Double iSmart Release Date: రామ్ - పూరి ‘డబుల్ ఇస్మార్ట్’ రిలీజ్ డేట్ ఖరారు.. పుష్ప 2 వాయిదా పడినట్టేనా?-ram pothineni puri jagannadh double ismart movie release date announced escalates pushpa 2 postpone rumors ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Double Ismart Release Date: రామ్ - పూరి ‘డబుల్ ఇస్మార్ట్’ రిలీజ్ డేట్ ఖరారు.. పుష్ప 2 వాయిదా పడినట్టేనా?

Double iSmart Release Date: రామ్ - పూరి ‘డబుల్ ఇస్మార్ట్’ రిలీజ్ డేట్ ఖరారు.. పుష్ప 2 వాయిదా పడినట్టేనా?

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 15, 2024 05:51 PM IST

Double iSmart Release Date: డబుల్ ఇస్మార్ట్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. విడుదల తేదీని మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. దీంతో పుష్ప 2 రిలీజ్ డేట్ వాయిదా పడుతుందనే పుకార్లు మరింత ఎక్కువయ్యాయి.

Double iSmart Release Date: రామ్ - పూరి ‘డబుల్ ఇస్మార్ట్’ రిలీజ్ డేట్ ఖరారు.. పుష్ప 2 వాయిదా పడినట్టేనా?
Double iSmart Release Date: రామ్ - పూరి ‘డబుల్ ఇస్మార్ట్’ రిలీజ్ డేట్ ఖరారు.. పుష్ప 2 వాయిదా పడినట్టేనా?

Double iSmart Release Date: యంగ్ హీరోగా ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న డబుల్ ఇస్మార్ట్ చిత్రంపై హైప్ బాగానే ఉంది. పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వీరి కాంబోలో ఐదేళ్ల క్రితం వచ్చిన ఇస్మార్ట్ శంకర్ బ్లాక్‍బస్టర్ అయింది. దానికి సీక్వెల్‍గా వస్తున్న డబుల్ ఇస్మార్ట్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. మార్చిలోనే రావాల్సిన చిత్రం వాయిదా పడింది. అయితే, ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ డేట్ ఖరారైంది.

రిలీజ్ డేట్ ఇదే

డబుల్ ఇస్మార్ట్ సినిమా ఆగస్టు 15వ తేదీన రిలీజ్ కానుంది. ఇండిపెండెన్స్ డేను ఈ మూవీ లాక్ చేసుకుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ నేడు (జూన్ 15) అధికారికంగా ప్రకటించింది. రామ్ పోతినేని కొత్త పోస్టర్‌తో విడుదల తేదీని వెల్లడించింది.

“డబుల్ ఇంపాక్ట్‌తో లాక్, లోడ్ అయింది. ఉస్తాద్ రామ్ పోతినేని, డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో వస్తున్న ఎంతో ఎదురుచూస్తున్న యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ డబుల్ ఇస్మార్ ఆగస్టు 15న థియేటర్లలో రిలీజ్ కానుంది” అని మూవీ టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

డబుల్ ఇస్మార్ట్ చిత్రంలో రామ్ సరసన కావ్య థాపర్ హీరోయిన్‍గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్‍గా చేస్తున్నారు. మరోసారి పక్కా మాస్ యాక్షన్‍తో ఈ చిత్రాన్ని పూరి తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

పుష్ప 2 వాయిదాపై పెరిగిన రూమర్లు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ‘పుష్ప 2: ది రూల్’ సినిమా ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీనే రిలీజ్ కావాల్సి ఉంది. అయితే, ఈ చిత్రం వాయిదా పడుతుందనే రూమర్లు కొన్ని రోజులుగా విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే, మూవీ టీమ్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

అయితే, ఆగస్టు 15వ తేదీకి రిలీజ్ డేట్‍ను డబుల్ ఇస్మార్ట్ ఫిక్స్ చేసుకోవడంతో పుష్ప 2 వాయిదా పడినట్టేనా అనే అనుమానాలు బలపడ్డాయని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. ఒకవేళ పుష్ప 2 వస్తే డబుల్ ఇస్మార్ట్ పోటీలో ఉండే అవకాశాలు చాలా తక్కువ. దీంతో పుష్ప 2 విడుదల వాయిదా తప్పదనే ఉద్దేశంతనే డబుల్ ఇస్మార్ట్ ఆగస్టు 15ను లాక్ చేసుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పుష్ప 2 మూవీ షూటింగ్ ఆలస్యమవుతుందని, అందుకే రిలీజ్ వాయిదా తప్పదనే రూమర్లు వారం రోజులుగా విపరీతమవుతున్నాయి. మూవీ టీమ్ స్పందించకపోతుండటంతో ఇవి మరింత ఎక్కువ అవుతున్నాయి. క్లారిటీ ఇవ్వాలని మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ హౌస్‍ను కోరుతూ చాలా మంది నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఇక డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ డేట్ ప్రకటనతో పుష్ప 2పై రూమర్లు మరింత ఎక్కువయ్యాయి.

డబుల్ ఇస్మార్ట్ మూవీని పూరి టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, చార్మి కౌర్ సంయుక్తంగా ప్రొడ్యూజ్ చేస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ రిలీజ్ అవుతుందని మూవీ టీమ్ ఇప్పటికే ఖరారు చేసింది.

WhatsApp channel