

యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో ఉన్ని ముకుంద‌న్ నెగెటివ్ షేడ్స్‌తో కూడినప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఈ మూవీకి కేజీఎఫ్ ఫేమ్‌ ర‌వి బ‌స్రూర్ మ్యూజిక్ అందిస్తోన్నాడు.

మైఖేల్ మూవీ...

నివీన్ పాల్ హీరోగా 2019లో ద‌ర్శ‌కుడు హ‌నీష్ అదేని...మైఖేల్ అనే మూవీని తెర‌కెక్కించాడు. ఇందులో ఉన్ని ముకుంద‌న్ విల‌న్‌గా క‌నిపించారు. మార్కో పాత్ర‌లో త‌న‌ విల‌నిజం, యాక్టింగ్‌తో అద‌ర‌గొట్టాడు. మైఖేల్ మూవీ ఫ్లాప‌యినా మార్కో పాత్ర ఉన్ని ముకుంద‌న్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది.

మైఖేల్ మూవీలోని మార్కో క్యారెక్ట‌ర్‌ను తీసుకొని అదే పేరుతో హ‌నీష్ అదేని ఈ మూవీని తెర‌కెక్కిస్తోన్న‌ట్లు స‌మాచారం. ఈ యాక్షన్ మూవీని క్యూబ్స్ ఎంటర్‌టైనర్ బ్యాన‌ర్‌పై షరీఫ్ మహ్మద్ అబ్దుల్ గదాఫ్ నిర్మిస్తోన్నారు. మార్కో మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. 2024లోనే ఈ మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నారు. త్వరలో మార్కో ట్రైలర్ ను విడుదల చేసేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తోన్నారు.

జ‌న‌తా గ్యారేజ్‌తో...

ఎన్టీఆర్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన జ‌న‌తా గ్యారేజ్ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు ఉన్ని ముకుంద‌న్‌. ఈ మూవీలో పాజిటివ్‌గా క‌నిపించే విల‌న్ రోల్‌లో త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. ఆ త‌ర్వాత అనుష్క భాగ‌మ‌తితో హీరోగా క‌నిపించాడు. స‌మంత య‌శోద‌తో పాటు ర‌వితేజ ఖిలాడీలో నెగెటివ్ షేడ్స్ క్యారెక్ట‌ర్స్‌లో క‌నిపించాడు.

మాలికాపురంతో హిట్‌...

మ‌ల‌యాళంలో హీరోగా, విల‌న్‌గా డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్ చేస్తున్నాడు. గ‌త ఏడాది మాలికాపురం మూవీతో కెరీర్‌లో బిగ్గెస్ట్ స‌క్సెస్ అందుకున్నాడు. ఇటీవ‌లే జై గ‌ణేష్ పేరుతో మ‌ల‌యాళంలో ఓ సినిమా చేశాడు ఉన్ని ముకుంద‌న్‌. హీరోగా న‌టిస్తూనే ఈ మూవీని స్వ‌యంగా నిర్మించాడు. ఓ ప్ర‌మాదంలో వీల్ ఛైర్‌కు ప‌రిమిత‌మైన ఓ యువ‌కుడు పెద్ద క్రైమ్‌ను ఎలా సాల్వ్ చేశాడ‌నే పాయింట్‌తో ఈ మూవీ తెర‌కెక్కింది. ఇటీవ‌లే జై గ‌ణేష్ ఓటీటీలో రిలీజైంది. హీరోగా, ప్రొడ్యూస‌ర్‌గానే కాకుండా సింగ‌ర్‌గా ప‌లు మ‌ల‌యాళం సినిమాల్లో ఉన్ని ముకుంద‌న్ పాట‌లు ప‌డాడు.

WhatsApp channel