Pushpa 2: పుష్ప 2 మూవీపై లక్కీ భాస్కర్, తంగలాన్ కన్ను!-thangalaan and lucky bhaskar looking for august 15 slot if allu arjun pushpa 2 postpone ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pushpa 2: పుష్ప 2 మూవీపై లక్కీ భాస్కర్, తంగలాన్ కన్ను!

Pushpa 2: పుష్ప 2 మూవీపై లక్కీ భాస్కర్, తంగలాన్ కన్ను!

Pushpa 2: పుష్ప 2 సినిమాపై ప్రస్తుతం సందిగ్ధత నెలకొంది. ఈ చిత్రం రిలీజ్ వాయిదా పడుతుందనే రూమర్లు వస్తున్నాయి. ఈ తరుణంలో ఈ మూవీపై కొన్ని సినిమాలు దృష్టి పెట్టాయి.

Pushpa 2: పుష్ప 2 మూవీపై లక్కీ భాస్కర్, తంగలాన్ కన్ను

Pushpa 2: దేశంలో ఎక్కువ మంది సినీ ప్రేక్షకులు నిరీక్షిస్తున్న చిత్రాల్లో పుష్ప 2: ది రూల్ ముందు వరుసలో ఉంది. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంపై పాన్ ఇండియా రేంజ్‍లో ఫుల్ క్రేజ్ ఉంది. భారీస్థాయిలో యాక్షన్ డ్రామాగా ఈ సీక్వెల్ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15వ తేదీన పుష్ప 2 చిత్రాన్న రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే, పుష్ప 2 రిలీజ్ వాయిదా పడుతుందనే రూమర్లు ఇప్పుడు తీవ్రమవుతున్నాయి. దీంతో ఈ చిత్రం వాయిదా పడితే ఆగస్టు 15న వచ్చేందుకు కొన్ని సినిమాలు రెడీ అవుతున్నాయి.

తంగలాన్ రెడీ

తమిళ స్టార్ డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వంలో హీరో విక్రమ్ ప్రధాన పాత్ర పోషించిన తంగలాన్ రిలీజ్‍కు రెడీ ఉంది. ఈ సినిమా పనులన్నీ పూర్తయ్యాయి. అయితే రిలీజ్‍కు సరైన డేట్ కోసం ఈ మూవీ యూనిట్ ఎదురుచూస్తోంది. ఎన్నికలు ఉండటంతో మే నెలలో ఈ చిత్రం రాలేదు. దీంతో కొత్త రిలీజ్ స్లాట్ కోసం తంగలాన్ మేకర్స్ సమాలోచనలు చేస్తున్నారు.

ఒకవేళ పుష్ప 2 సినిమా ఆగస్టు 15వ తేదీ నుంచి వాయిదా పడితే.. ఆ రోజున రిలీజ్ చేసేందుకు తంగలాన్ మూవీ యూనిట్ రెడీ అవుతోందని ఇటీవల టాక్ బయటికి వచ్చింది. హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా వస్తున్న తంగలాన్‍పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. పాన్ ఇండియా రేంజ్‍లో రిలీజ్ కానుంది. ఒకవేళ పుష్ప 2 పోస్ట్‌పోన్ అయితే ఇండిపెండెన్స్ డేనే బెస్ట్ అని ఈ మూవీ టీమ్ ఆలోచిస్తోంది. పుష్ప 2 టీమ్ నుంచి రిలీజ్ డేట్‍పై క్లారిటీ ఎప్పుడు వస్తుందా అనే కన్నేసి ఉంచింది తంగలాన్ యూనిట్.

లక్కీ భాస్కర్

దుల్కర్ సల్మాన్ హీరోగా లక్కీ భాస్కర్ చిత్రం రూపొందుతోంది. వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27వ తేదీన థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్టు మూవీ టీమ్ ఇటీవలే ప్రకటించింది. అయితే, సెప్టెంబర్ 27ను తాజాగా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర ఫిక్స్ చేసుకుంది. దీంతో లక్కీ భాస్కర్ తేదీ మారడం పక్కాగా కనిపిస్తోంది. పుష్ప 2 చిత్రం వాయిదా పడితే ఆ రోజుకు తమ మూవీ తీసుకురావాలని లక్కీ భాస్కర్ టీమ్ భావిస్తోందని తెలుస్తోంది.

పుష్ప 2 రాకపోతే ఆగస్టు 15న లక్కీ భాస్కర్ మూవీని రిలీజ్ చేసేలా లక్కీ భాస్కర్ టీమ్ ఆలోచిస్తోందని సినీ సర్కిల్‍లో టాక్ చక్కర్లు కొడుతోంది. అప్పటికల్లా అన్ని పనులు పూర్తయ్యే విషయంపై ఇది ఆధారపడి ఉంటుంది. అయితే, ఇండిపెండెన్స్ డేకు రెడీ అయ్యేలానే ఇప్పటికే ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి.

పుష్ప 2 రిలీజ్ వాయిదా పడితే ఆగస్టు 15న రావాలని బాలీవుడ్ మూవీ ‘స్త్రీ 2’ కూడా వెయిట్ చేస్తోంది. ఆగస్టులో అని ఇప్పటికే మేకర్స్ ప్రకటించేశారు.

పుష్ప 2 రిలీజ్‍పై రూమర్లు అధికంగా వస్తున్న తరుణంలో త్వరగా క్లారిటీ ఇవ్వాలని అల్లు అర్జున్ ఫ్యాన్స్ మేకర్లను సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ ఇంకా స్పందించలేదు. మరి ఆగస్టు 15న పుష్ప 2 వస్తుందా.. లేదా అని ప్రేక్షకులతో పాటు కొన్ని సినిమా టీమ్‍లు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. 2021 డిసెంబర్లో రిలీజై పాన్ ఇండియా రేంజ్‍లో బాక్సాఫీస్ షేక్ చేసిన పుష్పకు సీక్వెల్‍గా ఈ పుష్ప 2 రూపొందుతోంది.