Zee Telugu Weekend Premieres: జీ తెలుగులో వీకెండ్ బొనాంజా.. హీరో తరుణ్ బుల్లితెర ఎంట్రీ-chiranjeevi bhola shankar tv premiere on zee telugu weekend premieres hero tarun guest to drama juniors 7 grand finale ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Zee Telugu Weekend Premieres: జీ తెలుగులో వీకెండ్ బొనాంజా.. హీరో తరుణ్ బుల్లితెర ఎంట్రీ

Zee Telugu Weekend Premieres: జీ తెలుగులో వీకెండ్ బొనాంజా.. హీరో తరుణ్ బుల్లితెర ఎంట్రీ

Sanjiv Kumar HT Telugu
Sep 12, 2024 12:58 PM IST

Bhola Shankar TV Premiere On Zee Telugu: జీ తెలుగులో ఈ వీకెండ్‌కు మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాను ప్రసారం చేయనున్నారు. ఈ సినిమాతోపాటు డ్రామా జూనియర్స్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే, పాపులర్ సీరియళ్లను టెలివిజన్ ప్రీమియర్స్ చేయనున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

జీ తెలుగులో వీకెండ్ బొనాంజా.. హీరో తరుణ్ బుల్లితెర ఎంట్రీ
జీ తెలుగులో వీకెండ్ బొనాంజా.. హీరో తరుణ్ బుల్లితెర ఎంట్రీ

Zee Telugu Weekend Premieres This Week: తెలుగు ప్రేక్షకులకు ఇరవై నాలుగు గంటలు నాన్​స్టాప్​ వినోదం అందించే జీ తెలుగు ఈ ఆదివారం (సెప్టెంబర్ 15) మరిన్ని ప్రత్యేక కార్యక్రమాలతో అలరించేందుకు సిద్ధమైంది. ఎన్నో అంచనాలతో థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను నిరాశపరిచిన మెగాస్టార్ మెగా సినిమా ‘భోళా శంకర్’​ను వరల్డ్​ ప్రీమియర్​‌గా ఈ ఆదివారం అందిస్తోంది.

అంతేకాకుండా, చిన్న పిల్లల్లోని టాలెంట్​ని ప్రోత్సహిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు చూపే సక్సెస్​ఫుల్​ రియాలిటీ షో డ్రామా జూనియర్స్ సీజన్​ 7 తుది అంకానికి చేరుకుంది. ఆలోచింపజేసే స్కిట్స్​, చిచ్చర పిడుగుల ప్రదర్శనతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన డ్రామా జూనియర్స్​ సీజన్​ 7 గ్రాండ్​ ఫినాలే రెండు భాగాలుగా ప్రసారం కానుంది.

సీరియళ్లు కూడా

మెగాస్టార్​ చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్​ నటించిన భోళా శంకర్ సెప్టెంబర్​ 15 అయిన ఆదివారం నాడు మధ్యాహ్నం 2:30 గంటలకు, డ్రామా జూనియర్స్​ సీజన్​ 7 గ్రాండ్​ ఫినాలే పార్ట్​ 1 రాత్రి 9 గంటలకు, జీ తెలుగులో ప్రసారం చేయనున్నారు. జీ తెలుగు అన్‌లిమిటెడ్ బొనాంజా వీకెండ్‌లో భాగంగా ఈ సినిమాతోపాటు రియాలిటీ షో, టీవీ సీరియళ్లను టెలీకాస్ట్ చేయనున్నారు.

ఇక జీ తెలుగు అభిమాన సీరియల్స్​ అయిన మేఘసందేశం, పడమటి సంధ్యరాగం ప్రత్యేక ఎపిసోడ్​ మహాసంగమం సెప్టెంబర్ 14, 15 తేదీల్లో రాత్రి 7.30 గంటలకు ప్రసారం కానుంది. రెండు సీరియల్స్​కు చెందిన నటీనటులు వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా జరుపుకోనున్నారు.

అయితే, వినోదాన్ని కొనసాగించే జీ తెలుగు డ్రామా జూనియర్స్ ఏడు సీజన్లతో ఏళ్ల తరబడి అందరి హృదయాలను గెలుచుకుంది. పాపులర్ కిడ్స్ రియాలిటీ షోగా పేరు తెచ్చుకున్న ఈ షో తుది అంకానికి చేరుకుంది. శ్రీరామ్ వెంకట్ యాంకర్​గా వ్యవహరించిన ఈ కార్యక్రమానికి ప్రీతి శర్మ, సౌందర్య మెంటర్లుగా వ్యవహరించారు.

తరుణ్ ఎంట్రీ

ఇక, ఈ సీజన్​కి సినీ ప్రముఖులు పూర్ణ, బలగం వేణు, జయప్రద న్యాయనిర్ణేతలుగా వ్యవహరించగా ప్రతిభావంతులైన చిన్నారులు ఈ సీజన్ ఆద్యంతం ఆకట్టుకునే ప్రదర్శనలతో అలరించారు. ఈ గ్రాండ్​ ఫినాలే పార్ట్​ 1 ఎపిసోడ్ కూడా​ యాంకర్​, జడ్జీలు, కంటెస్టెంట్ల గ్రాండ్ ఎంట్రీతోపాటు ఎన్నో అద్భుతమైన స్కిట్లతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోనుంది.

అంతేకాకుండా, ఈ గ్రాండ్​ ఫినాలేకి ముఖ్య అతిథిగా లవర్ బాయ్ తరుణ్ హాజరై విజేతలను ప్రకటించనున్నారు. మొదటిసారి బుల్లితెరపై తరుణ్​ ఎంట్రీతో ఈ గ్రాండ్​ ఫినాలే ఎపిసోడ్​ మరింత ప్రత్యేకంగా ప్రేక్షకులను అలరించనుంది. గ్రాండ్​ ఫినాలేలో భాగంగా తరుణ్, విక్టరీ వెంకటేశ్​లపై స్పెషల్ స్కిట్స్, కూతురు లక్ష్యాన్ని చేరుకోవడంలో తల్లిదండ్రులు పడే కష్టాలపై చేసే స్కిట్ ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయి.

అన్ని భావోద్వేగాల మధ్య గణేష్ పండుగ గురించి ఫన్నీ స్కిట్స్, టైమ్ ట్రావెల్ ఎక్స్‌పీరియన్స్ స్కిట్స్​ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ గ్రాండ్​ ఫినాలే ఎపిసోడ్​ సెప్టెంబర్ 15న మొదటి భాగం, సెప్టెంబర్ 22న రాత్రి 9 గంటలకు రెండవ భాగం ప్రసారం కానుంది. జీ తెలుగు డ్రామా జూనియర్స్ సీజన్ 7 టైటిల్ ఎవరు గెలుచుకున్నారో తెలుసుకోవాలంటే ఈ ఆదివారం, వచ్చే ఆదివారం ఎపిసోడ్స్​ తప్పకుండా చూడాల్సిందే.