Star Maa Serials TRP Ratings: స్టార్ మా సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ఇవే.. తిరుగులేని ఆ రెండు సీరియల్స్-star maa serials latest trp ratings brahmamudi karthika deepam gunde ninda gudi gantalu in top 3 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Star Maa Serials Trp Ratings: స్టార్ మా సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ఇవే.. తిరుగులేని ఆ రెండు సీరియల్స్

Star Maa Serials TRP Ratings: స్టార్ మా సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ఇవే.. తిరుగులేని ఆ రెండు సీరియల్స్

Hari Prasad S HT Telugu
Sep 13, 2024 04:39 PM IST

Star Maa Serials TRP Ratings: స్టార్ మా సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. 36వ వారానికిగాను రిలీజ్ చేసిన ఈ జాబితాలో మరోసారి టాప్ 5లో ఆ సీరియల్స్ హవానే కొనసాగింది. మరి టాప్ 10లో ఉన్న సీరియల్స్ ఏంటో చూడండి.

స్టార్ మా సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ఇవే.. తిరుగులేని ఆ రెండు సీరియల్స్
స్టార్ మా సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ఇవే.. తిరుగులేని ఆ రెండు సీరియల్స్

Star Maa Serials TRP Ratings: స్టార్ మా సీరియల్స్ కు టీవీ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. మిగతా తెలుగు ఛానెల్స్ తో పోలిస్తే ఈ ఛానెల్లో వచ్చే సీరియల్స్ కే ఎక్కువ ఆదరణ లభిస్తోంది. ఇందులో వచ్చే సీరియల్స్ అన్నీ టీఆర్పీ రేటింగ్స్ లో అదరగొడుతుంటాయి. మరి స్టార్ మాలో వచ్చే ఈ సీరియల్స్ లో తాజా టీఆర్పీల ప్రకారం.. టాప్ 10లో ఉన్నవేవో చూడండి.

తిరుగులేని బ్రహ్మముడి

స్టార్ మా ఛానెల్ 36వ వారానికి సంబంధించిన టీఆర్పీ రేటింగ్స్ రిలీజ్ అయ్యాయి. వీటిలో ఊహించినట్లే కొన్ని సీరియల్స్ టాప్ లో నిలిచాయి. గడిచిన కొన్ని నెలలుగా ఈ ఛానెల్లో వచ్చే బ్రహ్మముడి సీరియల్ తాజా రేటింగ్స్ లోనూ టాప్ లోనే ఉంది. ఈ సీరియల్ కు 36వ వారంలోనూ ఏకంగా 12.36 రేటింగ్ రావడం విశేషం.

ఇది అర్బన్, రూరల్ కలిపిన రేటింగ్. ఇక కేవలం అర్బన్ చూసుకున్నా కూడా బ్రహ్మముడి 9.69 రేటింగ్ తో ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. రెండో స్థానంలో కార్తీక దీపం సీరియల్ నిలిచింది. ఈ సీరియల్ కు అర్బన్, రూరల్ కలిపి 11.69 రేటింగ్ వచ్చింది. కేవలం అర్బన్ చూసుకుంటే 9.19 రేటింగ్ సాధించింది.

టాప్ 10 స్టార్ మా సీరియల్స్ ఇవే

స్టార్ మా ఛానెల్లోని సీరియల్స్ లో మూడో స్థానంలో గుండె నిండా గుడి గంటలు ఉంది. ఈ సీరియల్ కు 10.83 టీఆర్పీ రేటింగ్ నమోదైంది. కేవలం అర్బన్ రేటింగ్ చూస్తే.. కార్తీక దీపం కంటే ఎక్కువగా 9.53 రేటింగ్ సాధించడం విశేషం.

ఇక నాలుగో స్థానంలో ఇంటింటి రామాయణం 9.7 రేటింగ్ తో ఉంది. ఈ సీరియల్ కు అర్బన్ ఏరియాలో 7.98 రేటింగ్ నమోదైంది. ఐదో స్థానంలో చిన్నీ (9.05), ఆరో స్థానంలో మగువా ఓ మగువ (7.37), ఏడో స్థానంలో పలుకే బంగారమాయెనా (5.6), ఎనిమిదో స్థానంలో నువ్వు నేను ప్రేమ (5.54), 9వ స్థానంలో మామగారు (5.03), పదో స్థానంలో వంటలక్క (4.92) సీరియల్స్ ఉన్నాయి.

ఏ సీరియల్ కు ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉందో చెప్పేందుకు ఈ టీఆర్పీ రేటింగ్సే ప్రామాణికం. స్టార్ మా సీరియల్స్ కు మొదటి నుంచీ మంచి ఆదరణ లభిస్తోంది. అందులోనూ బ్రహ్మముడి, కార్తీకదీపంలాంటి సీరియల్స్ ఈ ఛానెల్లోనే కాదు.. ఓవరాల్ గా కూడా తెలుగు సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ లో టాప్ 2లోనే నిలుస్తున్నాయి.

జీ తెలుగు సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్

ఇక జీ తెలుగు సీరియల్స్ విషయానికి వస్తే.. స్టార్ మా టాప్ 5లోని వాటికంటే తక్కువ టీఆర్పీలే నమోదయ్యాయి. ఆ ఛానెల్లో అత్యధికంగా 7.2 రేటింగ్ తో పడమటి సంధ్యారాగం నిలిచింది.

7.1తో మేఘ సందేశం రెండో స్థానంలో, 6.76తో నిండు నూరేళ్ల సావాసం మూడో స్థానంలో, 6.51తో జగద్ధాత్రి నాలుగో స్థానంలో, 6.38తో త్రినయని ఐదో స్థానంలో ఉన్నాయి. ఓవరాల్ గా చూస్తే తెలుగు సీరియల్స్ లో స్టార్ మాకు చెందినవే టాప్ 6లో ఉండగా.. ఏడో స్థానంలోగానీ జీ తెలుగు సీరియల్ కనిపించడం లేదు.